28, ఏప్రిల్ 2023, శుక్రవారం

ఓహో రాకాసులాల వద్దుసుండి వైరము - అన్నమయ్య కీర్తన

 
ఓవో రాకాసులాల వొద్దు సుండి వైరము
దేవుని శరణనరో తెలుసుకోరో 

జగములో రాముడు జనియించె విష్ణుడదె
అగపడి లక్ష్మి సీతయై పుట్టెను
తగు శేష శంఖ చక్ర దైవసాధనములెల్ల
జిగి లక్ష్మనభరతాంచితశత్రుఘ్నులైరి

సురలు వానరులైరి సూర్యుడు సుగ్రీవుడు
మరిగి రుద్రుడే హనుమంతుడాయెను
సరుస బ్రహ్మదేవుడు జాంబవంతుడైనాడు
వెరవరి నలుడే విశ్వకర్మ సుండి

కట్టిరి సేతువపుడె ఘనులెల్ల దాటిరి
ముట్టిరి లంకానగరము నీదళము
యిట్టె శ్రీవేంకటేశుడితడై రావణుని జంపె 
వొట్టుక వరము లిచ్చీ నొనర దాసులకు


చిత్రం : పొన్నాడ మూర్తి


కామెంట్‌లు లేవు:

శ్రమ జీవన సౌందర్యం

నా charcoal pencil sketch చిత్రానికి Facebook లో ఓ  మిత్రుని స్పందన సామాజిక సమస్యల మీద, శ్రమైకజీవన సౌందర్యం మీద గతంలోనూ చాలా మంది చిత్రకారుల...