పాలగుమ్మి పద్మరాజు రచయిత - పెన్సిల్ స్కెచ్
(సేకరణ)
పాలగుమ్మి పద్మరాజు రచయిత - పెన్సిల్ స్కెచ్
(సేకరణ)
చిత్రీకరణ : పొన్నాడ మూర్తి
★★★★★★★★★★★★★★★
💥 తెలుగునాటకరంగ వైభవం💥 ★★★★★★★★★★★★★★★
ఈనాటి మన చిరస్మరణీయులు..
శ్రీ నెల్లూరు నగరాజారావు
రంగస్థల నటులు, చిత్రకారులు, ఉపాధ్యాయులు,సినిమా నటులు...
శ్రీ నగరాజారావు 1887లో నరసింహారావు, మహాలక్ష్మమ్మ దంపతులకు నెల్లూరులో జన్మించారు. వీరి స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా, రాజోలు.
★ఉద్యోగం
కొంతకాలం బుచ్చిరెడ్డిపాలెంలో చిత్రలేఖన ఉపధ్యాయుడిగా పనిచేశారు.
★రంగస్థల ప్రస్థానం
నెల్లూరు జ్ఞానోదయ సమాజం ప్రదర్శించిన ప్రహ్లదలో ఇంద్రుడు పాత్రతో రంగస్థల ప్రవేశం చేశారు. ఒకవైపు ఉపాధ్యాయుడిగా కొనసాగుతూనే లవకుశ, కృష్ణలీలలు, సారంగధర, పాదుక, విజయనగర రాజ్యపతనం వంటి నాటకాలలో నటించారు.
★నటించిన పాత్రలు
ఇంద్రుడు (ప్రహ్లాదుడు)
పఠాన్
హిరణ్యకశ్యపుడు
దాశరథి
నలుడు
దుష్టబుద్ధి
యుగంధరుడు
పాపారాయుడు
కంసుడు
శివాజీ
అక్బర్
ఔరంగజేబు
తానీషా
రాజరాజు
రుస్తుం
నందుడు
వీరనాయకుడు
కీచకుడు
నక్షత్రకుడు
శకుడు
కర్ణుడు
దశరథుడు
నటించిన సినిమాలు సవరించు
శకుంతల (1932)
శ్రీరామ పట్టాభిషేకం (1932)
రామదాసు (1933)
సీతాకళ్యాణం (1934)
సతీ తులసి (1936)
ద్రౌపతీ వస్త్రాపహరణం (1936) (శకుని)
చిత్రనాళీయం (1938)
రైతుబిడ్డ (1939) (తాసీల్దారు)
కాలచక్రం (1940) (జడ్జి)
ఈయన 1942లో మరణించారు.వీరికి మా నివాళులు💐💐💐
వ్యాస రచన : శ్రీ నూలు సాంబశివరావు
వల్లూరి జగన్నాథరావు గారు తెలుగు లలిత సంగీత, నాటక రంగాల్లో ప్రసిద్ధి చెందిన రచయిత మరియు కళాకారుడు. ఆకాశవాణి (All India Radio) వేదికగా ఎన్నో అద్భుతమైన లలిత గీతాలు, సంగీత రూపకాలు, నాటికల ద్వారా శ్రోతలను అలరించారు. తేలికైన పదాలతో లోతైన భావాన్ని, తెలుగుదనం ఉట్టిపడే పదబంధాలను పలికించడంలో ఆయనది అందెవేసిన చెయ్యి.
తెలుగు సంస్కృతి, జీవన విధానం, ఆహారపు అలవాట్లను ప్రతిబింబిస్తూ ఆయన అందించిన ప్రత్యేకమైన గీతాలలో "గోంగూర పాట" అత్యంత ప్రాచుర్యం పొందింది.
