8, ఏప్రిల్ 2023, శనివారం

తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె యూఁగెఁగన చెల్లుబడినూఁగీని శ్రీరంగశిశువు - అన్నమయ్య కీర్తన


తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె యూఁగెఁగన చెల్లుబడినూఁగీని శ్రీరంగశిశువు - అన్నమయ్య కీర్తన 


కలికి కావేరి తరగల బాహులతలనే

తలఁగకిటు రంగమధ్యపు తొట్టెల

పలుమారుఁదనునూఁచి పాడఁగానూఁగీని

చిలుపాల సెలవితో శ్రీ రంగ శిశువు


అదివొ కమలజుని తిరువారాధనంబనఁగ

అదనఁ గమలభవాండమనుతొట్టెల

ఉదధులు తరంగములనూఁచఁగా మాఁగీని

చెదరని సిరులతోడ శ్రీ రంగశిశువు


వేదములె చేరులై వెలయంగ శేషుఁడే

పాదుకొను తొట్టెలై పరగఁగాను

శ్రీ దేవితోఁగూడి శ్రీ వేంకటేశుఁడై

సేద దేరెడి వాఁడె శ్రీ రంగశిశువు


శ్రీరంగంలో వెలసిన రంగనాధస్వామిపై అన్నమాచార్యులు చెప్పిన అమరమైన సంకీర్తన ఇది. స్వామిని శ్రీరంగ శిశువని కీర్తిస్తున్నారు. నాలుగు వేదములూ నాలుగు తాళ్ళులాగా కట్టుబడిన వుయ్యాలలో ఆదిశేషుడు తొట్టెగా అమర్చబడిన చక్కటి వూయలలో వూగుతున్నాడు. ఆ చక్కటి నల్లని శిశువు. వాడే శ్రీదేవితో కలిసి వేంకటాద్రిపై సేద తీరుతున్నాడట. ఆ శ్రీరంగ శిశువు కమలభవాండమను (బ్రహ్మాండమను) తొట్టెలో బ్రహ్మాండమైన నీటి తరంగాలలో వూపుతుండగా స్థిరమైన సిరులతో వూగుతున్నాడట.


భావామృతం:-


పూర్వం ఒక మఱ్ఱి ఆకు తొట్టెవలె భాసించి దానిపై శ్రీరంగనాధస్వామి శిశువు వలె వూగినాడు కదా! అట్లు చెల్లుబడియైన ఆ మహానుభావుని కీర్తించెదము.


కావేరీనది కలికివలె (యువతివలె) బాహులతలవంటి తన తరంగములపై నదీ మధ్యమంలో అమర్చబడిన వేదిక అనే తొట్టెలో ఈ శ్రీరంగ శిశువు వూగుచున్నాడు. తనను చూచి అనేక కీర్తనలు పాడుచుండగా, చిలుపాల సెలవితో (చిక్కగా మరగబెట్టిన పాలచారికలు మూతిపై గల) శ్రీరంగ శిశువు వూగుచున్నాడు.


(సేకరణ)


చిత్రం : Pvr Murty

కామెంట్‌లు లేవు:

The power of 'Will' Usage - English grammar - illustration

  When we use will to make a promise 🤝 or an offer 💡, we are usually deciding to do something at the very moment we are speaking. It shows...