30, మే 2024, గురువారం

గిడుగు వెంకట సీతాపతి

"కళాప్రపూర్ణ " గిడుగు వెంకట సీతాపతి charcoal pencil sketch 

గిడుగు వెంకట సీతాపతి (జనవరి 28, 1885 - ఏప్రిల్ 19, 1969) ప్రసిద్ధ భాషా పరిశోధకుడు. విజ్ఞాన సర్వస్వ నిర్మాత. పలు గేయాలను పిల్లలకోసం రాసిన సాహిత్యవేత్త. ఇతని బాలసాహిత్యంలో ప్రాచుర్యం పొందినది చిలకమ్మపెళ్ళి. 

వీరు నటించిన కొన్ని సినిమాలు పల్నాటి యుద్ధం(1947) భక్తిమాల(1941) రైతుబిడ్డ(1939) పంతులమ్మ(1943) సేకరణ: వికీపీడియా

గొట్టిపాటి బ్రహ్మయ్య - స్వాతంత్ర్య సమరయోధుడు

charcoal pencil sketch (drawn from source Wikipedia) గొట్టిపాటి బ్రహ్మయ్య (1889-1984) రైతు పెద్ద అను బిరుదుతో పేరు పొందిన స్వాతంత్ర్య సమర యోధుడు. భారత ప్రభుత్వం నుండి పద్మ భూషణ్ (1982) అవార్డు గ్రహీత. 

గొట్టిపాటి బ్రహ్మయ్య గారు కృష్ణా జిల్లాలోని చినకళ్ళేపల్లి లో1889 డిసెంబరు 3 న జన్మించారు. 1917లో, యుక్తవయసులోనే ఆయన గ్రంథాలయోద్యమము, వయోజన విద్యలపై దృష్టి సారించారు. 1922-23లో జిల్లా కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా పనిచేసారు. 1923-29లో కృష్ణా జిల్లా ఖాదీ బోర్డుకి అధ్యక్షునిగా ఉన్నారు. స్వాతంత్ర్య సమర యోధునిగా ఆయన జమీందార్ రైతు ఉద్యమంలో ఆచార్య ఎన్.జి.రంగా గారితో కలసి పాల్గోన్నారు, "సైమన్‌ కమిషను" బహిష్కరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం మున్నగు పలు కార్యక్రమాలలో పాలుపంచుకుని, పెక్కు దినాలు జైలుపాలయ్యారు. స్వాతంత్ర్యానంతరం ఆయన 1962లో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. 1964 జూలై 25 నుండి 1968 జూన్ 30 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి అధ్యక్షునిగా పనిచేసారు. సౌజన్యం : వికీపీడియా

29, మే 2024, బుధవారం

దివాకర్ల వేంకటావధాని -

charcoal pencil sketch . .
charcoal pencil sketch దివాకర్ల వెంకటావధాని (23 జూన్ 1911 – 21 అక్టోబర్ 1986) ఇతను తెలుగు పండితుడు కూడా. అష్ట దిగ్గజాలచే కృష్ణదేవరాయల ఆస్థానంలో జరిగిన కవిత్వ నివాళి-సమ్మేళనం యొక్క పునఃప్రతిపాదన అయిన భువన విజయం అనే వేదిక-విలువైన సాహిత్య లక్షణాన్ని అతను సృష్టించాడు. ఆసక్తి కలవారు మరిన్ని వివరాలు అంతర్జాలంలో సేకరించగలరు.

28, మే 2024, మంగళవారం

'కళాప్రపూర్ణ' నటరాజు రామకృష్ణ

నటరాజ రామకృష్ణ (1933 మార్చి 21 - 2011 జూన్ 7) కూచిపూడి నాట్య కళాకారుడు. ఇండోనేషియా లోని బాలి ద్వీపంలో జన్మించాడు. ఆంధ్రనాట్యము, పేరిణి శివతాండవము, నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చాడు. ఆయన ఆజన్మ బ్రహ్మచారి. (charcoal pencil sketch}
pencil sketch

27, మే 2024, సోమవారం

'గ్రంథాలయ పితామహుడు' అయ్యంకి వెంకటరమణయ్య


అయ్యంకి వెంకట రమణయ్య (1890-1979) గ్రంథాలయోద్యమకారుడు, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యంలో సిద్దహస్తులు, పత్రికా సంపాదకుడు. గ్రంథాలయ సర్వస్వము అనే పత్రికను నిర్వహించాడు. ఈయన గ్రంథాలయ ఉద్యమంలో జీవితాంతం విశేష కృషి సల్పి గ్రంథాలయ పితామహుడుగా పేరుగాంచాడు.

