30, జులై 2021, శుక్రవారం

హాస్య నటుడు "జానీ వాకర్" - Johny Waker (pencil drawing)


 Tribute to ace comedian Johny Walker (Babruddin Jamaluddin Kazi) (11.11.1926 - 29.7.2003). (pencil sketch)

చరిత్ర సృష్టించిన అద్భుత హాస్య నటుడుజానీ వాకర్

'మాలిష్ ... తేల్ మాలిష్ ...' జానీ వాకర్ అనే పేరు విన్నప్పుడు మన మనసులో కదిలే ఈ అద్భుతమైన మహమ్మద్ రఫీ పాట. Johny Walker బాలీవుడ్ ‘కల్ట్ కమెడియన్లలో’ ఒకడుగా పేరుప్రఖ్యాతులు సంపాదించాడు. తన హాస్య నటన ద్వారా లక్షలమంది ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు.
జానీ వాకర్ అసలు పేరు ‘బద్రుద్దీన్ జమాలుద్దీన్ కాజీ’.
జానీ వాకర్ BEST (బాంబే ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్) బస్సు సర్వీసుతో బస్సు కండక్టర్ పనిచేసేవాడు. ఇతని హావభావాలు, పాసంజర్లుని అతను entertain చేస్తున్న features ప్రముఖ నటుడు, రచయిత అయిన బలరాజ్ సాహ్ని దృష్టిని ఆకర్షించాయి. ఆ సమయంలో గురదత్ చిత్రం ‘బాజీ’ కి script రాస్తున్న బలరాజ్ సాహ్నిఈతనిని గురుదత్ కి పరిచయం చేశాడు. అతని హావభావలు గురుదత్ ని బాగా ఆకర్షించాయి. screen test గా ఓ తాగుబోతు పాత్ర ఎలా చేస్తాడో చేసి చూబించమన్నాడు. కాజీ అద్భుతంగా నటించి చూపించాడు. కాజీ కి తెరపై కనిపించే పేరుగా 'జానీవాకర్' అని నామకరణం చేసాడు. మద్యం లో ఓ పెద్ద brand అయిన ‘జానీ వాకర్’ దీనికి కారణం కావచ్చు. తన దర్శకత్వ చిత్రం ‘బాజీ’లో అతని కోసం ఒక పాత్రను సృష్టించాడు. ఇంక అప్పటినుండీ జానీ వాకర్ వెనుదిరిగి చూడలేదు. 300 సినిమాలకి పైగా నటించి హిందీ చలనచిత్ర రంగంలో తిరుగులేని హాస్య నటుడు గా కీర్తి గడించాడు.

Who can forget 'Maalish.. Tel maalish" A highly popular song sung by Md. Rafi saab and wonderfully picturised on Johny Walker for the film 'Pyasa'.
Before entering films Johny Walker was a bus conductor. Actor/writer Balraj Sahni was so impressed with his antics and introduced him to Director Guru Dutt. Guru Dutt asked Kaji r to demonstrate a drunkard act. Dutt was so impressed with his acting style and a gave a screen name of Johny Walker (a very popular scotch whisky). He specially created a role for him in his movie 'Baaji'. Then there was no looking back for Johny Walker/

29, జులై 2021, గురువారం

రాచకొండ విశ్వనాధ శాస్త్రి - Rachakonda Viswanadha Sastri


 


నివాళి - ప్రముఖ రచయిత "రాచకొండ విశ్వనాథశాస్త్రి" జయంతి నేడు. (My Pencil sketch)


రాచకొండ విశ్వనాధశాస్త్రి (జూలై 30, 1922 - నవంబర్ 10, 1993) వృత్తి రీత్యా న్యాయవాది. రావిశాస్త్రిగా ప్రసిద్ధుడైన ఆయన, కథల్లో కూడా న్యాయవాదే . నేటి సమాజంలో నిత్యమూ పై తరగతులవారి అన్యాయాలకు, దౌర్జన్యాలకు గురై చిత్ర హింసలు పడుతున్న దీన, హీన ప్రజల తరపున తన ప్రతి రచనలోను వకాల్తా పుచ్చుకుని సాంఘిక (ఆర్థిక)న్యాయం కోసం "వాదించాడు". సమాజం అట్టడుగు పొరల్లో, అనుక్షణం భయపడుతూ జీవించే అథోజగత్సహొదరుల సమస్యలను, వాటివలన కలిగే దుఖాన్ని సూటిగా గుండెలకు నాటేలా చెప్పి పై జీవితం పట్ల పాఠకుల సానుభూతి "పిండ" గల ఏకైక ప్రతిభావంతుడు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల మాండలికంలో, అట్టడుగు వర్గాల భాషలో, సొగసుగా, ప్రతిభావంతంగా, ప్రభావవంతంగా, పాఠకుల హృదయాలకు హత్తుకు పోయేలా పదునైన రచనలు చేసాడు. (వికీపీడియా సౌజన్యంతో)

27, జులై 2021, మంగళవారం

M. L. Vasanthakumari - ఎమ్. ఎల్. వసంతకుమారి


 M.L. Vasanthakumari (Indian classical legend series - 2) - pencil drawing.

