11, జూన్ 2020, గురువారం

చందాల కేశవదాసు - pencil sketch

తొలి తెలుగు సినీ గీత రచయిత 'చందాల కేశవదాసు'


చందాల కేశవదాసు అనే పేరు తరంలో చాలామందికి తెలియకపోవచ్చుగానీభలే మంచి చౌకబేరము...’ అనే పాట తెలియని తెలుగువారుండరు. ‘శ్రీకృష్ణతులాభారంసినిమాలో నారదుడు శ్రీకృష్ణుడిని కొనేసిన తర్వాత ఆయన్ని అంగట్లో పెట్టి జనాన్ని ఉద్దేశించి పాట పాడతాడు. పాట రాసింది ఎవరో కాదు చందాల కేశవదాసుగారే.  నాటకాల్లో మొదట పాడే పరబ్రహ్మ పరమేశ్వర అనే సుప్రసిద్ధ కీర్తనను వీరు రచించినదే.

తెలంగాణ లో ఖమ్మం జిల్లా జక్కేపల్లి గ్రామంలో 1876లో జన్మించిన కేశవదాసు తొలి తెలుగు టాకీగా చెప్పుకునేభక్తప్రహ్లాద’ (1931)లో పద్యాలు రాశారు. అప్పట్లోనే సినీరచయితగా కలకత్తా, మదరాసు, బెంగళూరులకు వెళ్లి స్ర్కిప్టులు రాసేవారట. ఆయన రాసినకనకతార’ నాటకాన్ని సినిమాగా కూడా తీశారు. కేశవదాసుగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన కేవలం రచయితే కాదు అద్భుతంగా హరికథాగానం కూడా చేసేవారు. నటుడిగా, నాటకకర్తగా, అవధానిగా ఆయన ప్రతిభ ఎన్నదగింది.

వ్యక్తిగా కూడా ఉన్నతమైన విలువలు, ఆదర్శాలకు కట్టుబడి జీవించాడు. ఏనాడూ కుల వివక్షను పాటించని వారాయన. హెచ్చు తగ్గులు మన సంస్కారాన్ని బట్టిగాని, కులాన్ని బట్టికాదనే వారు.

వీరు మే 14, 1956 సంవత్సరంలో మృతి చెందారు.

కామెంట్‌లు లేవు:

ఈ తరం అమ్మాయి - కథ

 శీర్షిక : " ఈ తరం అమ్మాయి " రచన:   భవానికుమారి బెల్లంకొండ (ఇది నా స్వీయ రచన. PVR  మూర్తి గారి రెండు స్కెచెస్ మీ ఆధారంగా రాసిన కథ)...