4, జూన్ 2023, ఆదివారం

కాలమెలా గడిచిపోయె..తెలియకనే పోయెనే. - గజల్


 Pvr Murty గారికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్సుమాలతో 🌹🙏🌹🙏🌹😊😊🥀💌🥀🦜


నా చిత్రానికి.మిత్రులు శ్రీ మాధవరావు కొరుప్రోలు గారు రచించిన తెలుగు గజల్. వారికి నా ధన్యవాదాలు 


కాలమెలా గడిచిపోయె..తెలియకనే పోయెనే..! 

కలలనావ తీరానికి..చేరకనే మునిగెనే..! 


ఆశపూల చెట్టుచూడ..గంధాలకు బానిసే.. 

గుండెసడికి ఒకసాక్షిగ..మిగలకనే ఒరిగెనే..! 


నీకోసం పరితపించు..మేఘంలా ఈ మనసు.. 

తననుతాను ఒకసమిధగ..తలచకనే రగిలెనే..! 


ఎడారిలో పూవులేవొ..ఎవరికొరకొ ఈవేళ.. 

భావరాగ మధురిమలను..పంచకనే రాలెనే..! 


ఈ రెప్పల వాడలోని..జాతరెంత దివ్యమో.. 

నీ మౌనమె దీపాలుగ..పెట్టకనే వెలిగెనే..! 


చాలించగ కుదరని ఈ..వ్యవహారమె ఓ మాయ.. 

వెతుకులాట లోలోపల..జరగకనే ఆగెనే..! 


మరిమాధవ గజలింటికి..ఆహ్వానం ఎల్లరకు.. 

పాడుకునే హృదిహృదినే..మీటకనే పొంగెనే..!

కామెంట్‌లు లేవు:

పాలగుమ్మి పద్మరాజు -- రచయిత

 పాలగుమ్మి పద్మరాజు రచయిత -  పెన్సిల్ స్కెచ్ పాలగుమ్మి పద్మరాజు ( జూన్ 24 , 1915 - ఫిబ్రవరి 17 , 1983 ) ప్రముఖ తెలుగు రచయిత, కేంద్ర సాహిత్...