భారత ప్రభుత్వం వీరు చేసిన కృషిని గుర్తించి పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది.

చర్ల గణపతి శాస్త్రి

Pen and ink sketch

చర్ల గణపతిశాస్త్రి (జనవరి 1, 1909 - ఆగష్టు 16, 1996) వేద పండితుడు, గాంధేయవాది, ప్రాచీన గ్రంథాల అనువాదకుడు. ఈయన జనవరి 1, 1909 సంవత్సరంలో చర్ల నారాయణ శాస్త్రి, వెంకమ్మ దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లాలోని కాకరపర్రు గ్రామంలో జన్మించాడు. గ్రామంలో ప్రాథమిక విద్యానంతరం, కాకినాడలో విద్యార్థిదశలో ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్త్ర బహిష్కరణ వంటి స్వాతంత్ర్యోద్యమాలలో చురుకుగా పాల్గొన్నాడు. ఈయన వేదుల సూర్యనారాయణ మూర్తి కుమార్తె సుశీలను వివాహం చేసుకున్నాడు. ఈయన తొలి అనువాద కావ్యం మేఘ సందేశం (సంస్కృతం) 1927లో పూర్తయింది. తరువాతి కాలంలో ఈయన 150 కి పైగా ప్రాచీన సంస్కృత గ్రంథాలను, దర్శనాలను, విమర్శనలను, నాటకాలను తెలుగులోకి అనువదించాడు. ఈయన రచనలలో ముఖ్యమైనవి గణపతి రామాయణ సుధ, స్వతంత్రదీక్ష, బిల్హణ చరిత్ర, రఘువంశము,సాహిత్య సౌందర్య దర్శనం, వర్ధమాన మహావీరుడు,నారాయణీయ వ్యాఖ్యానము, భగవద్గీత, చీకటి జ్యోతి. 1961లో హైదరాబాదులో లలితా ప్రెస్ ప్రారంభించాడు. లియోటాల్ స్టాయ్ ఆంగ్లంలో రచించిన నవలను చీకటిలో జ్యోతి పేరుతో తెలుగులోనికి గణపతిశాస్త్రి అనువదించారు. ఈయన జీవిత కాలమంతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేద పండితుడుగా, మత సంబంధ సలహా సంఘ సభ్యుడుగా, తిరుమల తిరుపతి దేవస్థానాలు ఆస్థాన విద్వాంసుడుగా తన అనుభవాన్ని పంచాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈయనను కళా ప్రపూర్ణతో గౌరవించింది. భారత ప్రభుత్వం ఈయనను పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఈయన ఆగష్టు 16, 1996 సంవత్సరంలో పరమపదించాడు. 

 సౌజన్యం : వికీపీడియా

26, మే 2024, ఆదివారం

ఇందరికీ అభయంబులిచ్చు చేయి - అన్నమయ్య కీర్తన

ఇందరికీ అభయంబు లిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ‖ వెలలేని వేదములు వెదికి తెచ్చిన చేయి విలుకు గుబ్బలి కింద చేర్చు చేయి | కలికియగు భూకాంత కాగలించిన చేయి వలవైన కొనగోల్ల వాడిచేయి ‖ తనివోక బలి చేత దానమడిగిన చేయి వొనరంగ భూ దాన మొసగు చేయి | మొనసి జలనిధి యమ్ముమొనకు తెచ్చిన చేయి ఎనయ నాగేలు ధరియించు చేయి ‖ పురసతుల మానములు పొల్లసేసిన చేయి తురగంబు బరపెడి దొడ్డ చేయి | తిరువేంకటాచల ధీశుడై మోక్షంబు తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి ‖

