11, మే 2024, శనివారం

దూరాలను ఓపలేను ఒదగనివ్వు గుండెల్లో..!! - గజల్నా చిత్రానికి శ్రీమతి వాణి గారి రచన.

దూరాలను ఓపలేను ఒదగనివ్వు గుండెల్లో..!!
మౌనాలను మోయలేను ఒలకనివ్వు గుండెల్లో..!

ఎడబాటును కన్నీళ్ళకు కానుకగా ఇచ్చాను
నీఎదసడి వింటున్నా చేరనివ్వు గుండెల్లో ..!

భారమైన కాలానికి జ్ఞాపకాలు తోడైనవి
ప్రతీక్షణం మనదౌతూ బ్రతకనివ్వు గుండెల్లో..!

ఎన్నెన్నో ప్రశ్నలులే మనసులోన అలజడిలే
మమకారపు అందాలను వెతకనివ్వు గుండెల్లో..!

నువ్వొకటి నేనొకటి కాదు కాదు ఇకమీదట
మనమౌతు సంబరాలు చెయ్యనివ్వు గుండెల్లో.  !

......వాణి కొరటమద్ది

Pic Pvr Murty  ధన్యవాదాలు బాబాయ్ గారు  🙏

కామెంట్‌లు లేవు:

పండిత గోపదేవ్

Charcoal pencil sketch  పండిత  గోపదేవ్  ( జులై 30 ,  1896  -  అక్టోబర్ 22 ,  1996 )  సంస్కృతములో  మహాపండితుడు, తెలుగునాట  ఆర్యసమాజ  స్థాపకుడ...