28, ఫిబ్రవరి 2024, బుధవారం
Iravati Karve - Anthropoligist - charcoal pencil sketch
27, ఫిబ్రవరి 2024, మంగళవారం
గజల్ గంధర్వుడు పంకజ్ ఉధాస్
పంకజ్ ఉధాస్ - నా charcoal pencil చిత్రం.
పంకజ్ ఉధాస్ (1951 మే 17 - 2024 ఫిబ్రవరి 26) భారతదేశానికి చెందిన గజల్, నేపథ్య గాయకుడు. ఆయన హిందీ సినిమా, భారతీయ పాప్‌లో తన రచనలకుగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పంకజ్ ఉధాస్ 1980లో ఆహత్ అనే గజల్ ఆల్బమ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించి 1981లో ముకరర్, 1982లో తర్రన్నమ్, 1983లో మెహ్‌ఫిల్, 1984లో పంకజ్ ఉదాస్ లైవ్ ఎట్ రాయల్ ఆల్బర్ట్ హాల్, 1985లో నయాబ్ వంటి అనేక హిట్‌లను రికార్డ్ చేశాడు. పంకజ్ ఉధాస్‌కు 2006లో భారతదేశ నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ లభించింది. (సౌజన్యం : వికీపీడియా).
మరిన్ని వివరాలు ఈ క్రింది లింకు క్లిక్ చేసి చదవండి :
26, ఫిబ్రవరి 2024, సోమవారం
మహాశ్వేత దేవి - రచయిత్రి - (pen sketch)
ఈ రోజు గొప్ప రచయిత్రి మహాశ్వేత దేవి చిత్రాన్ని చిత్రీకరించుకనే భాగ్యం కలిగింది.
వికీపీడియా ప్రకారం 1926 లో జన్మించిన ఆమె విద్యాభాసం స్థానికంగా ఢాకాలోనే కొనసాగింది. స్వాతంత్ర్యం తరువాత జరిగిన దేశ విభజన సమయంలో కుటుంబం పశ్చిమ బెంగాల్‌కు మార్పుచేయడంతో ఆ తరువాత రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతి నికేతన్ లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంములో ఆంగ్లంలో డిగ్రీ, కోల్‌కత విశ్వవిద్యాలయము నుంచి ఆంగ్లంలో ఎం.ఏ. పూర్తిచేసింది. నటుడు బిజన్ భట్టాచార్యను వివాహం చేసుకుంది.
మరిన్ని వివరాలు "నా కుటీరం' పత్రిక వారి క్రింద ఇచ్చిన website లింకు క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. విరణాత్మక వ్యాసం వ్రాసినందుకు ఈ పత్రిక వారికి నా ధన్యవాదాలు
23, ఫిబ్రవరి 2024, శుక్రవారం
సరస్వతి గోరా -సంఘ సేవిక - charcoal pencil sketch
20, ఫిబ్రవరి 2024, మంగళవారం
బండారు అచ్చమాంబ - రచయిత్రి
charcoal pencil sketch
అచ్చమాంబ గురజాడ అప్పారావు కన్నా పదేళ్ళ ముందే 1902 నవంబరు నెలలో రాసిన కథ ‘ధన త్రయోదశి’ని ‘హిందూ సుందరి’ పత్రికలో ప్రచురించారు. ప్రథమ స్త్రీవాద చరిత్ర కారణి. అయితే ఈ కథ గ్రాంధిక భాషలో ఉంది. అచ్చమాంబ 1874 వ సంవత్సరంలో కృష్ణ జిల్లా, నందిగామ దగ్గర పెనుగంచిప్రోలు లో పుట్టింది. ఈమెకు ఆరేళ్ళ వయసపుడే తండ్రి చనిపోయాడు. 10వ ఏటనే ఈమెకు పెళ్ళయ్యింది. పెళ్ళయ్యే నాటికి అచ్చమాంబ ఏమి చదువుకోలేదు. ఆమె తల్లి, తమ్ముడు కూడా ఆమెతో పాటే ఉండేవారు. ఆమె తమ్ముడికి చదువు చెప్పించారు కానీ ఈమెను ఎవరూ ప్రోత్సహించలేదు. ఎమ్. ఏ చదివిన తమ్ముడితో పాటు కూర్చుని తానే చదువుకుంటూ తెలుగు, హిందీ నేర్చుకొన్నది. ఆమెకు హిందీ ఇంగ్లీషు భాషలలో కూడా ప్రవేశం ఉంది. 1902లో ఓరుగంటి సుందరీ రత్నమాంబతో కలిసి మచిలీపట్నంలో మొదటి మహిళా సమాజం “బృందావన స్త్రీల సమాజం”ను స్థాపించింది. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ఎన్నో స్త్రీల సంఘాలు ఏర్పరచింది. చిన్న వయసులో కుమారుడు, కుమార్తె మరణించడం ఆమెకు తీవ్రమైన దు:ఖాన్ని కల్గించింది. అనాథ పిల్లల్ని చేరదీసి చదువు చెప్పించేది. ఆమె ఇంట్లో ఎపుడు ఐదారుగురు పిల్లలుండి చదువుకుంటూ వుండేవారు. 1905 జనవరి 18వ తేదీన ముఫ్ఫై ఏళ్ళకే మరణించింది. వివిధ భాషలలో స్త్రీ సాహిత్యం వ్రాసిన రచయిత్రుల గురించి భండారు అచ్చమాంబ రచనల ద్వారా మనకు తెలుస్తుంది.