ఎం.ఎల్.వసంతకుమారి (M. L. Vasanthakumari) (జూలై 3, 1928 - అక్టోబర్ 31, 1990) 1950లలో కర్ణాటక సంగీత విద్వాంసురాలు, దక్షిణ భారత చలనచిత్రరంగంలో నేపథ్యగాయని. ఆమె పూర్తి పేరు మద్రాసు లలితాంగి వసంతకుమారి. కర్ణాటక సంగీతంలో .ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి, డి.కె.పట్టమ్మాళ్ ఆమెకు సమకాలీనులు.

1958 లో విడుదలైన భూకైలాస్ చిత్రంలో ఆమె పాడిన 'మున్నీట పవళించు నాగశయనా' పాట, మాయాబజార్ (1957) చిత్రంలో ఆమె పాడిన శ్రీకరులు దేవతలు శ్రీరస్తులనగా పాట, జయభేరి చిత్రంలో 'నీవెంత నెరజాణవౌరా' వంటి పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి. "చోరీ చోరీ" హిందీ చిత్రంలో ప్రఖ్యాత నృత్యాంగన కమలా లక్ష్మణ్ పై చిత్రీకరించిన వసంతకుమారి పాడిన తిల్లానా ఓ సూపర్ హిట్.

Madras Lalitangi Vasanthakumari (popularly referred to as MLV) (3 July 1928 – 31 October 1990) was a Carnatic musician and playback singer for film songs in many Indian languages. MLV and her contemporaries D. K. Pattammal and M. S. Subbulakshmi are popularly referred to as the female trinity of Carnatic Music.[1] A prime disciple of G. N. Balasubramaniam, she was the youngest among the established musicians of that era, and was the youngest female awardee of the Sangita Kalanidhi award.
As well as being a much sought-after playback singer for films, MLV popularised unfamiliar ragas and her Ragam Thanam Pallavis were considered cerebral. Additionally, she popularised the compositions of the Haridasas. Her most famous disciples include Srividya (her daughter), Sudha Raghunathan, Charumathi Ramachandran, A. Kanyakumari, Yogam Santhanam, V. Kaveri, Rose Muralikrishnan, Meena Subramanian and Yamuna Arumugam.
(source courtesy : Wikipedia)

24, జులై 2021, శనివారం

చందమామ రావో జాబిల్లి రావో కుందనపు పైడికోర వెన్నపాలు తేవో - అన్నమయ్య కీర్తన


బాపు గారు వేసిన ఓ నలుపు తెలుపు చిత్రాన్ని నేను రంగుల్లో మళ్ళీ చిత్రీకరించుకున్నాను. outline కలం తో వేసి రంగులు color pencils తో వేసాను. 


ఈ కీర్తన అన్నమయ్య వ్రాసింది అని చాలామందికి తెలియదు. "చందమామ రావే జాబిల్లి రావే" అంటూ పాడుతూ గోరుముద్దలు తినిపించడం అనాదిగా తెలుగునాట ఉంది. ఈ కీర్తన కి మాతృక అన్నమయ్య రచించిన "చందమామ రావో జాబిల్లి రావో". ఈ కీర్తనని ఇక్కడ పొందుపరుస్తున్నాను.


చందమామ రావో జాబిల్లి రావో

కుందనపు పైడికోర వెన్నపాలు తేవో॥
నగుమోము చక్కనయ్యకు నలువపుట్టించిన తండ్రికి
నిగమములందుండే అప్పకు మా నీలవర్ణునికి
జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇందిర మగనికి
ముగురికి మొదలైన ఘనునికి మాముద్దుల మురారి బాలునికి॥
తెలిదమ్మి కన్నులమేటికి మంచి తియ్యని మాటల గుమ్మకు
కలికిచేతల కోడెకు మా కతలకారి ఈబిడ్డకు
కులముద్దరించిన పట్టెకు మంచి గుణములు కలిగిన కోడెకు
నిలువెల్ల నిండబొయ్యారికి నవనిధుల చూపుల చూచేసుగుణునకు॥
సురలగాచిన దేవరకు చుంచు గరుడునెక్కిన గబ్బికి
నెరవాది బుద్దుల పెద్దకు మా నీటు చేతల పట్టికి
విరుల వింటివాని అయ్యకు వేవేలురూపుల స్వామికి
సిరిమించునెరవాది జాణకు మా శ్రీ వేంకటనాధునికి॥