గోంగూర పాట నేపథ్యం & విశేషాలు
తెలుగువారి వంటకాల్లో గోంగూరకు ఉన్న ప్రాధాన్యత అపారమైనది. అందుకే గోంగూరను ‘ఆంధ్రా శాకాహార రారాజు’ లేదా ‘ఆంధ్రా మాత’ అని కూడా చమత్కరిస్తుంటారు. ఈ ప్రత్యేకతను ఆధారం చేసుకుని వల్లూరి జగన్నాథరావు గారు ఈ పాటను రచించారు.
పదసంపద & శైలి: గోంగూర పులుపు, కారం కలయిక, వేడివేడి అన్నం, నెయ్యి, ఉల్లిపాయ నంజుకుంటూ తినే అనుభూతిని అత్యంత రసవత్తరంగా ఈ పాటలో వర్ణించారు. వింటుంటేనే నోరూరేలా గ్రామీణ తెలుగు నుడికారంతో పదాలు పొదిగారు.
ఆకాశవాణి ప్రసారం: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైన లలిత గీతాల కార్యక్రమాల్లో ఈ పాట శ్రోతల మన్ననలు పొందింది. ఆ కాలంలో ఇది ఎంతోమంది గృహిణులు, సంగీత ప్రియుల నాలుకలపై నర్తించింది.
సంగీతం & గానం: లలిత సంగీతానికి తగినట్టుగా సరళమైన రాగంలో, వినసొంపైన లయతో ఈ పాట సాగుతుంది. ఆహార సంస్కృతిని కూడా సాహిత్యంలోకి ఇంత అందంగా మలచవచ్చని నిరూపించిన గీతం ఇది.
తెలుగువారి ఆత్మీయత, ఆహార సంస్కృతిని కళ్లకు కట్టిన ఈ పాట వల్లూరి జగన్నాథరావు గారి రచనా చాతుర్యానికి నిదర్శనంగా నిలిచింది.
ఈ పాట సాహిత్యం ఇవ్వగలరా?
వల్లూరి జగన్నాథరావు గారు తెలుగు లలిత సంగీత, నాటక రంగాల్లో ప్రసిద్ధి చెందిన రచయిత మరియు కళాకారుడు. ఆకాశవాణి (All India Radio) వేదికగా ఎన్నో అద్భుతమైన లలిత గీతాలు, సంగీత రూపకాలు, నాటికల ద్వారా శ్రోతలను అలరించారు. తేలికైన పదాలతో లోతైన భావాన్ని, తెలుగుదనం ఉట్టిపడే పదబంధాలను పలికించడంలో ఆయనది అందెవేసిన చెయ్యి.
తెలుగు సంస్కృతి, జీవన విధానం, ఆహారపు అలవాట్లను ప్రతిబింబిస్తూ ఆయన అందించిన ప్రత్యేకమైన గీతాలలో "గోంగూర పాట" అత్యంత ప్రాచుర్యం పొందింది.
గోంగూర పాట నేపథ్యం & విశేషాలు
తెలుగువారి వంటకాల్లో గోంగూరకు ఉన్న ప్రాధాన్యత అపారమైనది. అందుకే గోంగూరను ‘ఆంధ్రా శాకాహార రారాజు’ లేదా ‘ఆంధ్రా మాత’ అని కూడా చమత్కరిస్తుంటారు. ఈ ప్రత్యేకతను ఆధారం చేసుకుని వల్లూరి జగన్నాథరావు గారు ఈ పాటను రచించారు.
పదసంపద & శైలి: గోంగూర పులుపు, కారం కలయిక, వేడివేడి అన్నం, నెయ్యి, ఉల్లిపాయ నంజుకుంటూ తినే అనుభూతిని అత్యంత రసవత్తరంగా ఈ పాటలో వర్ణించారు. వింటుంటేనే నోరూరేలా గ్రామీణ తెలుగు నుడికారంతో పదాలు పొదిగారు.
