అబ్బూరి ఛాయాదేవి (జననం1933 - మరణం 2019) పలు పురస్కారాలు పొందిన ప్రముఖ రచయిత్రి
28, ఏప్రిల్ 2023, శుక్రవారం
అబ్బూరి ఛాయాదేవి - రచయిత్రి
ఓహో రాకాసులాల వద్దుసుండి వైరము - అన్నమయ్య కీర్తన
ఓవో రాకాసులాల వొద్దు సుండి వైరము
దేవుని శరణనరో తెలుసుకోరో
జగములో రాముడు జనియించె విష్ణుడదె
అగపడి లక్ష్మి సీతయై పుట్టెను
తగు శేష శంఖ చక్ర దైవసాధనములెల్ల
జిగి లక్ష్మనభరతాంచితశత్రుఘ్నులైరి
సురలు వానరులైరి సూర్యుడు సుగ్రీవుడు
మరిగి రుద్రుడే హనుమంతుడాయెను
సరుస బ్రహ్మదేవుడు జాంబవంతుడైనాడు
వెరవరి నలుడే విశ్వకర్మ సుండి
కట్టిరి సేతువపుడె ఘనులెల్ల దాటిరి
ముట్టిరి లంకానగరము నీదళము
యిట్టె శ్రీవేంకటేశుడితడై రావణుని జంపె
వొట్టుక వరము లిచ్చీ నొనర దాసులకు
చిత్రం : పొన్నాడ మూర్తి
22, ఏప్రిల్ 2023, శనివారం
కంటిమి నేడిదె గరుడాచలపతి -- అన్నమయ్య కీర్తన
సింహాచలేశుని చందనోత్సవం సందర్భంగా ఈ వారం అన్నమయ్య కీర్తన : కంటిమి నేడిదె గరుడాచలపతి.
కంటిమి నేడిదె గరుడాచలపతి
ఇంటి వేలుపగు యీశ్వరుండు ||
శ్రీనరసింహుడు చిన్మయకాంతుడు
దానవాంతకుడు దయానిధి
నానా మహిమల నమ్మిన వారిని
పూనుక కాచె పోషకుడితడు ||
దేవాది దేవుడు దినకర తేజుడు
జీవాంత రంగుడు శ్రీవిభుడు
దైవ శిఖామణి తలచిన వారిని
సేవలు గొనికాచె విభుడితడు ||
పరమమూర్తి హరి ప్రహ్లాద వరదుడు
కరుణానిధి బుధకల్పకము
పరగు శ్రీవేంకట పతి తనదాసుల
నరదుగ గాచేయనంతుడితడు ||
చిత్రం : Pvr Murty
15, ఏప్రిల్ 2023, శనివారం
పుడమి నిందరి బట్టెభూతము కడు- | బొడవైన నల్లనిభూతము - - అనమయ్య కీర్తన
పుడమి నిందరి బట్టెభూతము కడు- | బొడవైన నల్లనిభూతము -
ఈవారం అన్నమయ్య కీర్తన.
11, ఏప్రిల్ 2023, మంగళవారం
C. R. Rao - ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త
C.R.Rao - Pride of Telugu people, pride of Vizag.