ఈ కీర్తన నా శ్రీమతి పొన్నాడ లక్ష్మి గారు చాలా శ్రావ్యంగా పాడారు. ఆమె పాడిన పాట facebook లో లభ్యం. ఈ క్రింది లింక్ క్లిక్ చేసి వినవచ్చును.

ఈ కీర్తనకి డా. ఉమాదేవి జంధ్యాల గారు చాలా చక్కగా వ్యాఖ్యానించారు. ఈ క్రింది లింక్ క్లిక్ చేసి వినండి.


ధన్యవాదాలు.

22, జులై 2021, గురువారం

అద్భుత ప్లేబ్యాక్ గాయకుడు 'ముకేష్'


 
అద్భుత గాయకుడు ముకేష్, జననం 22 జూలై 1923 - మరణం 27 ఆగస్ట్ 1976


హిందీ చలనచిత్ర రంగంలో విశిష్ట స్థానం సంపాదించుకున్న అద్భుత గాయకుడు ముకేష్. భారతదేశానికి స్వాతంత్రం రాకముందే జన్మించాడు. హిందీ చలనచిత్ర ప్లేబ్యాక్ గాయకులైన మహమ్మద్ రఫీ, మన్నడే, కిషోర్ కుమార్, హేమంత్ కుమార్ వీరి సమకాలీకులు.

వీరి గాత్రం రాజ్ కపూర్ కి అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. రాజ్ కపూర్ ఎప్పుడు ముకేష్ గురించి ప్రస్తావించినా 'ముకేష్ తన ఆత్మ' అని చెప్పుకునేవాడు. జంట సంగీత దర్శకులైన శంకర్ జైకిషన్ దర్శకత్వంలో వీరు ఎన్నో హిట్ పాటలు పాడారు. విషాద గీతాలకు పెట్టింది పేరు ముకేష్. 'ఆనంద్' చిత్రంలో 'కహీం దూర్ జబ్ దిన్ ఢల్ జాయే' పాట రాజేష్ ఖన్నాకి ఎంత బాగా సరిపోయిందో చెప్పనవసరంలేదు.

ఆనాటి ప్రముఖ సంగీత దర్శకుడు అనిల్ బిశ్వాస్ వీరిని చిత్రసీమ కు పరిచయం చేశారు. వీరు పాడిన తొలి హిట్ పాట 'దిల్ జల్తాహై తో జల్ నే దే", చిత్రం 'పెహలీ నజర్'. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు. వీరు రాజ్ కపూర్ కోసం పాడిన 'ఆవారా హూం' పాట ప్రపంచంలోనే వివిధ దేశాల్లో చాలా ప్రఖ్యాతి ఎన్నొ రికార్డులు సాధించింది.

ముకెష్ పాడిన పాటలు ఇప్పటికీ ఎక్కడొ అక్కడ వినిపిస్తూనే ఉంటాయి. యువకులు నుండి వృధ్ధుల వరకూ వీరి పాటలు హమ్ చేస్తూనే ఉంటారు.

వీరు 'యహూది' చిత్రంలో శంకర్-జైకిషణ్ దర్శక్త్వంలో  దిలీప్ కుమార్ కి పాడిన 'యే మెరా దీవానా పన్ హై' పాటంటే నాకు చాలా చాలా ఇష్టం. ఈ క్రింది లింక్ క్లిక్ చేసి వినవచ్చు.

వీరు మృతి చెందినప్పుడు రాజ్ కపూర్ 'నా గొంతు మూగపోయింది' అని అన్నారంటే వారిద్దరిదీ ఎంత ఆత్మీయ అనుబంధమో తెలుస్తుంది.

ఈ రోజు ముకేష్ జయంతి సందర్బంగా నా నివాళులు అర్పిస్తూ నాకు నచ్చిన 'ఏ మెరా దీవానాపన్ హై" పాట విందామా...


