22, జులై 2021, గురువారం

అద్భుత ప్లేబ్యాక్ గాయకుడు 'ముకేష్'


 
అద్భుత గాయకుడు ముకేష్, జననం 22 జూలై 1923 - మరణం 27 ఆగస్ట్ 1976


హిందీ చలనచిత్ర రంగంలో విశిష్ట స్థానం సంపాదించుకున్న అద్భుత గాయకుడు ముకేష్. భారతదేశానికి స్వాతంత్రం రాకముందే జన్మించాడు. హిందీ చలనచిత్ర ప్లేబ్యాక్ గాయకులైన మహమ్మద్ రఫీ, మన్నడే, కిషోర్ కుమార్, హేమంత్ కుమార్ వీరి సమకాలీకులు.

వీరి గాత్రం రాజ్ కపూర్ కి అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. రాజ్ కపూర్ ఎప్పుడు ముకేష్ గురించి ప్రస్తావించినా 'ముకేష్ తన ఆత్మ' అని చెప్పుకునేవాడు. జంట సంగీత దర్శకులైన శంకర్ జైకిషన్ దర్శకత్వంలో వీరు ఎన్నో హిట్ పాటలు పాడారు. విషాద గీతాలకు పెట్టింది పేరు ముకేష్. 'ఆనంద్' చిత్రంలో 'కహీం దూర్ జబ్ దిన్ ఢల్ జాయే' పాట రాజేష్ ఖన్నాకి ఎంత బాగా సరిపోయిందో చెప్పనవసరంలేదు.

ఆనాటి ప్రముఖ సంగీత దర్శకుడు అనిల్ బిశ్వాస్ వీరిని చిత్రసీమ కు పరిచయం చేశారు. వీరు పాడిన తొలి హిట్ పాట 'దిల్ జల్తాహై తో జల్ నే దే", చిత్రం 'పెహలీ నజర్'. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు. వీరు రాజ్ కపూర్ కోసం పాడిన 'ఆవారా హూం' పాట ప్రపంచంలోనే వివిధ దేశాల్లో చాలా ప్రఖ్యాతి ఎన్నొ రికార్డులు సాధించింది.

ముకెష్ పాడిన పాటలు ఇప్పటికీ ఎక్కడొ అక్కడ వినిపిస్తూనే ఉంటాయి. యువకులు నుండి వృధ్ధుల వరకూ వీరి పాటలు హమ్ చేస్తూనే ఉంటారు.

వీరు 'యహూది' చిత్రంలో శంకర్-జైకిషణ్ దర్శక్త్వంలో  దిలీప్ కుమార్ కి పాడిన 'యే మెరా దీవానా పన్ హై' పాటంటే నాకు చాలా చాలా ఇష్టం. ఈ క్రింది లింక్ క్లిక్ చేసి వినవచ్చు.

వీరు మృతి చెందినప్పుడు రాజ్ కపూర్ 'నా గొంతు మూగపోయింది' అని అన్నారంటే వారిద్దరిదీ ఎంత ఆత్మీయ అనుబంధమో తెలుస్తుంది.

ఈ రోజు ముకేష్ జయంతి సందర్బంగా నా నివాళులు అర్పిస్తూ నాకు నచ్చిన 'ఏ మెరా దీవానాపన్ హై" పాట విందామా...


ముకేష్ గురించి మరిన్ని వివరాలు సేకరించారు శ్రీమతి ఉషా మోహన్ రాజు గారు. ఈ క్రింది fb లింక్ క్లిక్ చేసి చూడవచ్చు. ఈమె మంచి గాయని. ముకేష్ పాడిన "ఆంశూ భరీ హై ఏ జీవన్ కి రాహేం" పాటా చాలా చక్కగా పాడారు. ఆమెకు నా అభినందనలు.

1 కామెంట్‌:

Surya Mahavrata చెప్పారు...

ఫొటో అచ్చుగుద్దినట్టు వేసేరు మాస్టారు. కథనమూ బాగుంది. అభినందనలు.

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...