త్రిపురమేని గోపీచంద్ + charcoal pencil sketch
4, డిసెంబర్ 2023, సోమవారం
త్రిపురనేని గోపీచంద్
త్రిపురమేని గోపీచంద్ + charcoal pencil sketch
30, నవంబర్ 2023, గురువారం
మాదిరెడ్డి సులోచన
మాదిరెడ్డి సులోచన, ప్రముఖ రచయిత్రి - charcoal pencil sketch
ఈమె 1965 లో ‘జీవయాత్ర’ పేరుతో మొదటి నవల వ్రాసింది. ఈమె దాదాపు 150 కథలు, 72 నవలలు, 2 నాటికలు, 10 ఏకాంకికలు రచించింది. వీనిలో 10 నవలలు సినిమాలుగా రూపొందాయి. తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే ఆలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించింది. ప్రేమలు, పెళ్ళిళ్ళు కంటే కుటుంబ జీవితానికి ప్రాధాన్యం ఇచ్చింది. ఉత్తమ ఉపాధ్యాయిని, ఉత్తమ కథా రచయిత్రి అవార్డులు పొందింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయిని.
1935లో రంగారెడ్డి జిల్లా లోని శంషాబాద్ గ్రామంలో జన్మించిన ఈమె 1984లో ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన దుర్ఘటనలో మరణించింది.
26, నవంబర్ 2023, ఆదివారం
గాలి పెంచల నరసింహారావు సంగీత దర్శకుడు
గాలి పెంచల నరసింహారావు (ఇంటిపేరు - గాలి; వ్యక్తి పేరు - పెంచల నరసింహారావు) (1903 - 1964).
Charcoal pencil sketch
తెలుగు చలనచిత్ర సంగీతదర్శకులలో మొదటి తరానికి చెందినవారు. దక్షిణభారతదేశంలో నిర్మితమైన మొట్టమొదటి చిత్రం సీతాకళ్యాణం (1934) ఆయన సంగీతం అందించిన మొదటి చిత్రం. ఆయన చివరి చిత్రం ఎన్.ఏ.టి వారి సీతారామ కల్యాణం (1961), ఆ చిత్రం ఆయన సంగీతం అందించిన చిత్రాలలో అన్నింటికన్నా పెద్ద విజయం సాధించింది. ఈ చిత్రంలో ఆయన స్వరపరచిన సీతారాముల కళ్యాణం చూతము రారండి పాట ఎంతో పెద్ద విజయం సాధించింది. ఆ పాట ఇప్పటికి శ్రీరామనవమి నాడు, పెళ్ళి కార్యక్రమాలలో వినిపిస్తూనే ఉంటుంది. ఆయన సంగీతం అందించిన తొలి, చివరి చిత్రాలు ఒకే నేపథ్యం ఉన్న కథతో తయారుకావడం కాకతాళీయం.
1936లో విడుదలైన మాయాబజార్ లేక శశిరేఖా పరిణయం చిత్రంలో ఆయన స్వరపరిచిన వివాహభోజనంబు పాటయే ఘంటసాల స్వరపరిచిన 1957లోని మాయాబజార్లోని పాటకు ఆదర్శం.
1943లో వచ్చిన పంతులమ్మ చిత్రంలో కృష్ణవేణి అనే అమ్మాయికి పాడే అవకాశం ఇచ్చారు, ఆమె ఎవరో కాదు మధుర గాయని జిక్కి. ఈ చిత్రంలో ఆమె ఈ తీరున నిన్నెరిగి పలుకగా నాతరమా అనే పాట స్వయంగా నటిస్తూ పాడారు. 1945లో వచ్చిన మాయలోకం చిత్రం ద్వారా అలనాటి ప్రముఖ సంగీతదర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావును తన బృందంలో హార్మోనిస్టుగా అవకాశం ఇచ్చారు. 1947లో వచ్చిన పల్నాటి యుద్ధం చిత్రానికి ఆయనే సంగీతదర్శకుడు. ఈ చిత్రంలో తనకు సహాయకునిగా పనిచేసిన ఘంటసాలతో కొన్ని పాటలు పాడించారు. ఆ చిత్రంలోని పాటలు చాలా ప్రాధాన్యత ఉన్నవి, ఎందుకంటే అందులో అక్కినేని నాగేశ్వరరావు స్వయంగా పాటలు పాడారు, అక్కినేని నాగేశ్వరరావు, ఘంటసాల కలిసి ఒక పాట పాడారు. ఘంటసాల, కన్నాంబ కలిసి ఒక యుగళగీతం (భక్తిగీతం) - తెరతీయగరాదా దేవా ఆలాపించారు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వరలక్ష్మి కలిసి ఒక యుగళగీతం ఆలాపించారు.
