11, జులై 2021, ఆదివారం

మౌనాలన్నీ మేఘాలై - కవిత, సౌజన్యం భారతీ మణి


 కవిత courtesy Bharati Mani

(pen sketch) కవయిత్రి భారతీ మణి గారి అనుమతితో ఆమె కవిత కి నా చిత్రం.

మౌనాలన్నీ మేఘాలై
మంచులా తేలిపోయాయి ....!!!
శూన్యాలన్నీ వెలుగులై
నా దారంతా పరచుకున్నాయి..!!!!
సుదూరాలు చేరువలుగా మారకపోయినా
మనసుకు నీ దగ్గరతనంతో
ఓదార్పు ఒడిచేరి పసితనపు
మాధుర్యాన్ని రుచి చూపిస్తుంది..!!!!
కల కనటంలేదు ఇది వాస్తవమే
భ్రమించడం లేదు భౌతికతనే
నిశీధి నీడ నను వెంటాడే ప్రతిసారి
దివ్వెలా నను చేరుకుంటావు....!!!!
వెన్నెలవై చల్లతనపు చనువుతో
చుట్టుకుపోతావు సూరీని రాకతో
నులివెచ్చని కిరణాలవేడికి కరిగి
కంటిపాపలో కన్నీటివై ఒదిగిపోతావు.....!!!
నా నీడవో నా తోడువో నా ఆయువో
వీడకు కలత భరించలేను ,చేరిపో
గుండె భద్రంగా చూసుకుంటుంది ఎప్పటికీ....!!!! (కవిత సౌజన్యం : భారతీ మణి)
....భారతీమణి....✍️

కామెంట్‌లు లేవు:

ముందు చూపు కలిగి - ఆటవెలది

ఎంత చక్కటి చిత్రమో 😍 ఆటవెలది // ముందు చూపు గలిగి ముందునిద్ర యనుచు  కన్ను మూసి మంచి కలలు గనుచు  హాయిననుభవించు రేయి పగలు  యంత దూర దృష్టి వింత...