ముకేష్ గురించి మరిన్ని వివరాలు సేకరించారు శ్రీమతి ఉషా మోహన్ రాజు గారు. ఈ క్రింది fb లింక్ క్లిక్ చేసి చూడవచ్చు. ఈమె మంచి గాయని. ముకేష్ పాడిన "ఆంశూ భరీ హై ఏ జీవన్ కి రాహేం" పాటా చాలా చక్కగా పాడారు. ఆమెకు నా అభినందనలు.

21, జులై 2021, బుధవారం

భగవాన్ దాదా - Bhagwan Dada


Pencil Drawing of Bhagwan Dada most popularly known as Dancing Bhagwan

Dancing Bhagwan (Bhagwan Dada) (1931-2002) కొంచెం ఉబ్బిన కళ్ళు , కొంచెం భారీ శరీరం అతనొక శృంగార హీరో కాదు. కాని అతను తన trade mark dancing style లో steps వేసినప్పుడు యువ హృదయాలు ఉబ్బితబ్భిబ్బాయి. "షోలా జో భడ్కే" మరియు "భోలి సూరత్" పాటలకు అతని dancing చేస్తూ వేసిన steps కి విశేష ప్రజాదరణ లభించడంతో ఆ style నే తన సొంతం చేసుకున్నాడు. సినిమాల్లో అతని ప్రతి కదలిక dancing style లో ఉంటుంది. అదీ అతని గొప్పతనం. ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇప్పుడు అతని అభినయం చేసిన పాటలు పాడుతూ pubs లో యువకులు steps వేస్తున్నారట. ఇటీవల విన్నాను.

ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి 1951 సంవత్సరంలో Albela అనే ఓ చిత్రం నిర్మించాడు. అనూహ్యంగా ఆ చిత్రం ఆ సంవత్సరం దేశంలోనే విడుదలైన భారతీయ చిత్రాల వసూళ్ళలో మూడవ స్థానంలో నిలిచింది. ఇందులో గీతాబాలి పై చిత్రీకరించిన 'ధీరే సే ఆజా అఖియన్ మే' పాట ఓ సూపర్ హిట్. తెలుగులో ఈ చిత్రాన్ని 'నాటకాలరాయుడు' పేరుతో తెలుగులో పునర్ నిర్మించారు.. ధీరేసే అజా పాటని' అదే బాణీలో తెలుగులో "నీలాల కన్నుల్లో మెలమెల్లగా నిదురమ్మా రావమ్మా రావే" అని సుశీల గారిచే పాడించారు.
ఈ నటుని biopic ని మరాఠీ భాషలో నిర్మించారు. ఇందులో విద్యాబాలన్ కూడా నటించింది.
dancing steps వేయడంలో అమితాబ్ బచ్చన్ అతని నుండి ఎంతగానో ప్రేరణ పొందానని చెప్పుకుంటుంటాడు. ఇంకా గోవింద, మిథున్ చక్రవర్తి వంటి వారు కూడా ఆయన నుండి ప్రేరణ పొందారట!

17, జులై 2021, శనివారం

కాదంబనీ గంగూలీ - వైద్యురాలు

 

My pencil sketch to pay tribute to Kadambani Ganguly

బ్రిటీషు సామ్రాజ్యములో పట్టభద్రురాలైన మొదటి ఇద్దరు మహిళా వైద్యులలో ఒకరు. . దక్షిణ ఆసియా నుండి పాశ్చాత్య వైద్యములో శిక్షణ పొందిన తొలి మహిళా వైద్యురాలు.

కాదంబని గంగూలీ ( 18 జూలై 1861 - 3 అక్టోబర్ 1923) ఆనందీబాయి జోషితో పాటు భారతదేశం నుండి మరియు మొత్తం బ్రిటిష్ సామ్రాజ్యం నుండి వచ్చిన మొదటి ఇద్దరు మహిళా వైద్యులలో ఒకరు. కాదంబని దక్షిణాసియాలో పట్టభదురాలైన పాశ్చాత్య వైద్యంలో శిక్షణ పొందిన మొదటి భారతీయురాలు మరియు దక్షిణాసియా మహిళా వైద్యురాలు కూడా.

మరిన్ని వివరాలు ఈ క్రింది లింక్ లో ..


15, జులై 2021, గురువారం

D. K. Pattammal - pencil sketch - డి. కె. పట్టమ్మళ్

My pencil sketch


కర్ణాటక సంగీత విద్వాంసురాలు, నేపథ్య గాయని. ఆమె అనేక భారతీయ భాషా చలన చిత్రాలలో పాడారు. 
కర్ణాటక సంగీతంలో ఆవిడకు ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మికు ఉన్నంత పేరుంది. ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మిఎం.ఎల్.వసంతకుమారి ఆమెకు సమకాలీనులు. ఈ ముగ్గురు గాయనీమణులు "కర్ణాటక గాత్ర సంగీతంలో స్త్రీరత్నత్రయం"గా సుప్రసిద్ధులు.  ప్రపంచ సంగీత ప్రేమికులెందరిచేతో ఆమె ఆరాధించబడింది. 