1948లో వచ్చిన బాలరాజు చిత్రంలో ఈయన స్వరపరచిన పాటలు ఆ చిత్ర విజయానికి ముఖ్య కారణం. ఘంటసాల పాడిన చెలియా కనరామా, ఎస్.వరలక్ష్మి పాడిన ఎవరినే నేనెవరినే మొదలైన పాటలు, ఆ చిత్ర విజయానికి దోహదపడ్డాయి. ఆ చిత్రంలో కొన్ని పాటలను ఘంటసాల కూడా స్వరపరిచారు, అందుకు కారణం గాలిపెంచలనే.
ఆయనకి సంగీతోపాధ్యాయ అని బిరుదు. నరసింహారావుగారు సంగీతం అందించిన చిత్రాలన్నీ సంగీతపరంగా పెద్ద విజయాలను సాధించాయి. ఆయన ఇంటిపేరును చాలామంది గాలి పెంచల అనుకుంటారు, కానీ ఆయన ఇంటిపేరు గాలి, అసలు పేరు పెంచల నరసింహారావు. కొన్ని చిత్రాలలో ఆయనపేరును జి.పెంచలయ్యగా, కొన్ని చిత్రాలలో గాలి పెంచలగా, కొన్ని చిత్రాలలో పూర్తి పేరును వేశారు. పెంచల నరసింహారావు 61 ఏళ్ళ వయస్సులో మే 25, 1964 పరమపదించారు.
(ఇక్కడ అక్కడ చదివి సేకరించిన వివరాలు ఆధారంగా నేను చిత్రీకరించుకున్న నర్సింహారావు గారి చిత్రం తో ఈ పోస్టు)
11, నవంబర్ 2023, శనివారం
చంద్రమోహన్ - అద్భుత నటుడు
అద్భుత నటుడు చంద్రమోహన్ - నా చిత్ర నివాళి (pen and ink sketch)
తెలుగు చిత్రసీమ ఓ అద్భుత నటుణ్ణి కోల్పోయింది. వికీపీడియా సౌజన్యంతో వారి గురించి టూకీగా వివరాలు ఇక్కడ పొందుపరుస్తున్నాను.
చంద్రమోహన్ (1942 మే 23 - 2023 నవంబరు 11) గా ప్రసిద్ధులైన మల్లంపల్లి చంద్రశేఖర రావు తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు. కథానాయకుడిగా 175 పైగా, మొత్తం 932 సినిమాల్లో నటించాడు.[2] 1966లో రంగులరాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ఆరంభమైంది. అప్పటి నుండి సహనాయకుడిగా, కథనాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటాడు.
క్రొత్త హీరోయన్‌లకు లక్కీ హీరోగా చంద్రమోహన్‌ను పేర్కొంటారు. సిరిసిరిమువ్వలో జయప్రద, పదహారేళ్ళ వయసులో శ్రీదేవి తమ నటజీవితం ప్రాంభంలో చంద్రమోహన్‌తో నటించి తరువాత తారాపథంలో ఉన్నత స్థాయికి చేరుకున్నాడు.చంద్రమోహన్ చివరి సినిమా 2017లో వచ్చిన ఆక్సిజన్ (సినిమా)లో నటించాడు.
28, అక్టోబర్ 2023, శనివారం
చెంబై వైద్యనాథ్ భాగవతార్
25, అక్టోబర్ 2023, బుధవారం
టి. ఎన్. రాజరత్నం పిళ్ళై - T. N. Rajartinam Pillai, Nadaswara Maestro
Thirumarugal Natesapillai Rajarathinam Pillai or TNR was an Indian Carnatic musician, nadaswaram maestro, vocalist and film actor. He was popularly known as "Nadaswara Chakravarthi"
నా చిత్రకళ హాబీతో ఈ రోజు టి. ఎన్. రాజరత్నం పిళ్ళై చిత్రాన్ని చిత్రీకరించుకున్నానూ. వీరి గురించి క్లుప్తంగాః
తిరుమరుగల్ నటేసపిల్లై రాజరథినం పిళ్లై (27 ఆగష్టు 1898 - 12 డిసెంబర్ 1956) లేదా TNR ఒక భారతీయ కర్ణాటక సంగీత విద్వాంసుడు , నాదస్వర విద్వాంసుడు , గాయకుడు మరియు చలనచిత్ర నటుడు. అతను "నాదస్వర చక్రవర్తి" (అక్షరాలా, నాదస్వరం చక్రవర్తి)గా ప్రసిద్ధి చెందాడు.