భారత సంతతికి చెందిన ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త కల్యంపూడి రాధాకృష్ణ రావు( Kalyampudi Radhakrishna Rao ) (సీఆర్ రావు)కు ఈ ఏడాదికి గాను స్టాటిస్టిక్స్‌లో అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఇది ఆ రంగంలో నోబెల్‌తో సమానం. (వీరి వయస్సు 102 సంవత్సరాలు)
(Charcoal pencil sketch)
8, ఏప్రిల్ 2023, శనివారం
తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె యూఁగెఁగన చెల్లుబడినూఁగీని శ్రీరంగశిశువు - అన్నమయ్య కీర్తన
తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె యూఁగెఁగన చెల్లుబడినూఁగీని శ్రీరంగశిశువు - అన్నమయ్య కీర్తన
కలికి కావేరి తరగల బాహులతలనే
తలఁగకిటు రంగమధ్యపు తొట్టెల
పలుమారుఁదనునూఁచి పాడఁగానూఁగీని
చిలుపాల సెలవితో శ్రీ రంగ శిశువు
అదివొ కమలజుని తిరువారాధనంబనఁగ
అదనఁ గమలభవాండమనుతొట్టెల
ఉదధులు తరంగములనూఁచఁగా మాఁగీని
చెదరని సిరులతోడ శ్రీ రంగశిశువు
వేదములె చేరులై వెలయంగ శేషుఁడే
పాదుకొను తొట్టెలై పరగఁగాను
శ్రీ దేవితోఁగూడి శ్రీ వేంకటేశుఁడై
సేద దేరెడి వాఁడె శ్రీ రంగశిశువు
శ్రీరంగంలో వెలసిన రంగనాధస్వామిపై అన్నమాచార్యులు చెప్పిన అమరమైన సంకీర్తన ఇది. స్వామిని శ్రీరంగ శిశువని కీర్తిస్తున్నారు. నాలుగు వేదములూ నాలుగు తాళ్ళులాగా కట్టుబడిన వుయ్యాలలో ఆదిశేషుడు తొట్టెగా అమర్చబడిన చక్కటి వూయలలో వూగుతున్నాడు. ఆ చక్కటి నల్లని శిశువు. వాడే శ్రీదేవితో కలిసి వేంకటాద్రిపై సేద తీరుతున్నాడట. ఆ శ్రీరంగ శిశువు కమలభవాండమను (బ్రహ్మాండమను) తొట్టెలో బ్రహ్మాండమైన నీటి తరంగాలలో వూపుతుండగా స్థిరమైన సిరులతో వూగుతున్నాడట.
భావామృతం:-
పూర్వం ఒక మఱ్ఱి ఆకు తొట్టెవలె భాసించి దానిపై శ్రీరంగనాధస్వామి శిశువు వలె వూగినాడు కదా! అట్లు చెల్లుబడియైన ఆ మహానుభావుని కీర్తించెదము.
కావేరీనది కలికివలె (యువతివలె) బాహులతలవంటి తన తరంగములపై నదీ మధ్యమంలో అమర్చబడిన వేదిక అనే తొట్టెలో ఈ శ్రీరంగ శిశువు వూగుచున్నాడు. తనను చూచి అనేక కీర్తనలు పాడుచుండగా, చిలుపాల సెలవితో (చిక్కగా మరగబెట్టిన పాలచారికలు మూతిపై గల) శ్రీరంగ శిశువు వూగుచున్నాడు.
(సేకరణ)
చిత్రం : Pvr Murty
4, ఏప్రిల్ 2023, మంగళవారం
తెర వెనుక కథలు... ఒక అద్భుత హిందీ పాట
"Behind the scenes.." తెర వెనుక కథలు (1)
"He rom rom mein basane waale raam. Jagata ke swaamee, he antayraamee, main tuz se kyaa maangoo." పాట కథ.
"Neel Kamal" చిత్రంలో కథానాయిక వహీదా రెహమాన్ పై ఓ సన్నివేశంలో ఓ పాట చిత్రీకరించాలి, అది కూడా శ్రీరాముని ఉద్దేశించి. మరి పాట ఎవరు రాయాలి. దర్శకుడు రామ్ మహేశ్వరి ఈ సన్నివేశానికి సాహిర్ లూధియాన్వి సమర్ధుడు అని తోచింది. కానీ సాహిర్ నాస్తికుడు. అయినా ఆయన్ని సంప్రదించారు. "నాకు రామాయణం గురించి ఏమీ తెలియదు. నేను ఎలా రాయగలను" ఈ పాట అని తన అసమర్ధతను చెప్పుకున్నాడు సాహిర్. " నాకు మీ మీద నమ్మకం ఉంది. మంచి భావజాలంతో రాయగల సమర్థులు మీరే" అన్నాడు రామ్ మహేశ్వరి. కాదనలేక "నాకు , రెండు రోజులు సమయం ఇవ్వండి" అని అడిగాడు సాహిర్. వెంటనే రామాయణ భారతాలు బాగా తెలిసిన తన స్నేహితుని సంప్రదించాడు. తత్ఫలితంగా "హే రోమ్ రోమ్ మే బస్నే వాలే రామ్" అనే పాట రాశాడు. దర్శక నిర్మాతలకు ఈ పాట చాలా నచ్చేసింది. సంగీత దర్శకుడు రవి స్వరపరిచిన ఈ పాటని దర్శకుడు రామ్ మహేశ్వరి అద్భుతంగా చిత్రీకరించారు. సినిమా, ఆశా భోంస్లే పాడిన ఈ పాట రెండూ సూపర్ హిట్.
