7, జులై 2021, బుధవారం

డా. బాలమురళీకృష్ణ - చిత్రాలు, పద్యాలు



 


పద్యరచన ఓ అద్భుతమైన ప్రక్రియ. ఇది తెలుగువారి సొంతం. ఎన్నో వాక్యాల్లో చెప్పలేని భావాన్ని తక్కువ పదజాలంతో పద్యాల్లో పలికించవచ్చు. చిత్రకారుణ్ణి గా కొందరు కవులు పద్య రూపాంలో నా చిత్రాలకు వన్నె తెస్తున్నారు. అటువంటి వారిలో మిత్రులు శ్రీ వెంకటేశ్వర ప్రసాద్ గారు ఒకరు.  నేను చిత్రించిన సంగీత విద్వాంసుడు డా. బాలమురళీ కృష్ణ గారి చిత్రాలకు వారు చక్కని పద్య రచన చేశారు. వారికి నా ధన్యవాదాలు. 



కం.

సుర గాత్రపు స్వరభారతి
తరగని సంగీతపు ఖని తలుపగ నతడే
వరపుత్రుడు నాద మునియు
భారతావని ముద్దుబిడ్డ బాలమురళియే

కం.
కవిగాయక వైతాళిక
చవిగలిగిన గాత్రధర్మి సాధకుడనగన్
భువి బాలమురళి యొకడే
వివశత్వము గలుగు గాత్ర మినినంటతనే

కం.
బాలమురళి గళ మాధురి
కాలము స్తంభింప జేయు కమనీయంబౌ
జోలగ నూయలలూపును
గాలుని గరగింపజేసి కరుణను నింపున్


కామెంట్‌లు లేవు:

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...