చిత్రపు నారాయణమూర్తి

pencil sketch చిత్రపు నారాయణమూర్తి (1913-1985) తొలితరం చలనచిత్ర దర్శకుడు, నిర్మాత. ఇతడు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించాడు. ఇతడు తన మొదట తన సోదరుడు చిత్రపు నరసింహమూర్తికి సహాయకుడిగా సీతాకళ్యాణం, సతీతులసి, మోహినీరుక్మాంగద, కృష్ణ జరాసంధ మొదలైన సినిమాలకుపనిచేశాడు. దర్శకుడిగా ఇతని తొలిచిత్రం భక్త మార్కండేయ. ఈ చిత్రం ఇతడిని మంచి దర్శకుడిగా నిలబెట్టింది. తరువాత ఇతడు తెలుగు, తమిళ,కన్నడ భాషలలో అనేక సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇతడు 1961లో కృష్ణకుచేల అనే సినిమాను నిర్మించాడు. అది అతనికి ఆర్థికంగా నష్టాలను తెచ్చిపెట్టింది



 చిత్రపు నారాయణమూర్తి  - 


https://te.wikipedia.org/wiki/%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B1%81_%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3%E0%B0%AE%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF

రావు వెంకట కుమార మహీపతి సూర్యారావు - chaarcoal పెన్సిల్ స్కెచ్

రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు పిఠాపురం సంస్థానాన్ని పరిపాలించినవారిలో చివరివాడు. ఇతడు సాహిత్యప్రపంచానికి చేసిన సేవ అంతా ఒక ఎత్తు, నిఘంటు నిర్మాణానికి, ప్రచురణకు పాటుపడటం ఒక ఎత్తు. 1911, మే 12 న జరిగిన ఆంధ్రసాహిత్యపరిషత్తు సభలో జయంతి రామయ్య పంతులు నిఘంటు నిర్మాణానికి చేసిన ప్రతిపాదన విని ఇతడు ఆ నిఘంటు నిర్మాణానికయ్యే మొత్తం వ్యయం భరించడానికి సంసిద్ధుడైనాడు. ఆ ప్రకటనకు సభలోని వారంతా ఆనందపడ్డారు. జయంతి రామయ్య ఆధ్వర్యంలో ప్రారంభమైన నిఘంటువుకు శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు అని నామకరణం చేశారు. మరిన్ని వివరాలు క్రింది లింకు క్లిక్ చేసి చదవగలరు.





https://te.wikipedia.org/wiki/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81_%E0%B0%B5%E0%B1%87%E0%B0%82%E0%B0%95%E0%B0%9F%E0%B0%95%E0%B1%81%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0_%E0%B0%AE%E0%B0%B9%E0%B1%80%E0%B0%AA%E0%B0%A4%E0%B0%BF_%E0%B0%B8%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81

23, మే 2024, గురువారం

పండిత గోపదేవ్



Charcoal pencil sketch 

పండిత గోపదేవ్ (జులై 301896 - అక్టోబర్ 221996సంస్కృతములో మహాపండితుడు, తెలుగునాట ఆర్యసమాజ స్థాపకుడు, వైదికథర్మ ప్రచారకుడు, దార్శనికవేత్త, కళాప్రపూర్ణ బిరుదాంకితుడు.


11, మే 2024, శనివారం

దూరాలను ఓపలేను ఒదగనివ్వు గుండెల్లో..!! - గజల్



నా చిత్రానికి శ్రీమతి వాణి గారి రచన.

దూరాలను ఓపలేను ఒదగనివ్వు గుండెల్లో..!!
మౌనాలను మోయలేను ఒలకనివ్వు గుండెల్లో..!

ఎడబాటును కన్నీళ్ళకు కానుకగా ఇచ్చాను
నీఎదసడి వింటున్నా చేరనివ్వు గుండెల్లో ..!

భారమైన కాలానికి జ్ఞాపకాలు తోడైనవి
ప్రతీక్షణం మనదౌతూ బ్రతకనివ్వు గుండెల్లో..!

ఎన్నెన్నో ప్రశ్నలులే మనసులోన అలజడిలే
మమకారపు అందాలను వెతకనివ్వు గుండెల్లో..!

నువ్వొకటి నేనొకటి కాదు కాదు ఇకమీదట
మనమౌతు సంబరాలు చెయ్యనివ్వు గుండెల్లో.  !

......వాణి కొరటమద్ది

Pic Pvr Murty  ధన్యవాదాలు బాబాయ్ గారు  🙏

10, మే 2024, శుక్రవారం

నువ్వు నేను


నా చిత్రానికి అడపా పద్మ గారి  కవిత


శీర్షిక: నువ్వు-నేను

రచన: అడపా పద్మ.


సుప్రభాతంతో పులకించే 

వేకువ నేనైతే

ప్రత్యూషాన ఆవరించిన పూల పరిమళం నీవు

ఉషస్సులో ఉదయుంచే రవికిరణం నేనైతే

చిరు కిరణాల స్పర్శకి విరబూసే కమలం నీవు

ప్రకాశించే శశికాంతుడ నేనైతే

వికసించే కోనేటి కలువ నీవు

చైత్రాన చిగురించే మావిచిగురు

నేనైతే

రాగాలు పలికే 

ఎలకోయుల నీవు

తారంగమాడే సారంగం నేనైతే

వర్ణాలు విరజిమ్మే హరివిల్లు నీవు

అవధులు దాటని అనంత సాగరుడ నేనైతే

నయగారంతో నన్ను చేరుకొనే నదీకన్య నీవు

చెలీ! ఒకరి కోసం ఒకరుగా పుట్టిన మన కలయిక అపురూప సంగమం!

అడపా పద్మ

సమాప్తం.

పినపాల వెంకట దాసు - సినిమా పంపిణీదారుడు, స్టూడియో అధినేత, సినీ నిర్మాత - charcoal pencil sketch


పినపాల వెంకటదాసు - charcoal pencil sketch


పి.వి.దాసు గా ప్రసిద్ధిచెందిన పినపాల వెంకటదాసు (1870 - 1936)  తొలి రోజుల్లో తెలుగు  సినిమా పంపిణీదారుడు, తొలి తెలుగు స్టూడియో అధినేత, సినీ నిర్మాత. 

వీరు బందరు, రేపల్లెలో సినిమా హాళ్ల నిర్మించడమే కాకుండా టి.రాజన్, సి.డి.సామి, సి.పి.సారథి, జయంతీలాల్ థాకరేలతో కలసి 1934లో వేలు పిక్చర్స్ ప్రారంభించారు.  మద్రాసులో  తొట్టతొలి టాకీ స్టూడియో వేల్ పిక్చర్స్ స్టూడియో. అంతకు ముందు సినీ నిర్మాతలు బొంబాయి, కలకత్తా, కొల్హాపూరు, పూణే లోని సాంకేతికులపై ఆధారపడేవారు. ఈ స్టూడియో నాలుగేళ్ళ పాటే నిలిచినా తమిళ, తెలుగు  సినీ నిర్మాణంతో మహోన్నతమైన పాత్రపోషించింది.  మద్రాసులోనే  నిర్మాణానికి కావలసిన అన్ని సౌకర్యాలు సమకూర్చి సినీ పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేసింది. వేల్ పిక్చర్స్ పతాకంపై వెంకటదాసు సీతాకళ్యాణం కృష్ణలీలలు, మాయాబజార్ మొదలైన చిత్రాలను నిర్మించారు. ప్రభాత్ పిక్చర్స్ వారి తమిళ సినిమా ఆధారంగా ఈయన తెలుగులో తీసిన సీతాకళ్యాణం సినిమా, మద్రాసులో నిర్మించబడిన తొలి తెలుగు చలన చిత్రం. .  . తన స్వస్థలమైన బందరులో మునిసిపల్ కౌన్సిల్ సభ్యులుగాను, జిల్లా బోర్డు సభ్యులుగాను పనిచేశారు. ఈయన మహోన్నతంగా తీయాలనుకున్న  మాయాబజార్  సినిమా నిర్మాణము ఇంకా పూర్తికాక మునుపే వెంకటదాసు   1936 మే 10  తేదీన పరమపదించారు. పి.వి.దాసు మరణానంతరం వేల్‌ పిక్చర్స్ కనుమరుగై నరసు స్టూడియోస్ పేరుతో రూపాంతరం చెందింది.


credit : Wikipedia 

8, మే 2024, బుధవారం

పోతుకూచి సాంబశివరావు - రచయిత - pencil sketch




పోతుకూచి సాంబశివరావు -  pencil sketch 


పోతుకూచి సాంబశివరావు బహుముఖ ప్రజనాశాలి. కవిత్వం, పద్యాలు, కధలు, నవలలు, నాటికలు, నాటకాలు, జీవిత చరిత్రలు రాశారు. సాహితీ స్వస్థలను స్థాపించారు. తెలుగులో, ఆంగ్లంలో సాహిత్య పత్రికలను స్థాపించి సంపాదకత్వం వహించారు. సాహిత్య కార్యక్రమాలను నిర్వహించడంలో అందె వేసిన చెయ్యి .

 
తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు గ్రామంలో 1926 జనవరి 27న పోతుకూచి నరసింహ మూర్తి, సూరమ్మలకు రెండవ సంతానంగా సాంబశివరావు జన్మించారు. మేనమామ గండికోట రామమూర్తి ఆయనకు సాహిత్యంతో పరిచయం ఏర్పర్చారు. దాంతో కాకినాడలోని గ్రంథాలయాలు ఆయనకు ఆవాసాలయ్యాయి. తల్లి సూరమ్మ చెప్పే జానపద కథలు ఎంతో ఆసక్తితో వినడం అలవాటైంది. కాలేజీలో చదివే రోజుల్లోనే పద్యాలు రాశారు సాంబశివరావు. ‘ఇదీ తంతు’ అనే కథ రచించారు. దాన్ని నాటకీకరించి తానూ నటించారు. సచివాలయంలో స్టెనోగా ఉద్యోగం లభించింది. ఆ తర్వాత కార్మిక శాఖకు మారారు. అక్కడ ఉన్నప్పుడే ప్రైవేటుగా ఎల్‌.ఎల్‌.బి. చేశారు. ప్రముఖ కవి బోయి భీమన్న ఆయనను దామోదరం సంజీవయ్యకు పరిచయం చేశారు. నవ్యసాహితీ సమితిని. ఆ తర్వాత విశ్వసాహితిని ఆయన స్థాపించారు. ‘విశ్వ సాహితి’ ద్వారా అనేక కార్యక్రమాలను చేపట్టారు.
 
‘బిరాజ్‌ బహు’ అనే హిందీ సినిమా స్ఫూర్తితో 1955లో ‘ఉదయ కిరణాలు’ అనే నవల రాశారు పోతుకూచి. ఈ నవలను 1967లో రష్యన్‌ భాషలోకి కూడా అనువదించారు. ‘అన్వేషణ’, ‘ఏడు రోజుల మజిలీ’, ‘చలమయ్య షష్టిపూర్తి’, ‘నీరజ’ అనే నవలలను రచించారు. అనేక పద్యాలు, గేయాలు, వచన కవితలు రాశారు. ‘హంతకులు’ అనే నాటక రచయితగా ఎంతో ప్రఖ్యాతి పొందారు సాంబశివరావు. ఈ నాటకం ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు పొందింది. దాదాపు 350 కథలను రాశారు.
 
అనువాదంలోనూ అందె వేసిన చెయ్యి. ఆలిండియా రేడియో జాతీయ కవిసమ్మేళనం కోసం వివిధ భాషల కవితలను తెలుగులోకి అనువదించారు. నేషనల్‌ బుక్‌ ట్రస్టు వారి బాల సాహిత్యాన్ని తెలుగులోకి తీసుకువచ్చారు. ‘సంజీవయ్య దర్శనం’ అనే పేరుతో దామోదరం సంజీవయ్య జీవిత చరిత్ర రచించారు. సాయిబాబా జీవిత చరిత్రను కూడా ఆయన రాశారు.
 
ఆంధ్ర నాటక కళాపరిషత్తు ఉత్సవాలను 1965లో హైదరాబాదులో నిర్వహించారు పోతుకూచి. 1961లో యునెస్కో సదస్సులో దక్షిణ భారత ప్రతినిధిగా పాల్గన్నారు. హైదరాబాదులోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయానికి కార్యదర్శిగా పనిచేశారు. మొదటి ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో పాలుపంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్‌ లలిత కళా అకాడమీ సభ్యుడిగా, ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం సలహా మండలి సభ్యుడిగా, ఆంధ్ర మహిళాసభ సాహిత్య కార్యనిర్వాహక మండలిలో సభ్యుడిగా, కేంద్ర సాహిత్య అకాడమీ సలహా సంఘ సభ్యుడిగా, సెన్సార్‌ బోర్డు సభ్యునిగా సేవలందించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం సాంబశివరావుకు 1993లో ‘కళా ప్రపూర్ణ’ గౌరవ డాక్టరేటును ప్రదానం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు పురస్కారాలను ప్రదానం చేశాయి. ‘సాహితీ భీష్మ’, ‘కళారత్న’ తదితర బిరుదులను పొందారు. 2017 ఆగస్టు 6 న హైదరాబాదు లో మరణించారు.  

ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటూ తన జీవితాన్ని సాహిత్య సేవకే అంకితం చేసిన ఆయన మృతి తెలుగు సాహిత్యానికి తీరని లోటు.

5, మే 2024, ఆదివారం

'కళాప్రపూర్ణ' వజ్ఝల చినసీతారామస్వామి శాస్త్రి (charcoal స్కెచ్)





 'కళాప్రపూర్ణ' వజ్ఝల చినసీతారామస్వామి శాస్త్రి (charcoal pencil sketch)

వఝుల సీతారామశాస్త్రి లేదా వజ్ఝల చినసీతారామస్వామి శాస్త్రి (1878 జూన్ 25 - 1964 మే 29) ప్రముఖ భాషా శాస్త్రవేత్త, సాహిత్య విమర్శకుడు, జ్యోతిష శాస్త్రపండితుడు. పలు శాస్త్రాలను అభ్యసించి ఎన్నో రంగాల్లో కృషిచేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ద్రవిడ భాషల పరిశీలన, అధ్యయనం తదితర రంగాల్లో ఆయన విస్తృతమైన కృషిచేశారు.

 ఆయన పూర్తిపేరు చినసీతారామస్వామిశాస్త్రి. తండ్రి ముఖలింగేశ్వరుడు. తల్లి పేరు వేంకటాంబిక . సీతారామశాస్తి ఇంటిపేరు కూడా ఒజ్జ (ఉపాధ్యాయుడు) లు అనే పదం నుంచి వచ్చిందని పలువురు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారంటే వారి కుటుంబంలోని విద్వత్ సంప్రదాయం గురించి తెలుస్తోంది. గణితశాస్త్రాధ్యయనం, మూహూర్త నిర్ణయం, జన్మనక్షత్ర జాతకాదుల పరిశీలన వారి కుటుంబంలో పరంపరాగతంగా వచ్చిన విద్యలు. అతని స్వగ్రామం విజయనగరం జిల్లాబాడంగి మండలం లోని పాల్తేరు . ఆయన విజయనగర సంస్కృత కళాశాల, చెన్నపుర విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయ కళాశాలల్లో దశాబ్దాల పాటు బోధనా వృత్తిలో పనిచేశారు. 

1910-1912 సం.మధ్య విజయనగరము లోని రిప్పన్ హిందూధియోలాజికల్ హైస్కూలులో ఆంధ్రోపాధ్యాయ పదవి. 1912-1930 సం.మధ్య శ్రీవిజయనగర మహారాజావారి సంస్కృత కళాశాలలో ప్రధానాంధ్రోపాధ్యాయ పదవి. 1930-1933 మధ్య మదరాసు విశ్వ విద్యాలయము వారి ప్రాచ్య విద్యాపరిశోధక సంస్థలో ఆంధ్రోపాధ్యాయ పదవి పదవి. 1933-1941 మధ్య ఆంధ్రవిశ్వ కళాపరిషత్తులో ఆంధ్రోపాధ్యాయ పదవి.

(సేకరణ : వికీపీడీయా  నుండి)


(My charcoal pencil sketch)

3, మే 2024, శుక్రవారం

కొర్రపాటి గంగాధరరావు - శతాధిక నాటక రచయిత - charcoal pencil sketch


నా chaarcoal పెన్సిల్ ద్వారా చిత్రీకరించుకున్న చిత్రం. 

శ్రీ కొర్రపాటి గంగాధరరావు : వీరు మే 10, 1922 న మచిలీపట్నం లో జన్మించారు.   నటుడు, దర్శకుడు, శతాధిక నాటకకర్త, కళావని సమాజ స్థాపకుడు. వీరి నాటకాలలో ఎన్నో ఉత్తమ రచనలుగా బహుమతులు అందుకున్నాయి. నాటకరంగాన్ని గురించి, నాటక ప్రదర్శన విధానాల గురించి అనేక వ్యాసాలను రచించి నాటక కళాభివృద్ధికి కృషిచేశారు., కళావని అనే నాటక సమాజాన్ని స్థాపించి, దానికి అధ్యక్షులుగా, దర్శకులుగా వ్యవహరించారు.