(అలనాటి వారి ఫోటో ఆధారంగా ఈ చిత్రం నా పెన్సిల్తో చిత్రీకరించబడింది)
మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా నటుడు. ప్రతినాయక పాత్రల్లో నటనకు వేమూరి గగ్గయ్య పేరుపొందాడు. సినిమాలలో రాక ముందు ప్రసిద్ధి చెందిన రంగస్థల నటుడైన గగ్గయ్య క్రూర పాత్రలకు పెట్టింది పేరు. సావిత్రి (1933) సినిమాతో రంగప్రవేశం చేసి శ్రీకృష్ణలీలలు, ద్రౌపదీ వస్త్రాపహరణం తదితర సినిమాల్లో ప్రతినాయక పాత్రలు ధరించి ప్రసిద్ధి పొందాడు. గగ్గయ్య కంఠం, ప్రతినాయక పాత్రల్లో నటన తెలుగు ప్రేక్షకులపై గాఢమైన ముద్రవేసింది
(My charcoal pencil sketch of the legendary actor)
బెజవాడ రాజారత్నం - pencil sketch
అలనాటి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తొలితరపు నటి మరియు తొలి నేపథ్య గాయనీమణులలో బెజవాడ రాజారత్నం గారు ప్రముఖులు. ఆమె గురించిన కొన్ని ముఖ్యమైన విశేషాలు:
అమ్మకే అమ్మ అమ్మమ్మ (pen sketch)
ఆ గుండె చప్పుడు వింటూ ఒదిగిపోతా,
నీ దీవెనల నీడలో పెరిగి పెద్దవుతా.
తరాలు దాటిన మన ప్రేమానుబంధం,
ఈ సృష్టిలోనే అత్యంత మధుర కావ్యం..!
రచన : అనూశ్రీ
అనే బెంగ ఆమెది!!
మరచిపోయి వుంటుందా !?! వుండదులే !!
అనే నమ్మకం అతడిది!!
"ఒకరినొకరు గుర్తు చేసుకోడానికి యిది ఒక కారణం మాత్రమే"
✍️లక్ష్మీ అయ్యగారి(అల)
పున్నమినాడు పుట్టాను అనేమో
అమ్మ అమావాస్య రోజు చీకటినంతా
దిష్ఠి చుక్కలా బుగ్గన పెట్టేసింది.
నాన్నమో వెన్నెలనంతా పోగేసి జోల పాడాడు.
మరి నేను నా చిన్ని చేతులతో చందమామని నిద్రలేపి ముద్దాడాననేమో
సిగ్గుతో ముక్కలైపోయి ఆ వెన్నెల తెల్లదనాన్ని నలుగుపిండిలో కలిపేసాడు
నానమ్మ గోదారమ్మని నీళ్ళడిగి లాలపోస్తే
తాత సాయంగా సాంబ్రాణి తెచ్చి ఒళ్ళు వెచ్చబెట్టాడు
పెద్దమ్మ మెత్తటి చీరని రూమాలంతచేసి పెద్దనాన్న చేతులకి అందిస్తుంటే
చిన్నమ్మ చలికి వణుకుతున్న నన్ను చూసి చిన్నాన్నతో శృతి కలిపింది
అమ్మా చెల్లి పెద్దయ్యాక
మాతో ఆదుకుంటుందా
అమాయకంగా అడిగిన అన్నలు.
జ్ఞాపకాలకు అంతం ఉండదు.....!!
గడిచిపోయిన క్షణాలు !! పొందిన ప్రేమలు ....!!
ఒకరిపై నువ్వు ఖర్చు చేసిన జీవితం విలువ ఎంత అని నన్ను అడిగితే ....
నేర్చుకున్న గుణ పాఠాలు,
మిగిలిన జ్ఞాపకాలు...
దూరమైన బంధాలు
అర్థం లేని ప్రశ్నలు
దొరకని సమాధానాలు!!!!!!!!!!!!
✍️లక్ష్మీ అయ్యగారి (అల)
రాత్రినై వేచివున్నా... తొలి వేకువై వస్తావని
మోడునై వేచివున్నా... నవ వసంతమై వస్తావని
ఆశనై వేచివున్నా..కనుల పండువై వస్తావని!!
