5, డిసెంబర్ 2020, శనివారం

ఘంటసాల - నవమృదంగ నాదసుధా వరనిధియే తాను (గజల్)



My pencil sketches


అమర గాయకుడు ఘంటసాల పై గజల్ రచించిన మిత్రులు శ్రీ మాధవరావు కొరుప్రోలు  గారికి ధన్యవాదాలు సమర్పించుకుంటూ ..

నవమృదంగ నాదసుధా..వరనిధియే తాను..!
అజరామర స్వరధారా..వాహినియే తాను..!
శుక్లాంబర ధర సన్నుత..హంసధ్వని విజయ..
గీర్వాణీ ప్రియ వీణా..విభూతియే తాను..!
తెలుగువారి యాడపడుచు..కెంత సిగ్గు నింపె..
మధురామృత పదలహరుల..ఊపిరియే తాను..!
కరుణశ్రీకి కిరీటమై..విరాజిల్లె నేల..
పుష్పవిలాప సౌగంధ..విరాగియే తాను..!
తారకరామ జగదేకవీర శివానందలహరి..
అశేష జనహృదయ నిత్య..విహారియే తాను..!
చిత్రసీమా మనోజ్ఞ..విశ్వంభరుడహో..
శేషశైల వాసగాన..వినోదియే తాను..!
ప్రియమాధవానంద నిలయుడే'ఘంటసాల'..
శాశ్వతానంద మంగళ..హారతియే తాను..!


కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...