3, అక్టోబర్ 2021, ఆదివారం

హాస్య, character నటుడు ఆసిత్ సేన్ (Asit Sen)


 (Pencil sketch drawn by me)


మీలో చాలామంది హృషికేశ్ ముఖర్జీ క్లాసిక్ చిత్రం ఆనంద్చూసే ఉంటారు. ఇందులో ఓ అద్భుతమైన  పాత్రను ప్రవేశపెట్టారు హృషి దా

ఫిర్ ఏక్ నయీ కాంప్లికేషన్ షురూ హోగయీఅంటూ తరచూ డాక్టర్ దగ్గరకి వచ్చి ఆయన బుర్ర తింటూఉంటాడు ఓ కారెక్టర్. తక్కువ మందులు రాస్తే నచ్చుకోడు. మందులు అవసరం లేని చిన్న చిన్న సమస్యలకి కూడా డాక్టర్ దగ్గరకి వచ్చి అదేదో కానిరోగం అని, పెద్ద చిట్టా మందులు రాస్తే కాని సంతృప్తి చెందడు. అతని దృష్టిలో ఆ డాక్టర్ ఓ చేతకానివాడు.  ఇటువంటి  వ్యక్తుల్ని నిజ జీవితంలో చూస్తూ ఉంటాం. అటువంటి అద్భుతమైన పాత్రని హృషీ దా సృష్టిస్తే చిత్రంలో ఉన్న నటుడు అసిత్ సేన్అంతే అద్భుతంగా ఆ పాత్రని పోషించాడు.

అసిత్ సేన్ సినిమాల్లోకి రాకముందు ఓ Still photographer. Uttar Pradesh రాష్ట్రంలో గోరఖ్పూర్ లో జన్మించాడు. వీరికి నాటకాలంటే చాలా ఇష్టం. ప్రఖ్యాత దర్శకుడు బిమల్ రాయ్ ఓ సారి వీరి నాటక ప్రదర్శన చూశాడు. వీరి నటన నచ్చుకుని తన Asstt. Director గా తీసుకున్నాడు.  పరివార్” “అపరాధీ కౌన్దర్శకత్వం వహించాడు. కాని నటనపట్ల ఎక్కువ ఆసక్తి కారణంగా అప్పట్నించీ సుమారుగా రెండువందల సినిమాల్లో చిన్న చిన్న హాస్య పాత్రల్లో నటించాడు. కొంచెం ఊబ శరీరం కాని ప్రత్యేకమైన  సన్నని గొంతు తో చాలా సహజ ధోరణి లో  dialogues చెప్పే తీరు జనాల్ని బాగా ఆకర్షించింది.


కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...