17, ఫిబ్రవరి 2024, శనివారం
సమ్మెట అంబా ప్రసాద్ - హార్మోనియం సంగీత కళాకారుడు (charcoal pencil sketch)
సమ్మెట అంబా ప్రసాద్ (charcoal pencil sketch)
ఆయన 1905 తణుకులో మాతామహుల ఇంట జన్మించారు. తల్లి శ్రీమతి సీతమ్మ. ఆయనకు గల నలుగురు సోదరులూ సంగీత విద్వాంసులే. ఆయన పెద్ద అన్నయ్య వెంకటరావు, తమ్ముడూ హార్మోనియం నిపుణులే. వీరి పూర్వులది బందరు సమీపంలోని సమ్మెట గ్రామం. వారి తాతగారు హైదరాబాద్ వలస వచ్చారు. తండ్రి రంగనాయకులు గారు పబ్లిక్ వర్క్స్ శాఖలోనూ, నిజాం నవాబు పాలెస్ వర్క్స్ లోనూ పనిచేసేవాడు, అనేక జ్యోతిష గ్రంథాలను రచించారు. అంబా ప్రసాద్ గారు చాదర్గాట్ హైస్కూలులో మెట్రిక్ చదివారు. చదువు చాలించి విద్యాశాఖలో గుమస్తాగా చేరారు. ఆ శాఖలో 21 సంవత్సరాలు పనిచేసారు. తరువాత మహాబూలియా గర్ల్స్ హైస్కూలులో సిరిస్తాదారుగా నాలుగేళ్ళు పనిచేసారు. పగలంతా ఉద్యోగం చేసి రాత్రిపూట మనో ఉల్లాసం కోసం హార్మోనియం సాధన చేసేవారు.
వీరు చిన్నతనంలో తన సోదరుడు వెంకటరావు వద్దను తర్వాత నిజాం ఆస్థాన విద్వాంసులైన హరి రామచంద్రరావు గార్ల వద్ద హార్మోనియం నేర్చుకున్నారు. విశేషమైన కృషిచేసి, హిందూస్థానీ సంగీత విద్వాంసులైన అబ్దుల్ కరీం ఖాన్, ఉస్తాద్ ఫయ్యజ్ ఖాన్ లకు వాద్య సహకారం అందించి అందరి మన్ననలు పొందారు. వీరు ఆంధ్ర దేశంలో పలు కచేరీలు చేశారు. మచిలీపట్నం లో వీరు హరి నాగభూషణం గారి ద్వారా సువర్ణ ఘంటా కంకణం పొందారు.
విషయ సేకరణ : వికీపీడియా ఆధారంగా
16, ఫిబ్రవరి 2024, శుక్రవారం
అత్తిలి కృష్ణారావు - నాటక ప్రముఖులు
అత్తిలి కృష్ణారావు (1938 - 1998) ప్రముఖ వీధి నాటక ప్రముఖులు.
