16, జులై 2020, గురువారం

గాయని కె. రాణి - K. Rani, Pencil sketch

ic
కె. రాణి -- స్మరించుకుందాం (పెన్శిల్ చిత్రం)
"అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా" ఎంత హిట్ పాటండీ ఇది !! కె. రాణి గారు పాడిన ఈ పాట ఇప్పటికీ జనం నోళ్ళలో నానుతోంది. రాణి గారు స్వర్గస్తులై రెండు సంవత్సరాలయ్యింది. కాని ఆమె పాడిన కొన్ని పాటలు అజరామరాలుగా నిలిచాయి.
టూకీగా ఆమె గురించి - (dailyhunt నుండి సేకరణ)
'దేవదాసు'లో 'అంతా భ్రాంతియేనా.. జీవితాన వెలుగింతేనా' అనే మరపురాని విషాద గీతం ఆమె ఆలపించినదే. అదే చిత్రంలో 'చెలియ లేదు.. చెలిమిలేదు' గీతం కూడా ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. 'జయసింహ'లో 'కొండమీద కొక్కిరాయి...'; 'పెళ్లి చేసి చూడు'లో 'అమ్మా... నొప్పులే...'; లాంటి ఎన్నో జనరంజకమైన గీతాలను ఆమె ఆలపించారు. ఆమె అసలు పేరు.. కె.ఉషారాణి. 1942లో కర్ణాటకలోని తుముకూరు పట్టణంలో కిషన్‌, లలిత దంపతులకు జన్మించారు. తండ్రి రైల్వేలో ఉద్యోగి. వీళ్ల కుటుంబం ఉత్తర భారతదేశం నుండి వచ్చి కడపలో స్థిరపడ్డారు. 1966లో జి.సీతారామరెడ్డితో రాణికి వివాహం జరిగింది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు.
కొంతకాలంగా హైదరాబాద్‌లోని కళ్యాణ్‌ నగర్‌లో తన పెద్ద కుమార్తె విజయతో కలసి ఉంటున్నారు. తన తొమ్మిదవ యేటనే సినీ నేపథ్యగాయనిగా అరంగేట్రం చేశారీమె. పలు భాషల్లో పాటలు పాడిన ఆమె సింహళ, ఉజ్‌బెక్‌ భాషల్లో పాడిన తొలి గాయనిగా గుర్తింపు పొందారు. శ్రీలంక జాతీయగీతం ఆలపించిన ఘనత కూడా రాణికి దక్కింది.

ఈమెను 'మెల్లిసై రాణి' అని అప్పటి జాతీయ కాంగ్రెస్‌ నేత కె.కామరాఙ్ కీర్తించారు. అప్పటి భారత రాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌ సమక్షంలో రాష్ట్రపతి భవన్‌లో తన గానా మృతంతో ఓలలాడించారు. విషాద గీతాలకు రాణి ప్రసిద్ధి. ఆమె గొంతులోని కోమలత్వం పాటకు కొత్త సొగసుల్ని తీసుకొచ్చేది.

ఆ తరంలో దాదాపు అగ్రగణ్యులైన గాయనీ గాయలకులు, సంగీత దర్శకులందరితో పనిచేశారు. - న్యూస్‌టుడే, వెంగళరావునగర్‌ కె.రాణి కొన్ని సూపర్‌ హిట్‌ గీతాలివి... * ''నా తనువే సుమా స్వర్గసీమా కమ్మని తావి వెదజల్లు'' (రూపవతి) * ''నా జీవిత సౌధము నవశోభలతో నిలిపే పాపవే'' (అత్తింటి కాపురం) * ''ఏ ఊరే చిన్నదానా తొలకరి మెరుపల్లె మెరసేవు'' (ధర్మ దేవత) * ''బ్రహ్మయ్యా ఓ బ్రహ్మయ్యా'' (పెళ్లి చేసి చూడు) * ''ఆవో మహారాజ్‌..ఒక జాన్‌ కడుపే లేదంటే ఈ లోకాన లేదు గలాటా'' (సింగారి) * ''ఓహో హో బ్యూటీ దిస్‌ ఈజ్‌ మై డ్యూటీ ఆహా హా బ్యూటీ'' (పుట్టిల్లు) * ''సార్‌ సార్‌ సార్‌ పాలీష్‌ ఒక్క బేడకు చక్కని పాలీష్‌ చెక్కు చెదరితే డబ్బులు వాపస్‌'' (నిరు పేదలు) * ''మా వదిన మా వదిన నా పేరున ఒక జాబును వ్రాసింది'' (మా గోపి) * ''ఎంచక్కా ఎంచక్కా ఎంచక్కా'' (చిరంజీవులు) * ''అత్తవారింటికి పంపేదెలాగమ్మ అల్లరుముద్దుల అపరింజి''(బాల సన్యాసమ్మ కథ) * ''సొగసరి దాననయ్య రంగేళి'' (అల్లావుద్దీన్‌ అద్భుతదీపం) * ''ఎంతెంత దూరం కోశెడు దూరం నీకు మాకు చాలా చాలా దూరం'' (తోడి కోడళ్లు) * ''రావో రావో ప్రియతమా'' (వద్దంటే పెళ్లి) * ''ఒకటే మా వయసు'' (మాయాబజార్‌) * ''తమలపాకు సున్నము పడుచువాళ్లకందము'' (కొండవీటి దొంగ) * ''వెలుగేలేని ఈ లోకాన జాలే లేని ఈ జగాన ఎడారియేగా'' (శోభ) * ''ఝంఝంఝం ఝమా బావా బంకమట్టిలాగ పట్టినావు'' (దైవ బలం) * ''ఓహోహో కాంతమ్మ ఒక్కసారి చూడమ్మా కొత్త పెళ్ళి కూతురులా'' (మనోరమ) * * ''ఓ మావయ్యా .. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకటిలో'' (సిపాయి కూతురు) * ''ఏమి పేరు పెట్టుదాం ఏమని చాటుదాం'' (కన్న కూతురు) * ''ఒట్టేసుకో ఒట్టేసుకో ఓ మరదలా నను కట్టేసుకో''(ఉషా పరిణయం) * ''ఆంగ్ల నాగరిక రీతులు అధ్బుతమైన కళాజ్యోతులు''(ధాన్యమే ధనలక్ష్మి) * ''టిక్కు టెక్కుల చిట్టి టెక్కు నిక్కు హోయల చిట్టి''(యోధాన యోధులు)

News courtesy: dailyhunt

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...