26, జూన్ 2023, సోమవారం

పెన్సిల్ వుంటే చాలు..బొమ్మ పడిందన్న మాటే..!! - Abdul Rajahussein

 

నా గురించి, నా చిత్రకళ గురించి మిత్రులు, పాత్రికేయులు రాజా హుస్సేన్ గారు రచించిన వ్యాసం.  వారికి నా ధన్యవాదాలు.

*పెన్సిల్ వుంటే చాలు..బొమ్మ పడిందన్న మాటే..!!

"పొన్నాడ " వారి పెన్సిలే వేరు…!! “పొన్నాడ మూర్తి“ పేరుతో కార్టూన్లు,చిత్రాలు వేసే శ్రీ పొన్నాడ వెంకట రమణ మూర్తిగారు గత 30 యేళ్ళ నుంచి చిత్రకారులుగా, కార్టూనిస్ట్ గా కొనసాగుతు న్నారు.ఆయన గ్రీవ్స్ కాటన్ కంపెనీలో పనిచేసి పద వీ విరమణ చేసి ప్రస్తుతం విశాఖపట్నంలో నివాసం వుంటున్నారు. *కార్టూన్ మూర్తి..!! బొమ్మలు వేసే అలవాటు బాల్యం నుంచేఅలవడింది. బాపు గారి కార్టూన్లు చూశాక కార్టూన్లు వేయాలనే కోరిక కలిగింది.కార్టూన్లు వేయటం ప్రారంభించారు. 1991లో ఆంధ్ర ప్రభ వారుశ్ బాపు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్టూన్ పోటీలలో కన్సోలేషన్ బహు మతి లభించింది. మొదటి కార్టూన్ కే బహుమతి రావటంతో ఆయన ఆనందానికి హద్దులేదు..ఈ స్ఫూర్తి తో మరిన్ని కార్టూన్లు వేశారు. స్వాతి వార పత్రికనిర్వహించిన కార్టూన్ పోటీలలో రెండుసార్లు బహుమతులు అందుకున్నారు. నది పత్రిక నిర్వహించిన కార్టూన్ పోటీలలో కన్సోలేషన్ బహుమతి వచ్చింది. ఈ బహుమతిని ప్రముఖ కార్టూనిస్టు శ్రీ జయదేవ్ గారి చేతులమీదుగా అందుకోవటం మరపురాని స్మృతి అంటారు మూర్తి గారు. తెలుగు తల్లి కెనడా పత్రిక నిర్వహించిన కార్టూన్ పోటీలలో రెండు సార్లు బహుమతులు అందుకున్నారు.ప్రియదత్త,64కళలు, తెలుగుతల్లి కెనడా,గోతెలుగు. కామ్ లాంటి అనేక పత్రికలలో ఆయన కార్టూన్లు ప్రచురించబడినాయి. *బొమ్మల మూర్తి..!! కార్టూన్ల కన్నా బొమ్మలంటేనే..మూర్తి గారికి ఇష్టం. వివిధ రంగాలలో ప్రముఖులైన వారి చిత్రాలను వేయటమేకాక వారి గురించి క్లుప్తంగా,సమగ్రంగా రాస్తుండటం విశేషం. అలా ప్రతిరోజూ ఒక చిత్రం ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడం ఆయన హాబీ. "మూర్తి మంతమాయే…!! తెలుగు తల్లి కెనడాలో గత రెండేళ్లుగా శ్రీకొందరు ప్రముఖుల చిత్రాలు “మూర్తిమంతమాయే” శీర్షికన నిర్వహిస్తున్నారు. అది బహుళ జనాదరణ పొందిం ది. ఇప్పటికీ కొనసాగుతోంది. *మూర్తి గారి "తెలుగు వెలుగు " బ్లాగ్..,!! “తెలుగు వెలుగు” పేరున వీరు 2007 నుంచి బ్లాగ్ నిర్వహిస్తున్నారు. లక్షమంది పైగా ఆ బ్లాగుని చూశా రు. *చిత్రప్రదర్శనలు.. విజయనగరంలో విజయభావన సంస్థ ఆధ్వర్యంలో వీరి చిత్రాల ప్రదర్శన జరిగింది.హైదరాబాదులో కూడా వీరి చిత్రాలతో ప్రదర్శన నిర్వహించారు. అప్పుడే వీరి చిత్రాలతో “మై పెన్సిల్ ఫీట్” పేరున ఒక పుస్తకం కూడా విడుదల చేశారు. 2012లో హైదరాబాదు పబ్లిక్ గార్డెన్స్ లోనిర్వహించి న కార్టూనిస్టుల సదస్సులో పాల్గొనటమే కాక వీరి కార్టూన్లు కూడా ప్రదర్శించబడినాయి.ఉత్తరాంధ్ర కార్టూనిస్టుల ఫోరం ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహించిన అనేక కార్టూన్ ప్రదర్శనలలో కూడా వీరి కార్టూన్లు ప్రదర్శించబడినాయి. *చిత్రాల బహూకరణ..!! ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారి చిత్రం, ఎం ఎస్ సుబ్బలక్ష్మి గారి చిత్రం వేసి హైదరాబాదులో జరిగిన ఒక కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం గారికి బహూ కరించారు. వీరు వేసిన రేలంగి, గిరీశంగా ఎన్టీఆర్, సావిత్రి,ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,కృష్ణ కుమారి లాంటి అనేక మంది ప్రముఖుల చిత్రాలను అనేక టీవీ ఛానళ్ల వారు వారి కార్యక్రమాలలో సందర్భానుసారంగా వాడుకున్నారు. “లైఫ్ అఫ్ పై” చిత్రంలో నటించిన నటి స్రవంతి గారి చిత్రం వేసి ఆమెకే పంపారు. ఆమె ఆ చిత్రాన్ని తన ప్రొఫైల్ గా వుంచారు. అలాగే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గారి చిత్రం వేసి ఆమెకే పంపారు. ఆమె కూడా ఆ చిత్రాన్ని ప్రొఫైల్ చిత్రంగా వుంచుకున్నారు. ప్రముఖ గజల్ రచయిత కోరుప్రోలు మాధవరావు గారు వీరిపై ఒక గజల్ రాశారు. దాన్ని శ్రీమతి లక్ష్మీ రాయప్రోలు గారు గానం చేశారు. ఇంకొక ముఖ్య విశేషం ఏమంటే.. వీరి శ్రీమతి లక్ష్మి గారు చక్కటి గాయని. ఫేస్ బుక్ లో ఆవిడ పాటలు వినచ్చు. *బంగ్లా కు చేరిన బొమ్మ..! మూర్తిగారి ఓ బొమ్మని.బంగ్లాదేశ్ online library వారి కవర్ పేజీ మీద వాడుకున్నారు.అలొగే… లాలా లాజపత్ రాయ్ చిత్రాన్ని కూడా ఓ పంజాబీ సంస్థ వారు వాడుకున్నారు. రెండు సంవత్సరాల క్రితం The Golden Heritage of Vizianagaram గ్రూప్ వారి వార్షిక సమావేశం లో మూర్తిగారివిజయనగరం మహనీయుల చిత్రాల ను ప్రదర్శించారు. శ్రీ పి.వి ఆర్ మూర్తి గారి కుంచెనుంచి జాలువారిన అనేక చిత్రాలకు చాలామంది కవులు కవితలల్లారు అలాంటి ఓ కవితా ఇది. *చీర జాలువార చేటి నడుము జుట్టి వోంపు సొంపులన్ని యొలకబోసి యద్దమందు మోము నతిరమ్యముగ జూపు కళను జూడ మాకు కనులకింపు(ఆ.వె) *ఎంకి నాయుడు బావల ముగ్ధ ప్రణయాన్ని చిత్రించిన "ఎంకి పాటలు" తో తెలుగు సాహి త్యంలో గాలి దుమారం సృష్టించారు నండూరి సుబ్బారావు గారు. అచ్చంగా తెలుగు గడ్డలో నుంచి పుట్టిన గ్రామీణ దంపతులు ప్రణయం గాలికైనా కౌగిలి ఇవ్వనంతటి చిక్కనిది. కృత్రిమ నాగరికత బలిసిన ఈ రోజుల్లో మన పల్లెల్లో ఇంకా అంతటి సుకుమార ముగ్ధ ప్రణయ భావనకు ఆస్కారం మిగిలిందా అని అను మానం, ఆవేదనా కలుగుతాయి.కానీ…. మూర్తి గారు తన కుంచెతో ఎంకి నాయుడు బావలను కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించారు.!! *పెన్సిల్ చిత్రాలకు పెట్టింది పేరు..!! మూర్తిగారు పెన్సిల్ చిత్రాలకు పెట్టింది పేరు.. పెన్సిల్ తో ఆయనిచ్చే స్ట్రోక్స్ తో హావభావా లను పండించడం ఆయనకే చెల్లుతుంది. మూర్తి గారు రంగుల బొమ్మలు కూడా వేస్తారు. బాపు గారికొన్ని బొమ్మలకు రంగుల్ని కూడా అద్దారు. గీతా ఏదైనా..అది మూర్తి గారి పెన్సిల్/ కుంచెలో జీవం పోసుకోవాల్సిందే..!! *ఎ.రజాహుస్సేన్..!!

నా బొమ్మలతో రాజా హుస్సెన్ గారు facebook లో పెట్టిన టపా ఈ క్రింది లింక్ లో ...


కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...