వీరు విశాఖపట్నం లో నాగన్న, మహాలక్ష్మి దంపతులకు 1938 ఏప్రిల్ 18 తేదీన జన్మించారు. ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే నాటక ప్రదర్శనలో నటించడం మొదలుపెట్టారు. వీరు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్న్ లో పట్టభద్రులై తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి నటన, నాటిక రచనల్లో డిప్లమో పొందారు. జానపద, రంగస్థల కళలు అంశం మీద పి.హెచ్.డి. చేశారు. విశాఖ నాటక మండలి అధ్యక్షులు గజపతిరాజు అచ్యుతరామరాజు దర్శకత్వంలో వీరు అనేక పాత్రలు పోషించారు.
వీరు మనస్తత్వాలు, దొంగ మొదలైన నాటకాలను దర్శకత్వం వహించి నటించి ఎన్నో సన్మానాలు బహుమతులు పొందారు. 1969 లో "యుగసంధ్య" అనే నాటకాన్ని రచించి, నటించి దర్శకత్వం వహించారు. ఈ నాటకం 14 భాషలలోకి అనువాదితమవడం గమనార్హం.
వీరు 1998 సంవత్సరంలో మరణించారు.
సౌజన్యం : వికీపీడియా
15, ఫిబ్రవరి 2024, గురువారం
కావ్యకంఠ గణపతిముని
14, ఫిబ్రవరి 2024, బుధవారం
నటి పి. హేమలత - charcoal pencil sketch
13, ఫిబ్రవరి 2024, మంగళవారం
గ్రహణం విడిచిన సుఖమిది! కుసుమం విరిసిన క్షణమిది! - తెలుగు గజల్
నా చిత్రానికి డా!! ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల గారు రచించిన గజల్
॥గజల్ ॥12 మాత్రలు
~~~🔹❤️🔹~~~
గ్రహణం విడిచిన సుఖమిది!
కుసుమం విరిసిన క్షణమిది!
తనదనుకొను యెదనవ్రాలి
మైమరచిన శుభఘడియిది!
బ్రహ్మముడులతో బిగిసిన
పచ్చనైన కాపురమిది!
అందం చందం కలిసిన
పూలపూల గోపురమిది!
ఇరువురు ఒకటై లాగే
మన్మథుడెక్కిన రథమిది!
హృదయపు పేటిక నుంచిన
ఎన్నడు తరగని ధనమిది!
~~~~~~~~~~~
డా. ఉమాదేవి జంధ్యాల
మైలవరపు గోపి - గీత రచయిత
మైలవరపు గోపి - నా charcoal pencil చిత్రం
మైలవరపు గోపి (ఆగస్టు 15, 1949 - సెప్టెంబర్ 8, 1996) తెలుగు సినిమా రంగంలో ఒక ఉత్తమమైన భావాలున్న రచయిత. వీరి పూర్తిపేరు మైలవరపు లక్ష్మీ గోపాలకృష్ణమూర్తి
తెలుగు సినిమా రంగంలో ఉత్తమమైన భావాలున్న ఒక రచయిత గోపి. ఆత్రేయ అంతేవాసి, మరో మనసు కవి. మూడు దశాబ్దాలపాటు (1966-1996) విలువైన సినీసాహిత్యాన్ని సృజించాడు. ఆత్రేయ, రాజశ్రీ ల దగ్గర అసిస్టెంట్ గా పనిచేశాడు. 1965లో ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో ఆడిషన్ టెస్టులో ఎన్నికై కన్యాశుల్కం నాటకంలో గిరీశం శిష్యుడు వెంకటేశం పాత్రను పోషించాడు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, గోపి 1966 నుండే మంచి మిత్రులు. తొలినాళ్లలో ఇద్దరూ కలిసి, ఒకే గదిలో ఉండేవారు. గోపి ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోయాడు. ఇతడు మొత్తం 200 సినిమాలకుగాను 1500 పాటలు వ్రాశాడు. ఇరవై సినిమాలకు సంభాషణలు రచించాడు. మనసా కవ్వించకే అనే సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు రాయడంతో పాటు దర్శకత్వం కూడా నిర్వహించాడు.
మరిన్ని వివరాలు వికీపీడియాలో చూడగలరు. అయితే వీరి ఫోటో వికీపీడియాలో లేదు. వేరొకచోట లభిస్తే చూసే నా charcoal pencil తో చిత్రీకరించాను.
