9, జులై 2020, గురువారం

గురుదత్ - Gurudutt



గురుదత్ - నా pencil sketch.

వీరి జయంతి సందర్భంగా మిత్రులు ప్రసాద్ కెవి గారు తెలియపరచిన వివరాలు. వారికి నా ధన్యవాదాలు.


చచ్చినవాడి కళ్ళు చారడేసి......అని మన పెద్దాళ్ళు ఊరికే అనలేదు. అసలే పెద్దల మాట చద్దన్నం మూట అంటారుగా!
ఈ సామెతలు చెప్పేదేనా!?....అసలు విషయమేమన్నా ఉందా?....అని కోప్పడకండి.
వస్తున్నా....ఆ విషయానికే వస్తున్నా. ప్యాసా అనే మూవీ 1957 లో తీశారు. పరవాలేదు. బాగుంది అన్నారు.లాభాలూ వచ్చాయి బానే.
1959 లో... కాగజ్ కె ఫూల్ తీశారు.....సినిమా స్కోప్ లో. గొప్ప ఫలితాలను ఆశించారు దర్శక నిర్మాత. కానీ అది కాస్త ఫ్లాప్ అయి కూర్చుంది!
మరీ ఇంత స్లో నెరేషన్.....ఎప్పుడూ గ్లూమీ గా ఉండడం....ఎందుకో ప్రజలకు పట్టలేదు!
ఇంత కష్టపడి తీశాను....అయినా ప్రజలకు నచ్చలేదు! ఇక అసలు సినిమాలు తీయడం మానేస్తాను.....అని నిర్ణయం తీసుకున్నాడా దర్శక నిర్మాత....వసంతకుమార్ శివశంకర్ పడుకోన్!
ఆ మాటకు కట్టుబడ్డాడు కూడా!
విచిత్రంగా ఆ రెండు మూవీస్....ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్ 100 మూవీస్ లో చోటు సంపాదించడమే కాక,....
ఆ దర్శక- నిర్మాత - నటుడ్ని.....ప్రపంచ వ్యాప్తంగా....బెస్ట్ 25 యాక్టర్స్ లో ఒకడిని చేశాయి!
అదీ....ఆయన మరణించాక!
బ్రతికి ఉండగా ఆయన విలువ తెలియలేదు! పోయాక తెలిసింది!
అందుకే మరి.... చచ్చిన వాడి కళ్ళు చారడేసి.... అని అంటారు పెద్దలు!
***************
దీపికా పడుకోన్ అందరికీ తెలుసు. ప్రకాష్ పడుకోన్ కూడా తెలిసేఉండొచ్చు!
కానీ వసంతకుమార్ శివశంకర్ పడుకోన్......అంటే....ఎవ్వరికీ తెలిసి ఉండక పోవచ్చు.
ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్ 100 మూవీస్ లో ఆయన తీసిన 2 మూవీస్ ఉన్నాయి !
ఆసియాలోనే......బెస్ట్ 25 యాక్టర్స్ లిస్ట్ లో ఆయన పేరుంది!
టైం మాగజైన్....సైట్ & సౌండ్ మాగజైన్లు ....వారి కీర్తిని వేనోళ్ళ పొగిడాయి!
ఆయన తీసిన 2 సినిమాలు (ప్యాసా & కాగజ్ కె ఫూల్) ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ లో పాఠ్యాంశాలు!
****************
ఆయన మీకూ బాగా తెలిసిన వారే...గురుదత్ జీ. కొంతమంది...చాలా తక్కువ కాలం భూమిపై నడయాడినా....
వారి పెద్ద పాదముద్రలు....మన భూమండలం మీద మిగిల్చి పోతారు!
అలాంటి జీనియస్ గురుదత్!
బెంగుళూర్ లో పుట్టినా....డాన్స్ మీద మక్కువతో ఉదయశంకర్ ట్రూప్ లో చేరారు.
1944 లో ప్రభాత్ ఫిల్మ్ కంపెనీ లో కొరియోగ్రాఫర్ & అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరినప్పుడు....ఆయనకు దేవ్ ఆనంద్ ...బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు.
చాంద్(1944), లఖా రాణి(45) లలో నటించినా....
తనే దర్శకత్వం వహించిన బాజి(1951)(హీరో దేవానంద్) రిలీజ్ అయ్యేంతవరకు గుర్తింపు రాలేదు!
మొదటి నుండి దర్శకత్వం, ప్రొడక్షన్ మీదే దృష్టి. ఆ తరువాత 1953 లో గాయని గీతా రాయ్ ని పెళ్ళాడి గీతా దత్ ను చేశాడు.