భారతీయ తపాలా శాఖ వీరి గౌరవార్ధం ఓ తపాలా బిళ్ల విడుదల చేసింది.
మరిన్ని వివరాలు వికీపీడియాలో శొధించగలరు.
21, అక్టోబర్ 2023, శనివారం
ఎమ్. ఎస్. స్వామినాథన్ - హరిత విప్లవ పితామహుడు
ఎమ్. ఎస్. స్వామినాథన్ (charcoal pencil sketch)
వీరి గురించి క్లుప్తంగా :
14, అక్టోబర్ 2023, శనివారం
ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ - కర్ణాటక సంగీత విద్వాంసులు
ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ (9 ఏప్రిల్ 1899 – 25 మార్చి 1975) ఒక కర్ణాటక సంగీత విద్వాంసుడు. ఇతడు 1920-1940ల మధ్యకాలంలో అనేక సంగీత ప్రదర్శనలు చేశాడు. కచేరీలు చేయడం మానుకొన్న తర్వాత కర్ణాటక సంగీత గురువుగా శాస్త్రీయ సంగీత ప్రపంచంలో తలమానికంగా నిలిచాడు.
వీరి గౌరవార్థం భారతీయ తపాలా శాఖ వారు ఓ తపాలా బిళ్ళ విడుదల చేశారు.
6, అక్టోబర్ 2023, శుక్రవారం
పుట్టినమొదలు నేను పుణ్యమేమి గాననైతి యెట్టు గాచేవయ్య నన్ను యిందిరానాథా - అన్నమయ్య కీర్తన
యెట్టు గాచేవయ్య నన్ను యిందిరానాథా
కామినుల జూచి చూచి కన్నుల గొంతపాపము
వేమరు నిందలు విని వీనుల గొంతపాపము
నామువార గల్లలాడి నాలిక గొంతపాపము
గోమున పాపము మేన గుప్పలాయ నివిగో
చరణం 2
కానిచోట్లకు నేగి కాగిళ్ళ గొంతపాపము
సేవ దానాలందుకొని చేతుల గొంతపాపము
మాననికోపమే పెంచి మతి గొంతపాపము
పూని పాపములే నాలో బోగులాయ నివిగో
చరణం 3
చేసినట్టి వాడగాన చెప్ప నీకు జోటులేదు
దాసుడ నేనైతి గొన దయతలచితివయ్య
యీసరవులెల్ల జూచి యేమని నుతింతు నిన్ను
ఆసల శ్రీవేంకటేశ ఆయబోయ బనులు
4, అక్టోబర్ 2023, బుధవారం
డాక్టర్ వర్ఘీస్ కురియన్ - శ్వేత విప్లవ పితామహుడు
charcoal pencil sketch drawn by me.
డాక్టరి వర్ఘీస్ కురియన్ (నవంబర్26, 1921 – సెప్టెంబరు 9, 2012) భారతదేశ ప్రముఖ సామాజిక వ్యాపారవేత్త, శ్వేత విప్లవ పితామహుడు. భారతదేశం ప్రపంచ పాల ఉత్పత్తిలో మొదటి స్థానం లో ఉండటంలో ప్రముఖ పాత్ర పోషించాడు.ఆయన యొక్క "బిలియన్ లీటర్ ఐడియా" (ఆపరేషన్ ప్లడ్ - ప్రపంచంలో అతి పెద్ద వ్యవసాయాభివృద్ధి కార్తక్రమంగా నిలిచింది. ఈ కార్యాచరణ భారత దేశంలో అత్యల్ప పాల ఉత్పత్తి నుండి అధిక పాల ఉత్పత్తి గల దేశంగా ప్రపంచంలో నిలిపింది. 1998 లో పాల ఉత్పత్తిలో అమెరికా సంయుక్త రాష్ట్రాలను అధిగమించేటట్లు భారత దేశాన్ని నిలిపాడు. 2010-11 లో ప్రపంచ వ్యాప్తంగా 17 శాతం గ్లోబల్ అవుట్ పుట్ ను సాధించగలిగాడు. అనగా ప్రతి వ్యక్తికి 30 సంవత్సరాలలో రెట్టింపు పాల లభ్యత సాధించగలిగాడు. పాడి పరిశ్రమ భారతదేశం యొక్క అతిపెద్ద స్వీయ నిరంతర పరిశ్రమ అయ్యింది. అతను, తరువాత దేశం వంట నూనెల ఉత్పత్తిలో కూడా స్వయం ప్రతిపత్తి సాధించేందుకు ప్రయత్నించి, పాక్షికంగా విజయవంతం అయ్యారు.