12, ఫిబ్రవరి 2024, సోమవారం
పట్రాయని సీతారామ శాస్త్రి - ప్రముఖ సంగీత విద్వాంసుడు - charcoal pencil sketch
వంకాయల నరసింహం - మృదంగ విద్వాంసులు
11, ఫిబ్రవరి 2024, ఆదివారం
రేడియో అక్కయ్య 'న్యాయపతి కామేశ్వరి'
Charcoal pencil sketch
రేడియో అక్కయ్యగా పేరుపొందిన న్యాయపతి కామేశ్వరి గారు విజయనగరంలో 1908లో జన్మించారు. ఈమె తండ్రి పేరిని జగన్నాధ దాసు. వీరిది పండితుల, విద్వాంసుల కుటుంబం. ప్రాథమిక విద్యాభ్యాసం తరువాత విశాఖపట్నంలోని క్వీన్ మేరీ బాలికల ఉన్నత పాఠశాలలో చదివారు. మరల విజయనగరం వచ్చి మహారాజా కళాశాలలో డిగ్రీ 1932లో పూర్తిచేశారు. ఆ కాలంలో బి.ఎ. పాసైన మొట్టమొదటి మహిళ మన కామేశ్వరి గారు. తరువాత కొంతకాలం నూజివీడు సంస్ధానం లో కపిలేశ్వరపురం జమిందారిణి జగదీశ్వరమ్మ గారికి ఇంగ్లీషు నేర్పారు. 1934లో న్యాయపతి రాఘవరావు గారితో వివాహం జరిగింది. తరువాత 1937లో మద్రాసులోని వెల్లింగ్టన్ టీచర్ ట్రైనింగ్ కాలేజీ లో ఉపాధ్యాయ శిక్షణ (ఎల్.టి.) పూర్తిచేశారు. ఇద్దరి అభిప్రాయాలు కలియడంతో భర్తకు తోడుగా, చెన్నై రేడియో కార్యక్రమాలలోను, బాల పత్రిక నిర్వహణలోను చురుగ్గా పాల్గొన్నారు.
చెన్నై ఆకాశవాణి కేంద్రం వారు ఆటవిడుపు పేరుతో పిల్లల కార్యక్రమ నిర్వహణ చేపట్టి, ఆ కార్యక్రమ నిర్వహణ వీరికిచ్చారు. ఈమె ఆ విధంగా రేడియో అక్కయ్యగా స్తిరపడిపోయారు. రాఘవరావుగారు ఈమె భర్త అయినా, ఈమెతో పాటుగా రేడియో కార్యక్రమాన్ని నిర్వహిస్తూండటంతో, అతనికి రేడియో అన్నయ్యగా పేరొచ్చింది. తరువాత ఈ కార్యక్రమం బాలానందంగా రూపాంతరం చెంది ఆకాశవాణి హైదరాబాదు కేంద్రము నుండి అనేక సంవత్సరములు వీరిద్దరిచే నిర్వహించబడినది. రేడియో లో ప్రసారమయ్యె స్త్రీల కార్యక్రమాలతో తృప్తిచెందక గ్రామీణ స్త్రీల కోసం 50 మహిళా సంఘాలనూ ప్రారంభిచారట. తన భర్తతో కలసి బాలానంద సంఘాన్ని ఏర్పరిచారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కందా ఈ సంఘంలో అతని చిన్నతనంలో సభ్యుడు. మంచి వ్యవహార జ్ఞానం గల విదుషీమణి రేడియో అక్కయ్య అక్టోబరు 23, 1980లో పరమపదించారు.
(సేకరణ)
9, ఫిబ్రవరి 2024, శుక్రవారం
తిరుమల రామచంద్ర, సంపాదకుడు, రచయిత, భాషావేత్త - charcoal pencil చిత్రం
నా charcoal పెన్సిల్ చిత్రం
సంపాదకుడు, రచయిత, స్వాతంత్ర్యసమరయోధుడు, భాషావేత్త. తిరుమల రామచంద్ర మాతృభాష తెలుగుతో పాటు కన్నడ, తమిళ, సంస్కృతం, ప్రాకృతాది భాషల్లో ప్రావీణ్యం కలిగిన బహుభాషావేత్త. రకరకాల వృత్తులు చేసి, వివిధ అనుభవాలు సంపాదించి విస్తృత లోకానుభవశాలి ఐన రామచంద్ర తనను తాను వినమ్రంగా భాషాసేవకుడు అని అభివర్ణించుకునేవారు. అనంతపురం జిల్లా ధర్మవరం తాలూకా రేగటిపల్లె లో 1913 జూన్ 17 న జన్మించిన రామచంద్ర హంపీ శిథిలాలలోని గ్రామమైన కమలాపురంలో తన బాల్యం గడిపారు వీరు సాక్షాత్తూ విజయనగర సామ్రాజ్యంలో కానవచ్చే తాతాచార్యుల వంశీయులు. సంస్కృత భాష, శాస్త్రాలను గురుశుశ్రూష చేసి నేర్చుకోవడం ప్రారంభించాక కారణాంతరాల వల్ల తిరుపతిలోని కళాశాలలో చేరారు. తెలుగు, సంస్కృతాలలో విద్వాన్ గా హిందీలో ప్రభాకరగా పట్టాలు పొందారు.
