1, మార్చి 2022, మంగళవారం

నవ్వు - pencil sketch of a laughing old man.


మోమున చిరునవ్వు ధరించడమే నిజమైన అలంకారం అంటారు మిత్రులు శ్రీ వెంకటేశ్వర ప్రసాద్ గారుగారు. నేను చిత్రీకరించిన  ఈ చిత్రానికి వారి స్పందన :

కం.
అంగీలెన్ని ధరించిన
తింగరి! ముఖమందు నవ్వు దెల్పక యున్నన్
రంగగు నగుమోమొకటే
హంగుగ మనుజునికి నిజపు యంగీ గనగన్

Pencil sketch of a laughing old man. 

నవ్వవే నా చెలీ .. అంటాడొక సినీ కవి

సిరిమల్లె పూవల్లె నవ్వు అంటాడు మరొక సినీ కవి

నవ్వుల నదిలో పువ్వుల పడవ .. అంటాడు ఇంకో సినీ కవి

నవ్వు మదిని హాయి గొలుపుతుంది. అందుకే నవ్వుకి అంత ప్రాధాన్యతనిచ్చారు మన కవులు.


ఇంక నవ్వు ఆరోగ్యానికి ఎంత మంచిదో, ఎన్ని రకాల నవ్వులున్నాయో వివరంగా ఇచ్చారు  వికీపీడియా వారు. ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చదవండి.

https://te.wikipedia.org/wiki/%E0%B0%A8%E0%B0%B5%E0%B1%8D%E0%B0%B5%E0%B1%81

ధన్యవాదాలు 

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...