14, ఏప్రిల్ 2024, ఆదివారం

మా తరం కా లేజీ అమ్మాయి




 సీ.


వాలుజడ నొకింత వదులుగాఁ నల్లియు

     సన్నజాజుల మాల జడను దాల్చి

ఒంటిపేట గొలుసు నొద్దికఁ నమరించి

      దిద్దియున్ తిలకంబుఁ దీరు గాను

శ్రోతస్సులందాల్చ జుమికీల నూపుచున్

      శిరము దిప్పుచు బల్కు జిత్రముగను

వస్త్రధారణ యందుఁ బరిణతిఁ దాజూపు

       చిరు దరహాసంబు చెదరనీక.


సీ.


క్షీరాశ గమనంబు కింకిర స్వనమున

           మంజులముగ బల్కు మంజుభాషి

లలితకళలటన్న రాణచూపు నువిద

           చదువు సంధ్యల యందు చదువులమ్మ

తల్లిదండ్రుల మాట తలదాల్చు తరుణియె

        ‌‌.  పిన్నపెద్దలయెడ పేర్మిజూపు

ఇంటిపనుల యందు నింతి కెంతయు శ్రద్ధ

           చెలిమి చేసిన జూపు స్నేహితమ్ము


తే.


ముగ్ధ మోహన రూపంబుఁ ముదముగూర్చ

కలికి నాటి యువకులకు కలలరాణి

కాంచ దుర్లభం బీచామఁ కలలనైన

నేత్ర పర్వమె యౌనె యీ నెలతఁ జూడ



కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...