ద్వితీయ ప్రపంచ యుద్ద కాలంలో సైన్యంలో హవాల్దార్ గుమస్తాగా ,ఆపై భారతి మాసపత్రిక ఇన్ఛార్జ్ ఎడిటర్ గా పనిచేసారు వేటూరి ప్రభాకర శాస్త్రి గారికి ఏకలవ్య శిష్యునిగా చెప్పుకునేవారు .ఆంధ్రప్రభ ,పత్రిక ,ఆంధ్రభూమి ,హిందూస్తాన్ సమాచార్ పత్రికలలోనూ పనిచేసారు .పరిశోధన అనే ద్వైమాసపత్రిక 1953 -66 మధ్యకాలంలో సంపాదకత్వం వహించి ప్రచురించారు సాహితీ సుగతుని స్వగతం ,మన లిపి పుట్టు పూర్వోత్తరాలు ,నుడి -నానుడి ,తెలుగు పత్రికల సాహిత్య చరిత్ర ,మనవి మాటలు ,అహంభో అభివాదయే ,మరపురానిమనీషులు ,హిందువుల పండుగలు ,హాల గాధలు ,కాటమరాజు కథ ,హంపి నుండి హరప్పా వంటి గ్రంథాలు రచించారు 1993 లో తెలుగు విశ్వ విద్యాలయ విశిష్ట పురస్కారం పొందారు 84 ఏళ్ల వయసులో 1997 అక్టోబర్ 12 న తిరుమల రామచంద్ర అస్తమించారు.
విషయ సేకరణ సౌజన్యం : తెలుగు గ్లోబల్
8, ఫిబ్రవరి 2024, గురువారం
ప|| రామభద్ర రఘువీర రవివంశతిలక నీ- | నామమే కామధేనువు నమో నమో || - అన్నమయ్య కీర్తన
ప|| రామభద్ర రఘువీర రవివంశతిలక నీ- |
నామమే కామధేనువు నమో నమో ||
చ|| కౌసల్యానందవర్ధన ఘన దశరథసుత |
భాసురయజ్ఞరక్షక భరతాగ్రజ |
రాసికెక్కు కోదండరచన విద్యాగురువ |
వాసితో సురలు నిను పడి మెచ్చేరయ్యా ||
చ|| మారీచసుబాహు మర్దన తాటకాంతక |
దారుణ వీరశేఖర ధర్మపాలక |
కారుణ్యరత్నాకర కాకాసురవరద |
సారెకు వేదములు జయవెట్టేరయ్యా ||
చ|| సీతారమణ రాజశేఖరశిరోమణి |
భూతలపుటయోధ్యా పురనిలయా |
యీతల శ్రీవేంకటాద్రి నిరవయినరాఘవ |
ఘాత నీప్రతాపమెల్లా గడు నిండెనయ్యా ||
శ్రీరంగం నారాయణబాబు - రచయిత
శ్రీరంగం నారాయణబాబు - రచయిత - my charcoal pencil sketch
వీరు విజయనగరంలో, 1906, మే 17వ తేదీన జన్మించారు. వీరు ఆజన్మ బ్రహ్మచారి గా జీవితం గడిపారు.
