పేరాల భరతశర్మ (my pencil sketch)
వికీపీడియా ఆధారంగా సేకరించిన వివరాలు టూకీగా :
సంస్కృతాంధ్ర పండితులు పేరాల భరతశర్మ 1933 ఫిబ్రవరి 2 వ తేదీన ప్రకాశం జిల్లా, చీరాల పట్టణంలో జన్మించారు.
ఇతడు 1953లో డిగ్రీ పూర్తి అయిన వెంటనే తను చదువుకున్న ఎస్.ఆర్.ఆర్., సి.వి.ఆర్ కాలేజిలోనే ట్యూటర్‌గా ఉద్యోగంలో చేరారు . తక్కువ సమయంలోనే ఉపన్యాసకునిగా పదోన్నతి పొంది 1960వరకు అక్కడ పనిచేశారు . తరువాత కాకినాడలోని పిఠాపురం రాజావారి కళాశాలలో 1960 నుండి 1985 వరకు ఉపన్యాసకుని గా పనిచేశారు,. 1985లో మరొకసారి పదోన్నతి పొంది విజయనగరం మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు . 1991లో వీరు అధ్యాపక వృత్తి నుండి పదవీవిరమణ చేశారు.
అనేక అవధానాలు, రచనలు, ఉపన్యాసాల ద్వారా ప్రజలను ఆకట్టుకున్న పేరాల భరతశర్మ 2002, డిసెంబరు 13 న విజయవాడలో మరణించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి