నటి హేమలత - charcoal pencil sketch
పి.హేమలత తెలుగు సినిమా నటి. రంగస్థల నటిగా జీవితాన్ని ప్రారంభించిన హేమలత అంచెలంచెలుగా సినిమా నటిగా ఎదిగినది. ఆమె యన్టీఆర్, ఏయన్నార్ వంటి అగ్రకథానాయకుల చిత్రాల్లో తల్లి పాత్రలు పోషిస్తూ వచ్చింది. ముఖ్యంగా యన్టీఆర్ నటించిన పలు చిత్రాల్లో ఆయనకు తల్లిగా నటించి అలరించింది. అనేక చిత్రాల్లో సాధుమూర్తిగా నటించిన హేమలత బలిపీఠం వంటి చిత్రాల్లో గయ్యాళి పాత్రలూ పోషించింది. 1960ల నుండీ వచ్చిన సినిమాలలో అమ్మ పాత్ర కొంచెం మారింది. తనను తాను యస్సెర్ట్ చేసుకోవడం నేర్చుకుంది. హేమలత వారసత్వం, పరువు -ప్రతిష్ట సినిమాలలో ఇంటి వ్యవహారాలలో తన పట్టు నిలుపుకుంటూనే సినిమా ఆసాంతం ఒక ప్రధాన పాత్రలా కనిపించింది.
మరిన్ని వివరాలు క్రింది వికీపీడియా లింకు క్లిక్ చేసి తెలుసుకోవచ్చు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి