14, జులై 2020, మంగళవారం

మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి


"కళాప్రపూర్ణ" మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు. (pencil sketch)
ఈ రోజు అలా అలా అంతర్జాలంలో search చేస్తుంటే ఓ ఆసక్తికర విషయం తెలిసింది. మీతో షేర్ చేసుకోవాలని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.
"సాహిత్య మరమరాలు
ఒకరోజు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి ఇంటికి ఒక వ్యక్తి వచ్చారు. ఆయనకు మర్యాదలు చేసి కూర్చోబెట్టారు ఇంట్లో వారు.
కాసేపటికి శాస్త్రిగారు వచ్చారు. వచ్చినాయన సంభాషణ మొదలెట్టారు. 1940 నుంచీ తేదీలతో సహా తన సాహిత్య కార్యక్రమాలు, అల్పమైన విషయాల్ని సైతం విడిచిపెట్టకుండా చెప్పుకుపో...తు... న్నారు. 1945, 50, 60 ...
మధునాపంతుల వారిలో అసహనం పెరిగిపోతోంది. అక్కడకు కొంచెం దూరంలో ఉన్న తమ్ముడి కుమారుడితో, ‘‘ఒరేయ్‌ చంటీ, ఒకసారిలా వచ్చి 1991 వచ్చాక చెప్పు, అప్పుడొస్తాను ’’ అని తన గదిలోకి వెళ్లిపోయారు. వచ్చినాయన బిత్తరపోయాడు.
ఉబలాటం అనండి, లౌల్యం అనండి స్వవిషయాలు ఊకదంపుడుగా చెప్పేసుకుంటే వినేవాళ్ళకు విసుగు పుట్టిస్తాయి. ఇక ఇపుడు విచారించి ప్రయోజనం లేదు. మితంగా పరిచయం చేసుకోవాలనే జ్ఞానం ఆలస్యంగా కలిగిందాయనకు.
-దాట్ల దేవదానం రాజు "
(September 30, 2019 సాక్షి దినపత్రిక సౌజన్యంతో)
(ఇటీవల మిత్రులు శ్రీ కొంపెల్ల శర్మ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం పౌర గ్రంధాలయంలో కళాప్రపూర్ణ, అభినవ నన్నయగా కీర్తించబడే మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారి శతజయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా శాస్త్రి గారి చిత్రాన్ని చిత్రీకరించి శాస్త్రి గారి కుమారునికి సమర్పించుకునే మహద్భాగ్యం కలిగింది.
శాస్త్రి గారి ఈ చిత్రాన్ని ఏప్రిల్ నెల 'తెలుగుతల్లి కెనడా' పత్రిక వారు 'మూర్తిమంతమాయె' శీర్షికలో ప్రచురించారు. వారికి నా ధన్యవాదాలు)

కామెంట్‌లు లేవు:

The power of 'Will' Usage - English grammar - illustration

  When we use will to make a promise 🤝 or an offer 💡, we are usually deciding to do something at the very moment we are speaking. It shows...