16, ఫిబ్రవరి 2024, శుక్రవారం

అత్తిలి కృష్ణారావు - నాటక ప్రముఖులు


 


అత్తిలి కృష్ణారావు (1938 - 1998) ప్రముఖ వీధి నాటక ప్రముఖులు.

వీరు విశాఖపట్నం లో  నాగన్న, మహాలక్ష్మి దంపతులకు 1938 ఏప్రిల్ 18 తేదీన జన్మించారు. ఉన్నత పాఠశాల  విద్యార్థిగా ఉన్నప్పుడే నాటక ప్రదర్శనలో నటించడం మొదలుపెట్టారు. వీరు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్న్ లో పట్టభద్రులై తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయం  నుండి నటన, నాటిక రచనల్లో డిప్లమో పొందారు. జానపద, రంగస్థల కళలు  అంశం మీద పి.హెచ్.డి. చేశారు. విశాఖ నాటక మండలి అధ్యక్షులు గజపతిరాజు అచ్యుతరామరాజు  దర్శకత్వంలో వీరు అనేక పాత్రలు పోషించారు.

వీరు మనస్తత్వాలు, దొంగ మొదలైన నాటకాలను దర్శకత్వం వహించి నటించి ఎన్నో సన్మానాలు బహుమతులు పొందారు. 1969 లో "యుగసంధ్య" అనే నాటకాన్ని రచించి, నటించి దర్శకత్వం వహించారు. ఈ నాటకం 14 భాషలలోకి అనువాదితమవడం గమనార్హం.


వీరు 1998 సంవత్సరంలో మరణించారు.


సౌజన్యం : వికీపీడియా 



కామెంట్‌లు లేవు:

ఈ తరం అమ్మాయి - కథ

 శీర్షిక : " ఈ తరం అమ్మాయి " రచన:   భవానికుమారి బెల్లంకొండ (ఇది నా స్వీయ రచన. PVR  మూర్తి గారి రెండు స్కెచెస్ మీ ఆధారంగా రాసిన కథ)...