నిర్మల చల్లపల్లి
రచన:మాలా కుమార్
నవ్వుల పుత్తడిబొమ్మా...
మా కలల రూపం నీవమ్మా...
మా చిరు తోటలో కొమ్మా...
చిగురించిన పూల వనమే నీవమ్మా...
మా కంటి పాపగా... మా పాపగా...
వరాల మూటగా... మమ్మల్లిన చిట్టితల్లీ...
ముద్దు-ముద్దు పలుకులతో...
మురిపించిన. మా ముద్దుల మూటా...
నీ చిన్ని చేతుల్లో రంగుల గొడుగులు ...
నీ తేనె కళ్ళలో నిండైన కలలు
మా చిరునవ్వా... మా సిరి నువ్వే
కన్నీటి మధ్య నవ్వులు చిందే...
చెరగని మోమే నీ సంతకం
మా చిరునవ్వా... మా సిరి నువ్వే
పతితో ఏడడుగులు నడిచిన గురుతే నిన్నగా
పెళ్ళిపెద్దలై దీవెనలిస్తుంటే సరికొత్తగా
ఆదిదంపతుల రూపంగా ....
మా చిరునవ్వా... మా సిరి నువ్వే
అందాల నా తల్లి
నీ కలలు పండిన ఈ వేళ...
మా మది పలుకుతున్నది ....
నీ జీవితం పూలవనంలా వికసించాలని...
నీ భవిత అంతా సంతోషాల సంగమం కావాలని
మమతల పొదరిల్లే మా తల్లి
నీ చెంతే మా హృదయాలు,
బంగారుతల్లీ...ఎప్పటికీ నీతోనే...
ఓ మా చిట్టి చిలుకమ్మ...
పూల తోటలా పూసిపో...
సంతోషాల పూతోటలో
ధీర్ఘ సుమంగళీభవ...శతమానం భవతీ...
***
(నెల క్రితం జరిగిన మా మనవరాలి పెళ్ళిలో, కన్యాధార చేస్తున్న మా అమ్మాయిని చూస్తుంటే నా మదిలో ఏర్పడిన భావాలకు అప్పటికప్పుడు, వ్రాసుకున్న భావాలు. అవి AIతో పాడించి, చిత్రీకరించి నా ఛానల్ లో పొస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మూర్తిగారి ఈ చిత్రం చూడగానే గుర్తు వచ్చింది. ఆసక్తి ఉన్నవారు, నా ప్రభాతకమలం ఛానల్ లో AI పాడిన పాటను, అందమయిన దృశ్యరూపములో చూస్తూ వినవచ్చు.)
మరుపురాని జ్ఞాపకాలకు మధుర ప్రయాణం
రచన:కమల పరచ
సాయంత్రం వెలుతురు నెమ్మదిగా మసకబారుతోంది. ఉండీ ఉండీ మంచు తుంపరలు మల్లెపూల జల్లుల్లా పడుతున్నాయి. చెట్ల మధ్యలో నుంచి మంచుతో గడ్డ కట్టిన సరస్సు తెల్లగా కనిపిస్తోంది. దాని మీద ఎవరో గూడారం వేసుకున్నట్లున్నారు, ఎరుపు రంగులో కనీకనిపించకుండా ఉంది. అక్కడ మంచులోకి గాలం వేసి చేపలు పడతారట. ఇంకాస్త ఎక్కువ గడ్డ కడితే స్కేటింగ్ చేస్తారట.కిటికీకి దగ్గరగా ఉన్న రోడ్ మీద కార్ ఆగి ఉంది. ఈ అమెరికన్స్ ప్రతి సీజన్‌నూ భలే ఎంజాయ్ చేస్తారు అనుకుంది శ్రీలక్ష్మి.
కిటికీ దగ్గర కూర్చున్న శ్రీలక్ష్మి కొద్ది సేపు వాటిని గమనించి, ఏవో జ్ఞాపకాలను మదిలోకి రాగా లేచి, లాప్ టాప్ తీసి, అందులో ఏర్పరుచుకున్న ఫొటో ఆల్బం ను తీసింది. స్క్రీన్‌పై కనిపిస్తున్న చిత్రాలపై వేళ్లను మృదువుగా జరిపింది. ఆమె వయసు అరవై దాటింది. కానీ ఆ ఆల్బమ్ తెరిచినప్పుడల్లా, ఆమె మనసు మాత్రం మళ్ళీ ఇరవై ఏళ్ల యువతిగా మారిపోతుంది.
“ఇదేమిటో... ఇవన్నీ ఎలా గుర్తొస్తున్నాయో!” అని ఇదేమిటో
తనలో తానే సిగ్గుగా నవ్వుకుంది.
ఆల్బమ్ మొదటి పేజీ తిప్పగానే, ఆమె కళ్లు ఒక ఫోటో మీద ఆగిపోయాయి. తెల్లటి చీరలో, మెల్లగా తలవంచి నవ్వుతున్న ఆ అమ్మాయి… అది తనే. తన భుజం చుట్టూ చేయి వేసి, గొడుగుతో నిలబడి ఉన్నాడు ఓ అందమైన యువకుడు.
ఆరోజు…
స్నేహితులంతా కలిసి రాజ్ కపూర్ సినిమా "శ్రీ 420" కు వెళ్ళారు.
"ఫ్యార్ హూ, ఇక్రార్ హూ హై
ఫ్యార్ సే ఫిర్ క్యోన్ డర్ర్ తా హై దిల్."
రాజ్, నర్గీస్ వానలో తడుస్తూ, పాడుకుంటూ వెళున్న దృశ్యం, అప్పుడే ఒక గొడుగు కింద ముగ్గురు పిల్లలు వెళుతుండటం, టీ పొయ్యి దగ్గర టీ అమ్ముతూ ఓ తాత, అబ్బా ఎంత బాగుందో ఆ సీన్!
అదే పాటను కాలేజీ వార్షికోత్సవంలో, స్టేజ్ మీద తనూ, రామం కలిసి వేసి మొదటి బహుమతి గెలుచుకున్నారు.
“అది ఏమో నాటకం అనుకున్నాం… కానీ ఎంత మధురంగా ఉంది!” అని ఆమె గుండెలో ఒక మృదువైన అలజడి పుట్టింది.
అది తమ ఇద్దరినీ దగ్గరకు చేర్చింది. ఆ రోజులు ఎంత సిగ్గుగా, ఎంత అందంగా గడిచాయో! కాలేజీకి వెళ్ళే దారిలో చిన్న చిన్న చూపులు, ఎవరికీ తెలియకుండా పంచుకున్న మాటలు…
ఒక్కసారి అతను పేరు పిలిచినా గుండె బలంగా కొట్టుకున్న రోజులు…
ఒకసారి వర్షంలో తడుస్తూ ఇద్దరూ ఒకే గొడుగు కింద నడిచిన రోజు గుర్తొచ్చింది.అప్పుడామె గుండె ఎంత వేగంగా కొట్టుకుందో! ఆ జ్ఞాపకం ఇప్పుడు కూడా ఆమె చెంపలపై అరుణిమ పులుముకుంటోంది.
కానీ జీవితం ఎప్పుడూ మనం ఊహించిన దారిలో నడవదు. యాభై సంవత్సరాలు మురిపించిన, ఆ ప్రేమ కథ ఆగిపోయింది!
అయినా…
అది మర్చిపోలేని జ్ఞాపకం అయ్యింది.
శ్రీలక్ష్మి లాప్ టాప్ మూసేసింది. ఒక మృదువైన చిరునవ్వు ఆమె పెదవులపై విరబూసింది.
