9, డిసెంబర్ 2016, శుక్రవారం

నన్ను ప్రేమిస్తే నా హృదయం పూలపాన్పు - కవిత



శ్రీమతి పొన్నాడ లక్ష్మి గారి కవిత కి నా వర్ణ చిత్రం.

నన్ను ప్రేమిస్తే నా హృదయం పూలపాన్పు
కాదని నిరసించితివా నా ఎద కఠిన శిల

నన్ను అనురాగంతో చేరదీస్తే నీ పాదదాసిని
కాదన్నచో నీపాలి నిరంతర అశాంతిని

నన్ను దయగా చూచితివా వరాలిచ్చే దేవతను
నిర్దయగా హింసిస్తే నీపాలి మృత్యుదేవతను

నన్నాదరించి ఆప్యాయతను పంచితివా 
నిన్ను శిరసున నుంచి పూజింతును

నన్ను విడనాడినా నే బ్రతుకలేను
నిన్నే నమ్మిన నన్ను కాధన్నా నిన్ను బ్రతకనివ్వను

రచన : పొన్నాడ లక్ష్మి 
(చిత్రం : Pvr Murty గారు)

కామెంట్‌లు లేవు:

పాలగుమ్మి పద్మరాజు -- రచయిత

 పాలగుమ్మి పద్మరాజు రచయిత -  పెన్సిల్ స్కెచ్ పాలగుమ్మి పద్మరాజు ( జూన్ 24 , 1915 - ఫిబ్రవరి 17 , 1983 ) ప్రముఖ తెలుగు రచయిత, కేంద్ర సాహిత్...