(సౌజన్యం : వికీపీడియా)
3, అక్టోబర్ 2023, మంగళవారం
కపిలవాయి రామనాథశాస్త్రి - ప్రసిద్ధ రంగస్థలం నటుడు
వీరు చిన్నతనంలోనే మైలవరం నాటక కంపెనీలో ప్రవేశించి దానికి ఉజ్వల చరిత్ర సంపాదించారు. యడవల్లి సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో నటనలోను, పద్యపఠనంలోనూ మెరుగులు దిద్దుకున్నారు. రంగస్థల ప్రపంచంలోనే ఒక క్రొత్త మార్పు తెచ్చినవారుగా వీరు ప్రఖ్యాతిపొందారు. వీరి నటన, గాయక శైలి ఎందరినో ప్రభావితుల్ని చేసింది. వీరిలాగా పాడాలని చాలామంది నటులు, నటీమణులు ఆరాటపడేవారు. పద్యంలోని భావం చెడకుండా ప్రతి అక్షరాన్ని చివరకు పూర్ణానుస్వారాన్ని సైతం స్పష్టంగా పలికి సంగీత మాధురిని దానికి జతకూర్చేవారు. వీరి శ్రావ్యమైన కంఠధ్వని తోడై వీరి గానం ప్రజలను అత్యద్భుత రీతిలో ఆకట్టుకొనేది. ఆనాడు ఈయనకు ఈనాటి సినిమా తారలకున్నంత అభిమానులు ఉండేవారు. ఈయన పద్యం పాడితే వన్స్ మోర్ కొట్టి మళ్లీ మళ్లీ పాడించుకునేవారు. ఒకే రాత్రి రెండు పట్టణాలలో ప్రదర్శించే నాటకాలలో పాత్రలు ధరించిన రోజులు ఉన్నాయి. ఈయన నాటకానికి జనాలు తండోపతండాలుగా వచ్చేవారు. మైలవరం కంపెనీ మూతపడిన తర్వాత కిరాయి నాటకాలలో నటించారు.
ఈయన స్వరంతో వెలువడినన్ని గ్రామఫోన్ రికార్డులు ఆ రోజుల్లో ఏ నటుడు ఇవ్వలేదు. ఈ రికార్డులు ఆ రోజుల్లో కొన్ని వేలు అమ్ముడుపోయాయి. పెళ్ళిళ్లలోనూ, ఇతర శుభకార్యాలలోనూ కపిలవాయి రికార్డులనే విరివిగా పెట్టేవారు. ఇవి తమిళనాడు, మైసూర్ రాష్ట్రాలలో కూడా ప్రజాదరణపొందాయి. అతి తక్కువకాలంలో ఆంధ్రదేశమంతటా చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. రెండు చేతులా సంపాదించాడు కానీ, సంపాదనంతా దురభ్యాసాలకు ఖర్చు చేశాడు
2, అక్టోబర్ 2023, సోమవారం
కనుపర్తి వరలక్ష్మమ్మ
charcoal pencil sketch of Kanuparti Varalakshmamma drawn by me.
మరిన్ని వివరాలు ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చదవండి.
30, సెప్టెంబర్ 2023, శనివారం
సిస్టర్ నివేదిత - వివేకానందుడి బోధనలకు ప్రబావితమైన విదేశీ మహిళ (charcoal pencil sketch)
సిస్టర్ నివేదిత వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందూమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళ.
భారత తపాలా శాఖ ఈమె గౌరవార్ధం ఓ తపలా బిళ్ళ విడుదల చేసింది.
మరిన్ని వివరాలు ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చదవండి. సౌజన్యం : ప్రభాత వెలుగు
వ్యాసం సౌజన్యం : శ్రీ సామల కిరణ్
https://www.v6velugu.com/sister-nivedita-replica-of-indianness
తిరుపతి వెంకట కవులు - తెలుగు సాహిత్యంలో జంట కవులు - నా pencil చిత్రాలు.