ఆర్ పార్(1954), మిస్టర్ & మిసెస్ 55(1955) లాంటి మూవీస్ లో నటించినా...ఈ రెగులర్ కమర్షియల్ ఫార్మెట్స్....ఏ మాత్రం సంతృప్తినిచ్చేవి కావు!
ప్రపంచ వ్యాప్తంగా...అభినందించగలిగే మూవీస్ తీయాలి. అవి ఫారిన్ కంట్రీస్ లో కూడా పేరు తెచ్చుకోవాలి.ఇదీ అతని ధ్యేయం!
******************
ప్రజలకు...మా లగ్జరీలు, కార్లు, బంగళాలు, ఫారిన్ టూర్లు ....ఇలాంటివి కనిపిస్తాయి గానీ...
వాటికోసం...మేము ఏం కోల్పోతున్నామో తెలుసుకోలేరు! అవి పొందడానికి...మేమెంత మూల్యం చెల్లిస్తున్నామో కూడా ఐడియా ఉండదు!....అనేవాడు గురుదత్!
ప్యాసా(1957) & కాగజ్ కె ఫూల్(1959) రెండు మాస్టర్ పీసెస్ తీశాడు గురుదత్. ప్యాసా ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. అదే తెలుగు లో 20 సంవత్సరాల తరువాత మల్లెపువ్వు గా తెలుగు లో తీశారు!
కాగజ్ కె ఫూల్....అందరూ మెచ్చుకున్నా....డబ్బు రాలలేదు! ఇంత చక్కటి ఫిల్మ్...తీసినా...ప్రజలకు పట్టలేదంటే.....ఇక నేనసలు చిత్రాలు డైరెక్ట్ చేయను ...అని పట్టుబట్టి...అది చివరిదాకా నిలుపుకున్నాడు.
ఆయన పోయిన తరువాత....కాగజ్ కె ఫూల్ ....ప్రపంచ వ్యాప్తం గా పేరొంది....క్లాసిక్ గా గుర్తింపు పొందింది..మరి! అదే చిత్రం!
******************
గీతా దత్ కు ముగ్గురు పిల్లలు.
గురుదత్....వహిదా రెహ్ మాన్ తో ప్రేమలో పడ్డాడు. అసలావిడను బొంబాయి తీసుకొచ్చి...మొట్టమొదట సి.ఐ.డి (1956) లో నటింప చేసింది గురుదత్తే! (దానికి ముందు తెలుగులో ఏరువాక సాగారో...పాటకు నృత్యం చేసింది.) దాన్ని చూసే...గురుదత్ ఇంప్రెస్ అయ్యాడు.
ఇక వహీదా తో ఒన్ సైడ్ లవ్ అయ్యింది. వహీదా అంతగా స్పందించలేదంటారు. నటన మాత్రం అందిపుచ్చుకుని...అగ్రస్థానానికెళ్ళింది.
అయినా పెళ్ళై..పిల్లలున్న వాడ్ని...ఎందుకు ప్రేమించాలి ఆవిడ! మరి గురుదత్ ....శైలే అది. అన్నీ విపరీతమే!
అప్పుడప్పుడు ...డిప్రెషన్ కు లోనై....ఆత్మహత్యా యత్నాలు కూడా చేశాడు!
ఆ తరువాత నటించాడు కానీ...డైరెక్ట్ చెయ్యలేదు. చౌద్వీ కా చాంద్(60), సాహెబ్ బీబీ ఔర్ గులాం(1962)...లాంటి కొన్ని మూవీస్ లో నటించినా ...తన మనస్సు....సినిమాల మీద లేదు!
******************
1964 దాకా నటిస్తూనే ఉన్నాడు. ఆ సంవత్సరంలోనే.....బహారే ఫిర్ భి ఆయేంగా లో ఓ సీన్ నటించి...హోటల్ కెళ్ళాక....రాత్రి నిద్రించిన తరువాత మరి తెల్లవారి లేవ లేదు!
శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు . ఓవర్ డోస్ ఆఫ్ స్లీపింగ్ పిల్స్ అంటారు. పిల్స్ & ఆల్కహాల్ అంటారు!
ఏదైనా ఈ సినీ జీవితాల లోని మాయామేయాలు అంతర్ముఖుడైన(ఇంట్రావర్ట్) గురుదత్ జీర్ణించుకోలేక పోయాడు.
మరలి రాని లోకాలకు తరలి పోయాడు 39 ఏళ్ళకే(10-10-1964)!


వారి సినిమాలు మాత్రం శాశ్వతమై మిగిలాయి!

కామెంట్‌లు లేవు:

"మహామహోపాధ్యాయ" తాతా సుబ్బరాయశాస్త్రి

తాతా సుబ్బరాయశాస్త్రి - charcoal pencil sketch  ఈనాడు నా పెన్సిల్ తో చిత్రీకరించుకున్న చిత్రం. ఈ మహానీయుని గురించి వివరాలు క్రింది లింకు క్ల...