మరిన్ని వివరాలు ఈ క్రింది లింకు క్లిక్ చేసి చదివి తెలుసుకోగలరు. ధన్యవాదాలు 


https://www.sakshi.com/telugu-news/guest-columns/korrapati-gangadhara-rao-100th-birth-anniversary-1455137



2, మే 2024, గురువారం

'కళాప్రపూర్ణ" రావూరు వెంకటసత్యనారాయణ రావు


ఇతడు కృష్ణా జిల్లాముచ్చిలిగుంట గ్రామంలో జన్మించాడు. ఇతడు కృష్ణా పత్రికలోనుఆంధ్రప్రభ దినపత్రికలోను పాత్రికేయుడిగా పనిచేశాడు. కృష్ణాపత్రికలో "వడగళ్ళు" అనే శీర్షికలో వ్యంగ్య వ్యాసాలను, ఆంధ్రప్రభ దినపత్రికలో "ఆషామాషీ" అనే శీర్షికలో హాస్య వ్యాసాలను వ్రాశాడు. 1978లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళాప్రపూర్ణ గౌరవాన్ని అందుకున్నాడు. ఆంధ్ర నాటక కళాపరిషత్తుకు పది సంవత్సరాలపాటు కార్యదర్శిగా పనిచేశాడు.

సౌజన్యం : వికీపీడియా 


తెలుగు   సినిమా రంగంలోనూ తనదైన ముద్ర వేసి కొన్ని సినిమాలకు సంభాషణలు, పాటలు రచించాడు. 


మాగంటి వంశీ గారు షేర్ చేసిన ఫోటో ఆధారంగా రావూరు వారి porttrait  నా charcoal pencil తో చిత్రీకరించడమైనది. 


మరిన్ని వివరాలు ఈ క్రింది లింకు క్లిక్ చేసి చదవగలరు. ధన్యవాదాలు 

https://pustakam.net/?p=5839


 

1, మే 2024, బుధవారం

టి. జి. కమలా దేవి సినీ నటి, స్నూకర్ క్రీడాకారిణి


 

టి. జి. కమలాదేవి - my  charcoal pencil sketch, slide created by me. 

టి.జి.కమలాదేవి (డిసెంబర్‌ 29, 1930 - ఆగస్టు 16, 2012) (TG Kamala Devi) (ఏ.కమలా చంద్రబాబు) అసలు పేరు తోట గోవిందమ్మ. వివాహం అయ్యాక భర్త పేరు చేరి ఈమె పేరు ఏ.కమలా చంద్రబాబుగా మారింది. ఈమె తెలుగు సినిమా నటి, స్నూకర్ క్రీడాకారిణి. ప్రసిద్ధ నటుడు చిత్తూరు నాగయ్య భార్య జయమ్మకు చెల్లెలు. ఈవిడ స్వస్థలం కార్వేటినగరం. చిత్తూరు నాగయ్య ప్రోత్సాహంతో సినిమా రంగ ప్రవేశం చేసింది. ఈమె నటించిన మొట్ట మొదటి సినిమా చూడామణి. మాయలోకం అనే సినిమా ఈమెకు మంచిపేరు తెచ్చింది. అక్కినేని నాగేశ్వరరావుతో జోడీగా ముగ్గురు మరాఠీలు సినిమాలో నటించింది. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఆలపించిన తొలి యుగళ గీతానికి ఈమె హీరోయిన్‌గా నటించింది. పాతాళభైరవి, మల్లీశ్వరి (హీరోయిన్ ఇష్టసఖి జలజ) లాంటి హిట్‌ సినిమాల్లో నటించింది. ఈమె మల్లీశ్వరిలో కొన్ని పాటలు పాడడంతో పాటు, తరువాతి కాలంలో అనేక మంది నటీమణులకు డబ్బింగ్‌ చెప్పింది. తెలుగుతో పాటు అనేక తమిళ సినిమాల్లో కూడా ఈమె నటించింది.

కమలాదేవి 2012 ఆగస్టు 16 న చెన్నైలో మరణించింది.


Credit : Wikipedia 

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...