నా charcoal pencil sketches
చిన్నప్పుడు స్కూల్ లో చదెవేటప్పుడు వీరి గురించి తెలుసుకున్నాను. నాకు వీరి చిత్రాలు నా pencil తో వేసుకునే భాగ్యం కలిగింది. వీరిరువురి గురించి వికీపీడియా లో చదివి మరిన్ని వివరాలు తెలుసుకోగలిగాను. మీ సౌలభ్యం కోసం వికీపీడియా లింక్ క్రిందని ఇస్తున్నాను. చదివి తరించండి.
ధన్యవాదాలు.
18, సెప్టెంబర్ 2023, సోమవారం
పొన్నాడ కుమార్ - రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి
కీ. శే. పొన్నాడ కుమార్ గారు నాకు స్వయానా పినతండ్రి.
కుమార్ గారు గొప్ప రచయిత, నటులు, గాయకులు కూడా. వీరితో నా అనుబంధం మరువరానిది.
నా చిన్నతనంలో మేము ఉండే రైల్వే క్వార్టర్ కి ఓ అర కిలో మీటర్ దూరంలో కుమార్ గారి క్వార్టర్ ఉండేది వారు కూడా రైల్వే ఉద్యోగులే. కుమార్ గారు తమ విరామ సమయంలో సాహితీ సేవ, నాటకరంగ సేవ చేస్తూ ఉండేవారు. వారు రచించిన కథలు, కవితలు వ్యాసాలు ఆనాటి ప్రముఖ తెలుగు పత్రికలు చిత్రగుప్త, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక తదితర పత్రికల్లో ప్రచురితమయ్యేవి. అవి మాకు చూపిస్తూ ఉండేవారు. కారా మాస్టారు గా ప్రసిద్ధి చెందిన కీ. శే. కాళీపట్నం రామారావు గారు శ్రీకాకుళం లో స్థాపించిన "కథానిలయం" గ్రంధాలయం లో పొన్నాడ కుమార్ గారి కథలు కొన్ని లభ్యం. నేను ఇప్పుడు ఓ ప్రముఖ చిత్రకారునిగా, కార్టూనిస్ట్ గా పేరు సంపాదించుకోవడం వెనుక ఆయన ప్రోత్సాహం చాలా ఉందని చెప్పక తప్పదు.
ఇంక నాటక రంగానికి వస్తే వారు చాలా పౌరాణిక సాంఘిక నాటకాల్లో నటించారు. నేను చిన్నప్పుడు కటక్ నుండి భద్రక్ వెళ్లి వారు నటించిన పౌరాణిక నాటకం చూడడం నాకు బాగా గుర్తు. ఉద్యోగ బాధ్యతల్లో ఉన్నా కూడా వారు ఆనాటి ప్రముఖ పౌరాణిక నాటక రంగ నటులైన ఈలపాట రఘురామయ్య, సూరిబాబు, పీసపాటి వంటి నటులతో కూడా నటిస్తూ ప్రదర్శనలు ఇచ్చేవారు. అటువంటి ఓ నాటకం ఒడిస్సాలో భద్రక్ పట్టణంలో ప్రదర్శించగా నా చిన్నతనంలో తిలకించే భాగ్యం కలిగింది. బరంపురంలో వారు మా నాన్నగారు శ్యాంసుందర్ రావు గారు తదితర బరంపురంల ప్రఖ్యాత స్థానిక నటులతో కలిసి ప్రదర్శించిన " పల్లెపడుచు " అనే సాంఘిక నాటకం తిలకించే భాగ్యం కూడా కలిగింది.
కుమార్ గారు మంచి గాయకులు. నాటకాల్లో ఆయన పద్యాలు ఆయనే పాడుకునేవారు. ఆయన పద్యం చదివితే ప్రేక్షకుల నుండి 'వన్స్ మోర్' అనే అభ్యర్థనలు వచ్చేవి.
నేను వేసిన కార్టూన్లు కొన్ని ప్రముఖ పత్రికలు ఆంధ్రప్రభ ఆంధ్ర పత్రిక లో ప్రచురితమయ్యేవి. నా కార్టూన్ చూసి నన్ను అభినందించేవారు. కొన్ని సూచనలు కూడా ఇచ్చేవారు.