మరిన్ని వివరాలు ఈ క్రింది

 https://te.wikipedia.org/wiki/%E0%B0%A1%E0%B0%BF.%E0%B0%95%E0%B1%86.%E0%B0%AA%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D వికీపీడియా లింక్ క్లిక్ చేసి చదవండి.
 

13, జులై 2021, మంగళవారం

అద్భుత గాయని / తొలి హాస్య నటి ఉమాదేవి ఖత్రి (Tun Tun)



అద్భుత గాయని  'ఉమాదేవి ఖత్రి'.. అద్భుతమైన కంఠం. ఈమె పాడిన 'అఫ్సానా లిఖ్ రహీహూం' పాట అప్పటికీ ఇప్పటికీ ఓ సూపర్ హిట్. దేవుడిచ్చిన మంచి కంఠం ఉన్నా లతా మంఘేష్కర్, ఆశాభాంస్లే ల నేపధ్య గాయనీమణుల ప్రభంజనంలో ఈమె నిలబడలేకపోయింది. అయితే ఈమె body language, మాట తీరు సంగీత దర్శకుడు నౌషాద్, నటుడు దిలీప్ కుమార్ ని ఆలోపింపజేసాయి. ఈమెను ఓ హాస్య నటిగా వెండితెరకు పరిచయం చేస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది వీరిద్దరికీ. అత్యంత పేదరికంలో ఉన్న ఉమాదేవి వీరిద్దరిసహాయ సహకారలతో తప్పని పరిస్థితుల్లో హిందీ చిత్రసీమలో Tun Tun పేరుతో హాస్యనటిగా స్థిరపడింది. హిందీ చిత్రసీమలో తొలి హాస్యనటి కూడా ఈమే. ఈమె గురించి శ్రీమతి ఉషా మోహన్ రాజు గారు మరిన్ని వివరాలు సేకరించారు. ఉమాదేవి పాడిన పాట "afsana likh rahi hoon" పాటను చాలా బాగా  తన గళంలో వినిపించారు.  ఈ క్రింది facebook లింక్ క్లిక్ చేసి మీరూ ఆస్వాదించండి.






ధన్యవాదాలు.

 

11, జులై 2021, ఆదివారం

మౌనాలన్నీ మేఘాలై - కవిత, సౌజన్యం భారతీ మణి


 కవిత courtesy Bharati Mani

(pen sketch) కవయిత్రి భారతీ మణి గారి అనుమతితో ఆమె కవిత కి నా చిత్రం.

మౌనాలన్నీ మేఘాలై
మంచులా తేలిపోయాయి ....!!!
శూన్యాలన్నీ వెలుగులై
నా దారంతా పరచుకున్నాయి..!!!!
సుదూరాలు చేరువలుగా మారకపోయినా
మనసుకు నీ దగ్గరతనంతో
ఓదార్పు ఒడిచేరి పసితనపు
మాధుర్యాన్ని రుచి చూపిస్తుంది..!!!!
కల కనటంలేదు ఇది వాస్తవమే
భ్రమించడం లేదు భౌతికతనే
నిశీధి నీడ నను వెంటాడే ప్రతిసారి
దివ్వెలా నను చేరుకుంటావు....!!!!
వెన్నెలవై చల్లతనపు చనువుతో
చుట్టుకుపోతావు సూరీని రాకతో
నులివెచ్చని కిరణాలవేడికి కరిగి
కంటిపాపలో కన్నీటివై ఒదిగిపోతావు.....!!!
నా నీడవో నా తోడువో నా ఆయువో
వీడకు కలత భరించలేను ,చేరిపో
గుండె భద్రంగా చూసుకుంటుంది ఎప్పటికీ....!!!! (కవిత సౌజన్యం : భారతీ మణి)
....భారతీమణి....✍️

దిలీప్ కుమార్ - సాటిలేని మేటి నటుడు


దిలీప్ కుమార్ - నా చిత్ర నివాళి


 నా అత్యంత అభిమాన నటుడు దిలీప్ కుమార్ .. వీరు నటించిన చిత్రాలు పదేపదే చూసేవాణ్ణి.

ప్రపంచవ్యాప్తంగా వీరి అభిమానులు కోకొల్లలు. నటనలో సహజత్వం ఉండాలని నమ్మిన దిలీప్ తన సహజ నటనతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. వీరి గురించి మరిన్ని వివరాలు ఈ క్రింది లింక్ లో చదివి తెలుసుకోవచ్చు.


https://www.bbc.com/telugu/india-57754487


తన తొంభై ఎనిమిదేళ్ళ వయస్సులో జూలై 7, 2021 సంవత్సరంలో స్వర్గస్తులయ్యారు. ఆ మహానటునికి నా చిత్ర నివాళి.


10, జులై 2021, శనివారం

అఖిల లోకైకవంద్య హనుమంతుడా - అన్నమయ్య కీర్తన


 



(నా చిత్రలేఖనంలో ఓ అన్నమయ్య కీర్తన)


అఖిలలోకైకవంద్య హనుమంతుడా సీత-
శిఖామణి రామునికిఁ జేకొని తెచ్చితివి
అంబోధి లంఘించితివి హనుమంతుడ
కుంభినీజదూతవైతి గురుహనుమంతుడ
గంభీరప్రతాపమునఁ గడగితివి
జంభారిచే వరములు చయ్యన నందితివి
అంజనీదేవ కుమార హనుమంతుడ
కంజాప్తఫలహస్త ఘన హనుమంతుడ
సంజీవని దెచ్చిన శౌర్యుడవు
రంజిత వానరకుల రక్షకుఁడవైతివి
అట లంకసాధించిన హనుమంతుడ
చటుల సత్వసమేత జయహనుమంతుడ
ఘటన నలమేల్మంగకాంతు శ్రీవేంకటేశుకుఁ
దటుకన బంటవై ధరణి నిల్చితివి


ఈ కీర్తనకి వివరణాత్మక విశ్లేషణ అందించిన సోదరి డా. Umadevi Prasadarao Jandhyala గారికి నా ధన్యవాదాలు.
అన్నమయ్య కీర్తనకు నా వ్యాఖ్య
~~~~~~
అన్నమయ్య హనుమంతుని కీర్తిస్తూ వ్రాసిన ‘ అఖిలలోకైక వంద్య హనుమంతుడా….. ‘అనే కీర్తన శ్రీమతి పొన్నాడ లక్ష్మి ఈ రోజు పాడుతున్నారు.
పాటకు వేసిన శ్రీ పొన్నాడ మూర్తిగారి చిత్రం
ఆంజనేయుని ప్రసిద్ధ ప్రార్ధన శ్లోకాన్ని నాచే పలికించింది.
గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్,
రామాయణమహామాలా రత్నం వందే నిలాత్మజమ్’!
అన్నమయ్య పాట విన్నప్పుడు నాకు చెప్పాలనిపించిన మాటలలో కొంచెమైనా మీతో పంచుకోవాలనిపిస్తోంది!
హనుమంతుని గురించి తెలియనిదెవరికీ. మళ్ళీ కొత్తగా చెప్పేదేముంది? అనుకోకూడదుగా. నచ్చిన మధుర పదార్థం ఎప్పుడు దొరికినా తినక వదలంకదా!
బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగతా ।
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్భవేత్ ।।
హనుమన్నామస్మరణ ఎంత మహిమాన్వితం!!
అందుకే పాటతో బాటు నామాటలూ వినండిమరి!
వేలమంది వానరసైన్యంలో హనుమంతునికే శ్రీరాముడు ముద్రికనెందుకు ఇచ్చాడు?
హనుమంతుని బలం మీద సామర్థ్యంమీద అంత నమ్మకం శ్రీరామునికి. కార్యసాధకునికి అవసరమైన బుద్ధిబలం, దేహబలం ఉన్నవాడు వాయుపుత్రుడు. రుద్రతేజోద్భవుడు! చిరంజీవి!
పసితనంలోనే మింటికెగిరి కంజాప్తునే ఫలమని పట్టుకున్న వాడు.. ఇదీ గుర్తు చేసుకున్నాడు అన్నమయ్య
‘కంజాప్తఫల హస్త ఘనహనుమంత!
అంటూ ‘ తన కీర్తనలో !
బాలాంజనేయుడు భానుని ఫలమని పట్టినప్పుడే ఆ జంభారి విసిరిన వజ్రాయుధం తగిలి దవడకు దెబ్బతగలడంతో హనుమ అనే పేరువచ్చింది.
సొమ్మసిల్లిన సుతునిజూచి
వాయుదేవుడు కుపితుడై గాలివీచనీయక ముణగదీసుకున్నాడు. లోకాలు తల్లడిల్లాయి. అప్పడా ఇంద్రుడే వచ్చి పసివాడిని దీవించి హనుమపై ఆ వజ్రాయుధమే కాదు ఏ ఆయుధమూ పనిచేయదని వరమిచ్చిన సంగతి కూడ పాటలో ఉంది.
‘గంభీరప్రతాపమునఁ గడగితివి
జంభారిచే వరములు చయ్యన నందితివి… ‘అంటూ అన్నమయ్య ఈ సంఘటననూ పరవశంతో గుర్తుచేసుకున్నాడు తన
సంకీర్తనంలో!
హనుమ మహేంద్రగిరినెక్కి సాగరలంఘనానికి ఉద్యుక్తుడైనాడు।
అంబోధి దాటిన ఈ ఘట్టం వింటుంటే శతకంఠ రామాయణంలోని మూలా రామ్మూర్తి గారి పద్యమొకటి ప్రస్తావించాలనిపించింది.
సీ॥
తనదు వాలంబు మార్తాండ ప్రచండమై
తతరథంబునకు కేతనము గాగ
తనమోము సత్యలోక నివాస జలజాత
భవ చతురాస్య చుంబనము సేయ
తనయొంటి దీర్ఘదోర్దండ ప్రభావంబు
దిగ్గజంబులనెల్ల మొగ్గసేయ
తనబర్బల స్థూల తనుమహిమంబు
నీరజాండంబుల నిండుకొనగ
తే.గీ॥
తనదు భావంబునకు మహీతలము వణక
భూరి నక్షత్రములు మొలపూసలుగను
బెరిగి లోకంబులకు నెల్ల భీతిగదుర
విలయ భైరవ మూర్తియై మలయుచుండె॥
తోక సూర్యరథ కేతనమైందిట. ముఖం బ్రహ్మ ముఖాలను ముద్దాడిందట.
బాహువుల ముందు దిగ్గజాలు మొగ్గలైనాయట.
ఆ స్థూల దేహం బ్రహ్మాండమంతా వ్యాపించిందిట.
దూకుదామనే హనుమ ఆలోచనకే భూతలం వణికి పోయింది. తారకలు ఆయన మొలపూసలైనాయి. విలయకారకుడైన కాలభైరవుడిలా ఉన్నాడు హనుమ!
ఆయన పాద ఘట్టనతో…
సలలిత పుష్పితాగ్ర తరుశాఖల నుండి పూలగుత్తులు జలజలా రాలాయి. కొండ శిఖరాలు కూలిపోయాయి. పెను శిలలు దొర్లిపడ్జాయి.కులగిరులు కదిలాయి. జంతువులు పక్షులు భయంతో చెల్లాచెదరయినాయి. అంటారు మధునాపంతులవారు తమరచనలో.
ఇంతటి సంఘటనను అన్నమయ్య పాలబువ్వంత తియ్యగా —
అంబోధి లంఘించితివి హనుమంతుడ
కుంభినీజదూతవైతి గురుహనుమంతుడ
అంటూ
రెండు పాదాలలో సరళంగా చెప్పి ఇవన్నీ గుర్తుచేస్తాడు.
సీతామాత వద్దకు రాముని దూతగా వెళ్ళిన హనుమంతుడు సహసా విదధీత నక్రియా అన్నట్లు సమయోచితంగా ఆలోచించి మాట్లాడటం, ఆమెకు నమ్మకం కలిగేలా రామలక్ష్మణుల రూపాలను వర్ణించడం చేసాడు. గతంలో జరిగినవన్నీ వరసగా చెప్పాడు.
సీతాదేవికి శోకనివారణ కలిగించి, రాముడు వస్తాడనే ధైర్యం కలిగించాడు. తనశక్తిని నిరూపించుకోడానికి తనశరీరాన్ని ..
కం॥
జలనిధులు జానుదఘ్నం
బులుగా కులగిరులు గజ్జపొడవులుగాఁదా
రలుదలపువ్వులుగా , ది
క్కులు కడవన్ పెరిగె గగనకుధరము భంగిన్।అని వర్ణించాడొక కవి.
పుత్ర వాత్సల్యంతో జానకీ మాత హనుమంతునకు తన చూడామణిని శ్రీరామునికి అభిజ్ఞానంగా చూపమని ఇచ్చింది.
అది తెచ్చి చేతిలో పెట్టగానే రాముడు
సీత చూడామణి రూపం లో వచ్చినట్లుగా భావించి దానిని గుండెలకు హత్తుకున్నాడు
హృదయం స్వయమాతం
వైదేహ్య ఇవ మూర్తి మత్!
అని కాళిదాసు రఘువంశం లో ఈ దృశ్యాన్ని!
అడుగడుగునా తనప్రభువును సేవిస్తూ , అనుసరిస్తూ, అనుజ్ఞలు పాటిస్తూ ఆపదవేళల ఆదుకుంటూ
రావణునితో యుద్ధంలో అంతా తానే అయి మసలినవాడు రామభక్త హనుమ!
లక్ష్మణుడు మూర్ఛిల్లినపుడు సంజీవని కోసం వెళ్ళి పర్వతాన్నే తీసుకువచ్చిన శక్తిమంతుడు వాయుపుత్రుడేగద! వానర కుల రక్షకుడైన హనుమంతుడు లేని రామాయణం ఊహించలేం. ఆ అంజనీకుమారుని అసాధారణ పరాక్రమం వర్ణనాతీతం. అందుకే అన్నమయ్య అఖిలలోకైక వంద్య హనుమంత అన్నాడు !
తన ప్రభువు వేంకటపతి వెలసిన సప్తగిరులలో ఒకటి అంజనాద్రి !ప్రభువెక్కడో భక్తుడూ అక్కడే . ఆ స్వామి ఎదుటే ఉన్నాడు బేడీ ఆంజనేయస్వామి!
అన్నమయ్య హనుమంతునిపై చాలా పాటలు వ్రాసాడు. మారుతి మనసులో మెదిలితే పాటలూ మాటలూ కోకొల్లలు!
ఈ సందర్భంగా మల్లెమాల రామాయణం లోని ఒక పద్యంతో హనుమకు నమస్కరిద్దాం.
~
మ॥
ఘనుడా రాముని పంపునన్ వెడలి
లంకాపట్టణమ్మందు, సీ
తనుకన్నారగగాంచి మ్రొక్కులిడి , మాతా నేను శ్రీరామ దూ,
తను నీకింక శుభమ్ము గల్గునని యే
ధన్యుండు ఓదార్చె నా
హనుమంతున్ కడు భక్తితో గొలిచి నే నర్పింతు కైమోడ్పులన్ !

7, జులై 2021, బుధవారం

డా. బాలమురళీకృష్ణ - చిత్రాలు, పద్యాలు



 


పద్యరచన ఓ అద్భుతమైన ప్రక్రియ. ఇది తెలుగువారి సొంతం. ఎన్నో వాక్యాల్లో చెప్పలేని భావాన్ని తక్కువ పదజాలంతో పద్యాల్లో పలికించవచ్చు. చిత్రకారుణ్ణి గా కొందరు కవులు పద్య రూపాంలో నా చిత్రాలకు వన్నె తెస్తున్నారు. అటువంటి వారిలో మిత్రులు శ్రీ వెంకటేశ్వర ప్రసాద్ గారు ఒకరు.  నేను చిత్రించిన సంగీత విద్వాంసుడు డా. బాలమురళీ కృష్ణ గారి చిత్రాలకు వారు చక్కని పద్య రచన చేశారు. వారికి నా ధన్యవాదాలు. 



కం.

సుర గాత్రపు స్వరభారతి
తరగని సంగీతపు ఖని తలుపగ నతడే
వరపుత్రుడు నాద మునియు
భారతావని ముద్దుబిడ్డ బాలమురళియే

కం.
కవిగాయక వైతాళిక
చవిగలిగిన గాత్రధర్మి సాధకుడనగన్
భువి బాలమురళి యొకడే
వివశత్వము గలుగు గాత్ర మినినంటతనే

కం.
బాలమురళి గళ మాధురి
కాలము స్తంభింప జేయు కమనీయంబౌ
జోలగ నూయలలూపును
గాలుని గరగింపజేసి కరుణను నింపున్


4, జులై 2021, ఆదివారం

ఎమ్. ఎస్. రామారావు



సుందరకాండ, హనుమాన్ చాలీసా అనగానే అద్భుత గాయకుడు M.S. Ramarao గారు గుర్తుకొస్తారు. తెలుగులో అనువదించి వారు అద్భుతంగా గానం చేసారు. వారి శతజయంతి సందర్భంగా వారికి నా నివాళి.


ఈ మహోన్నత వ్యక్తి 
గురించి మరింత వివరంగా ఈ క్రింది youtube లిం క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.


ధన్యవాదాలు.

https://www.youtube.com/watch?v=-5dSjA-ZD5U

 

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...