నేను చిత్రీకరించిన చిత్రానికి శ్రీమతి మీనా అయ్యర్ గారు రచించిన కథ. యధాతధంగా.
(ఇంత మంచి చిత్రం అందించిన Pvr Murty గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు... చిత్రం చూడగానే చిన్న సందేశం ఇవ్వాలనే తలంపుతో యాదృచ్ఛికంగా మదిలో తట్టిన భావమిది...)
"అమ్మా స్వాతీ ....ఇలా రా" అమ్మ కంఠం మ్రోగుతూనే ఉంది గుడిలోని గంటలా...
స్వాతి బ్యాగ్ లోని ఉత్తరం చదవసాగింది.... పదేపదే చదువుతూనే ఉంది.
తల్లి పిలుపు పెడచెవిన పెట్టింది...
ఏదో ఆదుర్దాగా ఆల్బమ్ నుండి ఒక ఫోటో తీసుకుని బెడ్ పై పడుకుని కన్నీళ్ళతో తలగడ తడిచిపోతున్నది.
అయిననూ ఏదీ పట్టించుకునే స్థితిలో లేదు స్వాతి.
కాసేపటికి అమ్మ తన గదికి రానేవచ్చింది...
"ఏమే.... ఎన్నిసార్లు పిలిచినా పలకవేం...తిండీ తిప్పలు లేకుండా పనీపాటా చేయకుండా ఉద్యోగానికి పోకుండా ఎన్నాళ్ళిలా ఉంటావేం?" ఇందుకేనా మీ ఇంటినుండి వచ్చిందీ, వెళ్ళు మరి" అని గద్గదంగా
అడిగింది అమ్మ గదమాయిస్తూ...చేతిలోని నీళ్ళ గ్లాసు త్రాగుతూ...
"నువ్వు నీ కోడలిని ఇంటికి తీసుకొచ్చే వరకు అంది స్వాతి కళ్ళెర్లజేస్తూ"...
"అదిరాదు ఎప్పటికీ" అంది అమ్మ కూతురి వంక చూస్తూ...
పెళ్ళై ఏడాది కూడా కాలేదు తమ్ముడిని మరదలిని దూరం పెట్టావ్, పచ్చని కాపురంలో చిచ్చు పెట్టావు నీ చాదస్తంతో... చూడు చూడచక్కని జంటను
అంటూ కసురుకుంది తల్లిని స్వాతి.
(తమ్ముడు వ్రాసిన మూడు పేజీల ఆవేదనను తల్లికి వివరించేందుకు ప్రయత్నిస్తూ....)
గత సంవత్సరం పెళ్ళి కాలేదు మొర్రో అని తెగ వెతికావు. తీరా పెళ్ళైతే వారి అన్యోన్యతను చూడలేకున్నావు. కోడలిలో కూడా కూతురిని చూడాలి... నేను నా మెట్టినింటలో సుఖపడాలని నువ్వు కోరుకున్నట్లే నీ కోడలికి ఆ వంటగదిలో స్వేచ్ఛనివ్వాలి.... ఇన్నేళ్ళూ
నచ్చినది వండుకుని తిన్నావుగా, ఇకమీద ఆమె చేసిన వంటను మెచ్చి తిను.... ఉద్యోగం చేస్తున్న పిల్ల రేవతి.... వంటావార్పు అన్నీ మెల్లమెల్లగా నేర్చుకుంటుంది.... ఎన్నో ఏళ్లుగా దేదీప్యమానంగా ఇంటిని చక్కబెట్టావు. ఇప్పుడు కోడలు రాగానే పాత చింతకాయలా పల్లెటూరి అత్తలా విపరీతమైన ఛాందస వాదం పెరిగిపోయింది... శేఖర్ రేవతిల పెళ్ళి ఫోటోలు చూస్తే కన్నీళ్లు ఆగడం లేదు...
సర్దుకుపోవడం కూడా పెద్దవారు నేర్చుకోవాలి" అన్నది స్వాతి.
అమ్మాయి చెప్పిందీ నిజమే...అని ఆలోచనల్లో పడింది తల్లి....
"ఏ ఇబ్బందులు తన కూతురికి అత్తవారింట్లో ఉండకూడదు అని తల్లులు అనుకుంటారో,....
అన్నివిధాలుగా
అల్లుడు కూతురికి సహకరించాలని కోరుకుంటున్నప్పుడు
తమ పుత్రుడు మాత్రం కోడలికి సహకరిస్తే భరించలేరు".
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి