కన్యాశుల్కం 'మధురవాణి'
*సాని ' దానికి మాత్రం నీతుండొద్దా ?
*సాని ' దానికి మాత్రం నీతుండొద్దా ?
ఏమని చెప్పఁగవచ్చు నిదివో నీ ప్రతాపము రామ రామభద్ర సీతారమణ సర్వేశ //పల్లవి //
వెరవున హరువిల్లు విరుఁగఁ దీసిననాఁడే అరయ విరిగె వీపు లసురలకు వరుస వనవాసపు వ్రతము వట్టినపుడె పరులమతుల భీతి వట్టె రఘురామ //ఏమని //
వచ్చి నీవు దండకావనము చొచ్చిననాఁడే చొచ్చిరి పాతాళ మసురలెల్లాను ముచ్చటాడి చుప్పనాతిముక్కు గోసిననాఁడే కొచ్చి దైత్యు లాసదెగఁ గోసిరి శ్రీరామ //ఏమని //
అడరి మారీచుపై నమ్ము విడిచిననాఁడే విడిచిరి దానవులు వేడుకలెల్లాను బడి విభీషణునిఁ జేపట్టితే రక్కసులెల్లా చిడిసి మల్లెవట్టిరి శ్రీవేంకటరామ //ఏమని //
భావము :
ఉపాయముతో నీవు శివధనుస్సును విఱిచినపుడే వీరులైన రాక్షసుల వెన్నెముకలు విఱిగిపోయాయి. వనవాసం చేయుట అనే వ్రతానికి నీవు పూనినపుడే శత్రువులైన అసురుల మనస్సులలో భయం జనించింది.
నేర్పుతో దండక అనే అడవిలోనికి నీవు ప్రవే శించినపుడే రక్కసులు భీతిచెంది బలిచక్రవర్తి నివాసమైన పాతాళం చేరి దాగుకొన్నారు.
అవక తవకగా మాటాడిన సూర్పణఖ పొడుగుపాటి ముక్కును నీవు తెగగోయించినపుడే దుర్మార్గులైన దానవుల ఆశలన్నీ తెగిపోయినవి. విజృంభించి నీవు మారీచునిపై బాణం వేసిననాడే దైత్యులు తమ సంబరములు మాని వేసినారు. శరణాగతుడైన విభీషణునికి నీవు ఆశ్రయ మొసగినపుడే ఓ సీతా పతీ !శ్రీనివాసా !దనుజులకు చీడ పట్టినది.
(భావమూలము :విద్వాన్ ముదివర్తి కొండమాచార్యుల వారి అమృత సారము) అన్నమయ్య సంకీర్తన సంఖ్య 281సంపుటం 4 స్వర కర్త :శ్రీ జోశ్యభట్ల రాజశేఖర శర్మ గారు/
(కీర్తన SVBCTTD APP వారి సౌజన్యంతో )
చిత్రాలు : పొన్నాడ మూర్తి
ఈ క్రింది లింక్ క్లిక్ చేసి ఈ కీర్తనను అద్భుతంగా గానం చేసిన చి. జొన్నలగడ్డ శ్రీకర్ గొంతులో వినవచ్చును.
https://www.youtube.com/watch?v=LQHnCTorloU
ధన్యవాదాలు
Charcoal pencil sketch
అరియకుడి రామానుజ అయ్యంగార్ (19 మే 1890– 23 జనవరి 1967 -- కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసుడు. ఇతడు పాడటంలో సరికొత్త శైలిని అభివృద్ధి చేశాడు. దానిని అరియకుడి సంప్రదాయంగా అతని శిష్యులు అనుసరిస్తున్నారు. ఇతడు కర్ణాటక సంగీత కచేరీలలో నూతన పద్ధతులను స్థిరపరిచాడు.
1954లో ఇతనికి సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ లభించింది. 1958లో భారత ప్రభుత్వం ఇతనికి పద్మభూష్గణ్ పురస్కారం ఇచ్చి సత్కరించింది.
ఇతడు తమిళనాడు రాష్ట్రంలోని కరైక్కుడి జిల్లా (ప్రస్తుతం శివగంగై జిల్లా) అరియకుడి పట్టణంలో 1980, మే 19 న జన్మించాడు. ఇతడు మొదట పుదుక్కోటై మలయప్ప అయ్యర్, నమక్కల్ నరసింహ అయ్యర్‌ల వద్ద విద్యనభ్యసించాడు. తరువాత పెక్కు సంవత్సరాలు పట్నం సుబ్రమణ్య అయ్యరు శిష్యుడు పూచి శ్రీనివాస అయ్యంగార్ వద్ద శిక్షణ పొందాడు
ఇతడు తన మొదటి ప్రదర్శన 1918లో త్యాగరాయ ఆరాధనోత్సవాలలో ఇచ్చాడు.
కర్ణాటక సంగీత దిగ్గజం సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ ఇతని గురించి ఇలా పేర్కొన్నాడు. "నేను అరియకుడి రామానుజ అయ్యర్ చేత చాలా ప్రభావితమయ్యాను. నేను ఇతనిలా పాడగలిగితే చాలు. నాకు ఇక పునర్జన్మ అక్కరలేదు". మరొక విద్వాంసుడు జి.ఎన్.బాలసుబ్రమణియన్ ఇతడు ఎదురు పడితే భక్తితో సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసేవాడు. ఇతడు మృదంగ కళాకారుడు పాలఘాట్ మణి అయ్యర్‌తో కలిసి అనేక కచేరీలు చేశాడు. ఇరువురికీ ఒకరి పట్ల మరొకరికి గాఢమైన స్నేహంతో పాటుగా గౌరవం ఉండేది. చెంబై వైద్యనాథ భాగవతార్, అరియకుడి రామానుజ అయ్యంగార్ ఇద్దరూ తన రెండు కళ్ళని పాలఘాట్ మణి అయ్యర్ చెబుతుండేవాడు.
(సౌజన్యం ః వికీపీడియా)
బహుముఖ ప్రజ్ఞాశాలి, పద్మభూషణ్, జెమిని సంస్థ అధినేత S. S. Vasan (1904-1969) (pen sketch).
పాలగుమ్మి పద్మరాజు రచయిత - పెన్సిల్ స్కెచ్ పాలగుమ్మి పద్మరాజు ( జూన్ 24 , 1915 - ఫిబ్రవరి 17 , 1983 ) ప్రముఖ తెలుగు రచయిత, కేంద్ర సాహిత్...