పదవి విరమణ అనంతరం కుమార్ గారు కొన్నాళ్ళు తమ స్వస్థలమైన ఎలమంచిలి లో ఉండేవారు. అక్కడ కూడా స్థానిక సాహితీ ప్రముఖులతో తన సాహితీ సేవ కొనసాగించారు. ఆ తర్వాత విశాఖపట్నంలో స్థిరపడ్డారు. విశాఖ నగరం ఎందరో సాహితీప్రియులను ఆదరించింది, పోషించింది. వారిలో కుమార్ గారు ఒకరు. ఓ విశాఖ ప్రముఖ సాహితీ సంస్థ కుమార్ గారిని 'విశాఖ రత్న' బిరుదుతో సత్కరించింది.
కుమార్ గారు సంఘ సేవకులు కూడా. పదవీ విరమణ అనంతరం వారు కొన్ని బ్రాహ్మణ వివాహ పరిచయ వేదికల్లో పాల్గొనేవారు. పెళ్లి సంబంధాలు కుదిర్చారు.. మా పెద్దమ్మాయి సంబంధం కూడా ఆయనే కుదిర్చేరు. ఆయన ఆధ్వర్యంలోనే మా పెద్దమ్మాయి వివాహం కూడా జరగడం నా జీవితంలో ఓ మరపురాని మధురానుభూతి.
ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి పొన్నాడ కుమార్ గారిని సంస్మరిస్తూ వారి సేవలను అందరికీ తెలియజేసే విధంగా వారి కుమారుడు శ్రీ పొన్నాడ రఘునాథ్ గారు ఓ పుస్తకం ప్రచురించడం బహుదా ప్రశంసనీయం. వారికి నా ఆశీస్సులు. కుమార్ గారికి నా నివాళి.
16, సెప్టెంబర్ 2023, శనివారం
రుక్మిణి లక్ష్మీపతి
ఈ చిత్రంలో వ్యక్తి రుక్మిణి లక్ష్మీపతి. ఆయుర్వేద ఘన వైద్యులు శ్రీ ఆచంట లక్ష్మీపతి గారి సతీమణి శ ఆచంట రుక్మిణమ్మ.
ఈమె జమీందారీ కుటుంబం నుంచి వచ్చింది. ఆనాడు ఆ కుటుంబాలలో ఆచారాలు ఎక్కువ. స్త్రీల చదువుకు ప్రోత్సాహం లేదు. అటువంటి వాతావరణంలో ఆమె పట్టభద్రురాలైంది. డిగ్రీ తీసుకుంది. అంతేకాదు Madras Legislature కి ఎన్నికైన తొలి మహిళ. ఈమె. Medras Presidency లో మంత్రి పదవి చేపట్టిన తొలి మహిళ కూడా ఈమే.
పట్టభద్రురాలై ,పారిస్ లో అంతర్జాతీయ మహిళా సభ జరిపి ,ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొని ,ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసిన మహిళ ఆచంట రుక్మిణమ్మ. ఆనాడు ఆ కుటుంబాలలో ఆచారాలు ఎక్కువ. స్త్రీల చదువుకు ప్రోత్సాహం లేదు. అటువంటి వాతావరణంలో ఆమె పట్టభద్రురాలైంది. డిగ్రీ తీసుకుంది. తర్వాత మద్రాసులో ఖద్దరు ప్రచారము చేసింది.
1946 లో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం మంత్రివర్గంలో ఆరోగ్య మంత్రిగా కూడా పనిచేసింది. ఈ విధంగా అవకాశం యిస్తే ఆడవారు ఏ రంగంలోనైనా రాణిస్తారు అని నిరూపించిన మహిళా రత్నం ఆచంట రుక్మిణమ్మ గారు. ఆచంట రుక్మిణమ్మ .6-12-1892 జన్మించి 6-8-1951న 59వ ఏట మరణించారు.
