4, ఏప్రిల్ 2023, మంగళవారం

తెర వెనుక కథలు... ఒక అద్భుత హిందీ పాట


 

"Behind the scenes.." తెర వెనుక కథలు (1)


"He rom rom mein basane waale raam. Jagata ke swaamee, he antayraamee, main tuz se kyaa maangoo." పాట కథ.


"Neel Kamal"  చిత్రంలో కథానాయిక వహీదా రెహమాన్ పై ఓ సన్నివేశంలో  ఓ పాట చిత్రీకరించాలి, అది కూడా శ్రీరాముని ఉద్దేశించి. మరి పాట ఎవరు రాయాలి. దర్శకుడు రామ్ మహేశ్వరి ఈ సన్నివేశానికి సాహిర్ లూధియాన్వి సమర్ధుడు అని తోచింది. కానీ సాహిర్ నాస్తికుడు. అయినా ఆయన్ని సంప్రదించారు. "నాకు రామాయణం గురించి ఏమీ తెలియదు. నేను ఎలా రాయగలను" ఈ పాట అని తన అసమర్ధతను చెప్పుకున్నాడు సాహిర్. " నాకు మీ మీద నమ్మకం ఉంది. మంచి భావజాలంతో రాయగల సమర్థులు మీరే" అన్నాడు రామ్ మహేశ్వరి. కాదనలేక "నాకు , రెండు రోజులు సమయం ఇవ్వండి" అని అడిగాడు సాహిర్. వెంటనే రామాయణ భారతాలు బాగా తెలిసిన తన స్నేహితుని సంప్రదించాడు. తత్ఫలితంగా  "హే రోమ్ రోమ్ మే బస్నే వాలే రామ్" అనే పాట రాశాడు.  దర్శక నిర్మాతలకు ఈ పాట చాలా నచ్చేసింది. సంగీత దర్శకుడు రవి స్వరపరిచిన ఈ పాటని దర్శకుడు రామ్ మహేశ్వరి  అద్భుతంగా చిత్రీకరించారు. సినిమా, ఆశా భోంస్లే పాడిన ఈ పాట రెండూ సూపర్ హిట్. 


దూరదర్శన్ "రంగోలి" కార్యక్రమం ద్వారా ఈ ఆసక్తికర విషయం తెలుసుకున్నాను.

కామెంట్‌లు లేవు:

కళాప్రపూర్ణ ద్వారం భావనారాయణ రావు charcoal pencil sketch

ఈ చిత్రంలో వ్యక్తి కీర్తిశేషులు ద్వారం భావనారాయణ రావు.   ఇతడు ద్వారం వెంకటస్వామి, జగ్గయ్యమ్మ దంపతులకు 1924 జూన్ 15 తేదీన  బాపట్లలో   జన్మించ...