17, ఫిబ్రవరి 2024, శనివారం

సమ్మెట అంబా ప్రసాద్ - హార్మోనియం సంగీత కళాకారుడు (charcoal pencil sketch)



సమ్మెట అంబా ప్రసాద్ (charcoal pencil sketch)

ఆయన 1905 తణుకులో  మాతామహుల ఇంట జన్మించారు. తల్లి శ్రీమతి సీతమ్మ. ఆయనకు గల నలుగురు సోదరులూ సంగీత విద్వాంసులే. ఆయన పెద్ద అన్నయ్య వెంకటరావు, తమ్ముడూ హార్మోనియం నిపుణులే. వీరి పూర్వులది బందరు సమీపంలోని సమ్మెట  గ్రామం. వారి తాతగారు హైదరాబాద్  వలస వచ్చారు. తండ్రి రంగనాయకులు గారు పబ్లిక్ వర్క్స్ శాఖలోనూ, నిజాం నవాబు పాలెస్ వర్క్స్ లోనూ పనిచేసేవాడు, అనేక జ్యోతిష గ్రంథాలను రచించారు. అంబా ప్రసాద్ గారు చాదర్గాట్ హైస్కూలులో మెట్రిక్ చదివారు. చదువు చాలించి విద్యాశాఖలో గుమస్తాగా చేరారు. ఆ శాఖలో 21 సంవత్సరాలు పనిచేసారు. తరువాత మహాబూలియా గర్ల్స్ హైస్కూలులో సిరిస్తాదారుగా నాలుగేళ్ళు పనిచేసారు. పగలంతా ఉద్యోగం చేసి రాత్రిపూట మనో ఉల్లాసం కోసం హార్మోనియం  సాధన చేసేవారు.

వీరు చిన్నతనంలో తన సోదరుడు వెంకటరావు వద్దను తర్వాత నిజాం  ఆస్థాన విద్వాంసులైన  హరి రామచంద్రరావు  గార్ల వద్ద హార్మోనియం  నేర్చుకున్నారు. విశేషమైన కృషిచేసి, హిందూస్థానీ సంగీత విద్వాంసులైన అబ్దుల్ కరీం ఖాన్, ఉస్తాద్ ఫయ్యజ్ ఖాన్ లకు వాద్య సహకారం అందించి అందరి మన్ననలు పొందారు. వీరు ఆంధ్ర దేశంలో పలు కచేరీలు చేశారు. మచిలీపట్నం లో  వీరు హరి నాగభూషణం  గారి ద్వారా సువర్ణ ఘంటా కంకణం పొందారు.


విషయ సేకరణ : వికీపీడియా ఆధారంగా 

కామెంట్‌లు లేవు:

Will

  When we use will to make a promise 🤝 or an offer 💡, we are usually deciding to do something at the very moment we are speaking. It shows...