15, సెప్టెంబర్ 2023, శుక్రవారం
సుబ్రహ్మణ్యభారతి - తమిళ రచయిత, కవి - charcoal pencil sketch
Description
పి. సి. సర్కార్, ఇంద్రజాలికుడు. pencil sketch
పి.సి.సర్కార్ గా పిలువబడే ప్రొతుల్ చంద్ర సర్కార్ గొప్ప భారతీయ ఇంద్రజాలికుడు. దేశవిదేశాల్లో లెక్కలేనన్ని ఇంద్రజాల ప్రదర్శనల నిచ్చాడు. అతనికి ముగ్గురు కుమారులు. మానిక్ సర్కార్, దర్శకుడు, ఎనిమేటర్, లేసర్ నిపుణుడు. పి.సి.సర్కార్ జూనియర్, పి.సి.సర్కార్ యంగ్లు ఇంద్రజాలికులు. వికీపీడియా
అమ్మ బొమ్మ
నేను చిత్రీకరించిన అమ్మ బొమ్మల్లో ఇదొకటి. అమ్మ నాన్నలకి దూరంగా ఉంటూ చదువుకున్న కారణమో మరేమోకాని అమ్మ బొమ్మలంటే చాలా ఇష్టం.
14, సెప్టెంబర్ 2023, గురువారం
పెళ్ళి ఫోటో
నేను చిత్రీకరించిన చిత్రానికి శ్రీమతి మీనా అయ్యర్ గారు రచించిన కథ. యధాతధంగా.
(ఇంత మంచి చిత్రం అందించిన Pvr Murty గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు... చిత్రం చూడగానే చిన్న సందేశం ఇవ్వాలనే తలంపుతో యాదృచ్ఛికంగా మదిలో తట్టిన భావమిది...)
"అమ్మా స్వాతీ ....ఇలా రా" అమ్మ కంఠం మ్రోగుతూనే ఉంది గుడిలోని గంటలా...
స్వాతి బ్యాగ్ లోని ఉత్తరం చదవసాగింది.... పదేపదే చదువుతూనే ఉంది.
తల్లి పిలుపు పెడచెవిన పెట్టింది...
ఏదో ఆదుర్దాగా ఆల్బమ్ నుండి ఒక ఫోటో తీసుకుని బెడ్ పై పడుకుని కన్నీళ్ళతో తలగడ తడిచిపోతున్నది.
అయిననూ ఏదీ పట్టించుకునే స్థితిలో లేదు స్వాతి.
కాసేపటికి అమ్మ తన గదికి రానేవచ్చింది...
"ఏమే.... ఎన్నిసార్లు పిలిచినా పలకవేం...తిండీ తిప్పలు లేకుండా పనీపాటా చేయకుండా ఉద్యోగానికి పోకుండా ఎన్నాళ్ళిలా ఉంటావేం?" ఇందుకేనా మీ ఇంటినుండి వచ్చిందీ, వెళ్ళు మరి" అని గద్గదంగా
అడిగింది అమ్మ గదమాయిస్తూ...చేతిలోని నీళ్ళ గ్లాసు త్రాగుతూ...
"నువ్వు నీ కోడలిని ఇంటికి తీసుకొచ్చే వరకు అంది స్వాతి కళ్ళెర్లజేస్తూ"...
"అదిరాదు ఎప్పటికీ" అంది అమ్మ కూతురి వంక చూస్తూ...
పెళ్ళై ఏడాది కూడా కాలేదు తమ్ముడిని మరదలిని దూరం పెట్టావ్, పచ్చని కాపురంలో చిచ్చు పెట్టావు నీ చాదస్తంతో... చూడు చూడచక్కని జంటను
అంటూ కసురుకుంది తల్లిని స్వాతి.
(తమ్ముడు వ్రాసిన మూడు పేజీల ఆవేదనను తల్లికి వివరించేందుకు ప్రయత్నిస్తూ....)
గత సంవత్సరం పెళ్ళి కాలేదు మొర్రో అని తెగ వెతికావు. తీరా పెళ్ళైతే వారి అన్యోన్యతను చూడలేకున్నావు. కోడలిలో కూడా కూతురిని చూడాలి... నేను నా మెట్టినింటలో సుఖపడాలని నువ్వు కోరుకున్నట్లే నీ కోడలికి ఆ వంటగదిలో స్వేచ్ఛనివ్వాలి.... ఇన్నేళ్ళూ
నచ్చినది వండుకుని తిన్నావుగా, ఇకమీద ఆమె చేసిన వంటను మెచ్చి తిను.... ఉద్యోగం చేస్తున్న పిల్ల రేవతి.... వంటావార్పు అన్నీ మెల్లమెల్లగా నేర్చుకుంటుంది.... ఎన్నో ఏళ్లుగా దేదీప్యమానంగా ఇంటిని చక్కబెట్టావు. ఇప్పుడు కోడలు రాగానే పాత చింతకాయలా పల్లెటూరి అత్తలా విపరీతమైన ఛాందస వాదం పెరిగిపోయింది... శేఖర్ రేవతిల పెళ్ళి ఫోటోలు చూస్తే కన్నీళ్లు ఆగడం లేదు...