దూరదర్శన్ "రంగోలి" కార్యక్రమం ద్వారా ఈ ఆసక్తికర విషయం తెలుసుకున్నాను.
2, ఏప్రిల్ 2023, ఆదివారం
అబ్బూరి ఛాయాదేవి - రచయిత్రి (pencil sketch)
అబ్బూరి ఛాయాదేవి (అక్టోబరు 13, 1933 - జూన్ 28, 2019) తెలుగు కథా రచయిత్రి, స్త్రీవాద రచయిత. మె భర్త అబ్బూరి వరదరాజేశ్వరరావు కూడా తెలుగు రచయిత.
ఛాయాదేవి రాజమహేంద్రవరంలో1933 అక్టోబరు 13 లో సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 1951-53 మధ్య నిజాం కళాశాల నుండి ఎం.ఏ. చదివారు. 1953లో కాలేజీ మాగజైన్ లో ప్రచురించిన అనుభూతి వీరి మొదటి కథ. అప్పటి నుంచి ఛాయాదేవి గారు చాలా వరకు మధ్య తరగతి కుటుంబాలలోని స్త్రీలు ఎదుర్కొనే సమస్యల గురించి, పురుషాధిక్యతకు లోబడిన స్త్రీల గురించి చాలా కథలు రాసారు. కొన్ని కథలు హిందీ, తమిళ, మరాఠి, కన్నడ భాషలలోకి అనువదించబడ్డాయి. వీరి కథల్లో బోన్‌సాయ్ బ్రతుకు, ప్రయాణం సుఖాంతం, ఆఖరికి ఐదు నక్షత్రాలు, ఉడ్‌రోజ్ కథలు చాలా ప్రసిద్ధిపొందాయి. ఆడపిల్లల పెంపకంలోను, మగపిల్లల పెంపకంలోను వివక్ష చూపిస్తూ ఆడవాళ్ళ బ్రతుకుల్ని బోన్ సాయ్ చెట్టులా ఎదగనివ్వటం లేదని చెప్పే కథ బోన్ సాయ్ బ్రతుకు. ఈ కథని 2000 సంవత్సరంలో ఆంధ్రపదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో చేర్చింది. సుఖాంతం అనే కథ నేషనల్ బుక్ ట్రస్ట్ వారి కథాభారతి అనే సంకలనంలో 1972లో ప్రచురించబడింది.
ఛాయాదేవి వృత్తిరీత్యా న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో డిప్యూటీ లైబ్రేరియన్ గా పనిచేసి 1982లో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు.
1993లో వాసిరెడ్డి రంగనాయకమ్మ సాహిత్య పురస్కారం, 1996లో మృత్యుంజయ పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నారు. 2000 సంవత్సరంలో కళాసాగర్ పందిరి సాహితీ పురస్కారాలు అందుకున్నారు. 2005 సంవత్సరంలో తనమార్గం అనే కథాసంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్నది.
సౌజన్యం : వికీపీడియా
పండు వాళ్ళ నాన్న - కథ
నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న' 'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...
-
మిత్రులు మాధవరావు కొరుప్రోలు గారు రచించిన గజల్ : పలుకుతేనె పాటలలో..రాశి పో''సినారె'' భళారే..! తెలుగువీణియ శృతి..తెల...
-
Dr. C. Narayana Reddy - My pencil sketch పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె వర్థంతి నాడు వారికి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొ...
-
పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె కి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొన్ని భాగాలు ప్రపంచ పదులు ➿➿➿➿➿➿➿ సముద్రానికి చమురు పూస్తే నల్ల ...