నారాయణబాబు పద్య రచనలకు, భావ కవిత్వానికి భిన్నంగా కొంతమందితో కలసి సర్రియలిజం (Surrealism) అనే విదేశీయ ప్రక్రియను అనుసరించి రచనలు చేశారు. ఒక యదార్థ రూపాన్ని కవితలోనో, చిత్రలేఖనంలోనో చూపించినపుడు, ఆ విషయం యొక్క మూల స్వరూపాన్ని వివిధ విపరీత పరిస్థితులలో వర్ణించి మరువలేని చిత్రంగా ప్రదర్శించడమే "సర్రియలిజం" అంటారు. దీనిని "అధివాస్తవికత" అని కొందరు అంటే "అతి వాస్తవికత" అంటే బాగుంటుందని వీరు భావించారు. విధానం విదేశీయమైనది అయినా మన దేశపు పౌరాణిక గాథలు, సమయోచితమైన అర్థాన్నిచ్చే ఆంధ్ర, సంస్కృత శబ్ద ప్రయోగం వీరి రచనలకు ప్రత్యేక లక్షణాలు.
వీరు 1961, అక్టోబర్ 2వ తేదీన చెన్నైలో పరమపదించారు.
సౌజన్యం : వికీపీడియా
6, ఫిబ్రవరి 2024, మంగళవారం
పొణకా కనకమ్మ
charcoal pencil sketch
పొణకా కనకమ్మ (Ponaka Kanakamma) సుప్రసిద్ద సంఘసేవిక.{ఈమె జననం-1892, జూన్ 10 - మరణం 1963 సెప్టెంబరు 15}. ఈమె అమ్మమ్మ ఇంట నెల్లూరు జిల్లా మినగల్లులో 1892 జూన్ 10 న జన్మించింది. బాల్యంలో చదువుకోలేదు. నెల్లూరుకు చెందిన మరుపూరు కొండారెడ్డి కూతురు పొణకా కనకమ్మ. గొప్ప సంఘ సంస్కర్త. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న వారిలో మహిళలే ఎక్కువ. అటువంటి మహిళలలో చెప్పుకోదగ్గ వ్యక్తి కనకమ్మ . తనతో పాటు తన కుటుంబం మొత్తం సత్యాగ్రహం పోరాటంలో పాల్గొనేలా చేసింది. ఖద్దరు ప్రచారం చేసింది. నెల్లూరిలో అక్తొబరు 18 న, విజయదశమిరోజున కస్తూరీదేవి బాలికా పాఠశాలను స్థాపించింది. సాహిత్య రంగములో ఎంతో కృషి చేసింది. రాజకీయరంగంలో వీరికి ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ సహకారం లభించింది. 1930 లో సత్యాగ్రహసందర్భంలో జైలుకు వెళ్ళారు. కొంతకాలం జమీన్ రైతు పత్రిక నడిపింది.
courtesy - wikipedia
1, ఫిబ్రవరి 2024, గురువారం
మండపాక పార్వతీశ్వర శాస్త్రి
మండపాక పార్వతీశ్వర శాస్త్రి (Charcoal pencil sketch) |
మండపాక పార్వతీశ్వర శాస్త్రి (జూన్ 30, 1833 - జూన్ 30, 1897) పేరెన్నికగన్న సంస్కృతాంధ్ర కవి, పండితులు. వీరు శతాధికాలైన కృతులను రచించారు.
నోరి నరసింహశాస్త్రి
నా charcoal pencil చిత్రం.
నోరి నరసింహశాస్త్రి (1900 - 1978) ప్రముఖ తెలుగు కవి. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు, కన్నడ భాషలలో అతివేలమయిన అభినివేశాన్ని సంపాదించుకున్న మనీషులు. సాహిత్య శాస్త్రవలోకనంలో, ప్రాచీనాంధ్ర కవితా పరిశీలనంలో, అధునాతన సాహిత్య నిర్మాణంలో, సాంస్కృతిక అధ్యయనంలో, నవ్య సాహిత్య సమీక్షలో శ్రీ శాస్త్రిగారు గంభీరమయిన పరిశ్రమ చేసినవారు. సాహిత్యోద్యమంలో అగ్రేసరులు.
సౌజన్యం: వికేపీడియా
ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు
నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...
-
Dr. C. Narayana Reddy - My pencil sketch పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె వర్థంతి నాడు వారికి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొ...
-
మిత్రులు మాధవరావు కొరుప్రోలు గారు రచించిన గజల్ : పలుకుతేనె పాటలలో..రాశి పో''సినారె'' భళారే..! తెలుగువీణియ శృతి..తెల...
-
పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె కి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొన్ని భాగాలు ప్రపంచ పదులు ➿➿➿➿➿➿➿ సముద్రానికి చమురు పూస్తే నల్ల ...