సర్దుకుపోవడం కూడా పెద్దవారు నేర్చుకోవాలి" అన్నది స్వాతి.
అమ్మాయి చెప్పిందీ నిజమే...అని ఆలోచనల్లో పడింది తల్లి....
"ఏ ఇబ్బందులు తన కూతురికి అత్తవారింట్లో ఉండకూడదు అని తల్లులు అనుకుంటారో,....
అన్నివిధాలుగా
అల్లుడు కూతురికి సహకరించాలని కోరుకుంటున్నప్పుడు
తమ పుత్రుడు మాత్రం కోడలికి సహకరిస్తే భరించలేరు".
12, సెప్టెంబర్ 2023, మంగళవారం
అనీ బిసెంట్, - బ్రిటిష్ సామ్యవాది, మహిళాహక్కుల ఉద్యమవాది
అనీ బిసెంట్, బ్రిటిష్ సామ్యవాది, బ్రహ్మ జ్ఞానవాది, మహిళాహక్కుల ఉద్యమవాది, రచయిత. ఆమె వాక్పటిమ కలిగిన స్త్రీ. అనీ వుడ్ బిసెంట్ ఐరిష్ జాతి మహిళ. లండను లోని క్లఫామ్ లో, 1847 అక్టోబరు 1 న జన్మించింది. 1933 సెప్టెంబరు 20 న తమిళనాడు లోని అడయారులో మరణించింది. ఈమె దివ్యజ్ఞాన తత్వజ్ఞి, మహిళల హక్కుల ఉద్యమకారిణి, రచయిత, వక్త.
ఈ క్రింది లింక్ క్లిక్ చేసి నా youtube channel లో ఈమె గురించి వినండి.
https://www.youtube.com/watch?v=dZuhAsmzFqE
10, సెప్టెంబర్ 2023, ఆదివారం
పార్వతి గిరి - సాతంత్ర సమరయోధురాలు
పార్వతి గిరి - నా charcoal pencil చిత్రం.
ఈమె గురించి టూకీగా ః
భారత స్వాతంత్ర సంగ్రామంలో ప్రముఖ పాత్రలు పోషించిన మహిళలెందరో.
పార్వతి గిరి, ధనంజయ్ గిరి కుమార్తె. పశ్చిమ ఒడిస్సా కి చెందిన మహిళ, భారత స్వాతంత్ర సమర యోధురాలు. ఆమెను Mother Theresa of Odissa గా చెప్పుకుంటారు. .మహిళలపై గృహహింసను ప్రతిఘటించారు. 19 జనవరి 1926 లో జన్మించిన ఈమె 17 ఆగస్ట్ 1995 లో మృతిచెందారు.
8, సెప్టెంబర్ 2023, శుక్రవారం
సంగమం సంగమం అనురాగ సంగమం
My charcoal pencil sketch
సంగమం... సంగమం....అనురాగ సంగమం.. జన్మ జన్మ ఋణానుబంధ సంగమం...
సంగమం... సంగమం
ఆనంద సంగమం భావ రాగ తాళ మధుర సంగమం...
సంగమం... సంగమం...
అనురాగ సంగమం.. ఆనంద సంగమం
పాలు తేనె కలసి మెలసి జాలువారు సంగమం....
పాలు తేనె కలసి మెలసి జాలువారు సంగమం....
సాగిపోవు ఏరులన్నీ ఆగి చూచు సంగమం ఆగి చూచు సంగమం..
సాగిపోవు ఏరులన్నీ ఆగి చూచు సంగమం
ఆగి చూచు సంగమం
సంగమం... సంగమం....
అనురాగ సంగమం... ఆనంద సంగమం
ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు
నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...
-
Dr. C. Narayana Reddy - My pencil sketch పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె వర్థంతి నాడు వారికి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొ...
-
మిత్రులు మాధవరావు కొరుప్రోలు గారు రచించిన గజల్ : పలుకుతేనె పాటలలో..రాశి పో''సినారె'' భళారే..! తెలుగువీణియ శృతి..తెల...
-
పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె కి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొన్ని భాగాలు ప్రపంచ పదులు ➿➿➿➿➿➿➿ సముద్రానికి చమురు పూస్తే నల్ల ...