ఈ చిత్రంలో వ్యక్తి కీర్తిశేషులు ద్వారం భావనారాయణ రావు. ఇతడు ద్వారం వెంకటస్వామి, జగ్గయ్యమ్మ దంపతులకు 1924 జూన్ 15 తేదీన బాపట్లలో జన్మించారు. చెన్నైలో విద్యాభ్యాసం చేసిన తర్వాత తండ్రి వద్ద, ప్రొ.పి.సాంబమూర్తి వద్ద సంగీతంలో శిక్షణ పొందారు.
ఇతడు విజయనగరంలోని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ గా 1962 నుండి 1973 వరకు, తర్వాత విజయవాడ లోని ప్రభుత్వ సంగీత కళాశాలలోను పనిచేశాడు.
ఇతడు మాతంగముని రచించిన బృహద్దేశి, పండిత వెంకటమఖి రచించిన చతుర్దండి ప్రకాశిక, దత్తిలముని రచించిన దత్తిళమును తెలుగులోకి అనువదించి ప్రచురించారు.
ఇతడు విశాఖపట్నంలో 2000 జూలై 24 తేదీన గుండెనొప్పితో అకస్మాత్తుగా పరమపదించాడు. ఈయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.
- ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ పురస్కారం.
- ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి సంగీత కళాప్రపూర్ణ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి