22, ఏప్రిల్ 2023, శనివారం

కంటిమి నేడిదె గరుడాచలపతి -- అన్నమయ్య కీర్తన


 సింహాచలేశుని చందనోత్సవం సందర్భంగా ఈ వారం అన్నమయ్య కీర్తన : కంటిమి నేడిదె గరుడాచలపతి.


కంటిమి నేడిదె గరుడాచలపతి

ఇంటి వేలుపగు యీశ్వరుండు ||


శ్రీనరసింహుడు చిన్మయకాంతుడు

దానవాంతకుడు దయానిధి

నానా మహిమల నమ్మిన వారిని

పూనుక కాచె పోషకుడితడు ||


దేవాది దేవుడు దినకర తేజుడు

జీవాంత రంగుడు శ్రీవిభుడు

దైవ శిఖామణి తలచిన వారిని

సేవలు గొనికాచె విభుడితడు ||


పరమమూర్తి హరి ప్రహ్లాద వరదుడు

కరుణానిధి బుధకల్పకము

పరగు శ్రీవేంకట పతి తనదాసుల

నరదుగ గాచేయనంతుడితడు ||


చిత్రం : Pvr Murty

కామెంట్‌లు లేవు:

ముగ్ధ కన్నుల్లో ఎదురుచూపుల వాలు - కవిత

మిత్రులు శ్రీ మురళి పొన్నాడ గారు నా చిత్రానికి రచించిన కవిత. వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముగ్ధ కన్నుల్లో ఎదురుచూపుల వాలు,  భగ...