24, జులై 2021, శనివారం

చందమామ రావో జాబిల్లి రావో కుందనపు పైడికోర వెన్నపాలు తేవో - అన్నమయ్య కీర్తన


బాపు గారు వేసిన ఓ నలుపు తెలుపు చిత్రాన్ని నేను రంగుల్లో మళ్ళీ చిత్రీకరించుకున్నాను. outline కలం తో వేసి రంగులు color pencils తో వేసాను. 


ఈ కీర్తన అన్నమయ్య వ్రాసింది అని చాలామందికి తెలియదు. "చందమామ రావే జాబిల్లి రావే" అంటూ పాడుతూ గోరుముద్దలు తినిపించడం అనాదిగా తెలుగునాట ఉంది. ఈ కీర్తన కి మాతృక అన్నమయ్య రచించిన "చందమామ రావో జాబిల్లి రావో". ఈ కీర్తనని ఇక్కడ పొందుపరుస్తున్నాను.


చందమామ రావో జాబిల్లి రావో

కుందనపు పైడికోర వెన్నపాలు తేవో॥
నగుమోము చక్కనయ్యకు నలువపుట్టించిన తండ్రికి
నిగమములందుండే అప్పకు మా నీలవర్ణునికి
జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇందిర మగనికి
ముగురికి మొదలైన ఘనునికి మాముద్దుల మురారి బాలునికి॥
తెలిదమ్మి కన్నులమేటికి మంచి తియ్యని మాటల గుమ్మకు
కలికిచేతల కోడెకు మా కతలకారి ఈబిడ్డకు
కులముద్దరించిన పట్టెకు మంచి గుణములు కలిగిన కోడెకు
నిలువెల్ల నిండబొయ్యారికి నవనిధుల చూపుల చూచేసుగుణునకు॥
సురలగాచిన దేవరకు చుంచు గరుడునెక్కిన గబ్బికి
నెరవాది బుద్దుల పెద్దకు మా నీటు చేతల పట్టికి
విరుల వింటివాని అయ్యకు వేవేలురూపుల స్వామికి
సిరిమించునెరవాది జాణకు మా శ్రీ వేంకటనాధునికి॥

ఈ కీర్తన నా శ్రీమతి పొన్నాడ లక్ష్మి గారు చాలా శ్రావ్యంగా పాడారు. ఆమె పాడిన పాట facebook లో లభ్యం. ఈ క్రింది లింక్ క్లిక్ చేసి వినవచ్చును.

ఈ కీర్తనకి డా. ఉమాదేవి జంధ్యాల గారు చాలా చక్కగా వ్యాఖ్యానించారు. ఈ క్రింది లింక్ క్లిక్ చేసి వినండి.


ధన్యవాదాలు.

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...