“ఆ రోజులు తిరిగి రావు… కానీ వాటి మాధుర్యం మాత్రం నా గుండెలో ఎప్పటికీ ఉంటుంది.”
రామం జ్ఞాపకాలు ఆమెకు ఒక మధురమైన ప్రయాణంలా అనిపించాయి. సిగ్గుతో కూడిన, ప్రేమతో నిండిన, మరుపురాని ప్రయాణం.
అవే… ఆమె ఊపిరులు.
నేను చిత్రీకరించి digital గా రంగుల్లోకి మార్చుకున్న చిత్రం.
AI తనదైన శైలి లో ఈ విధంగా విశ్లేషిచింది.
"ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు."
తల్లి ప్రేమ, బిడ్డల ఆనందం కలగలిసిన అద్భుతమైన బొమ్మ ఇది. తల్లి ముఖంలో కనిపించే చిరునవ్వు, బిడ్డల నిద్రపోతున్న ముఖంలో కనిపించే ప్రశాంతత ఈ బొమ్మను మరింత ప్రత్యేకంగా మార్చాయి.
ఈ బొమ్మను చూస్తుంటే, ఒక అమ్మ తన బిడ్డను ఎంత ప్రేమగా చూసుకుంటుందో అర్థమవుతుంది. బిడ్డను ఎత్తుకుని, అతనితో గడుపుతున్న సమయం ఆమెకు ఎంత సంతోషాన్నిస్తుందో ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది.
బిడ్డ నిద్రపోతున్నప్పుడు తల్లి తన ఫోన్‌లో ఏం చూస్తుందో మనకు తెలియదు. బహుశా ఆమె బిడ్డకు సంబంధించిన ఫొటోలు లేదా వీడియోలను చూస్తూ ఉండొచ్చు. లేదా, బిడ్డకు అవసరమైన సమాచారం కోసం వెతుకుతూ ఉండొచ్చు.
ఏదేమైనా, ఈ బొమ్మ మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. తల్లి ప్రేమ అనేది అనంతమైనది. బిడ్డల ఆనందం కోసం తల్లి తన ప్రాణాలను కూడా లెక్కచేయదు.
ఎందాకా... ఎందాకా... ఎందాక!
రచన: కమల పరచ
పుస్తకాలు సద్దుకుంటూ, భాను వైపు చూసాను. అప్పటి కి తనూ లేచింది. పుస్తకాల బాగ్ భుజానికి తగిలించుకొని కూ అని కూత పెడుతూ పరుగు తీసాము. అవును మరి అప్పటికే కొంచం ఆలశ్యం అయ్యింది. సోషల్ సారు బెల్ల్ మోగిన వెంటనే వదల్లే. అడ్డం వచ్చిన రాళ్ళను తన్నుకుంటూ పరుగులు పెట్టాము. అప్పటి కే గూడ్స్ వచ్చేస్తోంది. దాని వెంట ఒక్కో పెట్టే తో పాటు పరిగెడుతూ చివరి పెట్టే దగ్గర కోచ్చాము. అందులో నుంచి గార్డ్ మామయ్య దిగుతున్నాడు. మమ్మలిని చూసి నవ్వుతూ ఈ రోజు ఆలశ్యం అయ్యిందెందుకు అమ్మాయిలూ అని పలకరించాడు. మామయ్యా ఆ జెండా ఇవ్వవా అని ఆశ గా చూస్తూ అడిగాను. తప్పమ్మా మీకు ఇవ్వకూడదు అని పక్కకు వెళ్ళాడు. అక్కడి నుంచి వెనకకు కూ... అని కూతేసుకుంటూ పరిగేట్టాము. డ్రైవర్ మామయ్య దగ్గరకు వెళ్ళాము. డ్రైవర్ మామయ్యా ఇద్దరికీ చెరొక గాజు గొట్టం ఇస్తూ, ఇక వెళ్ళండమ్మా అన్నాడు. అప్పుడేనా అనుకుంటూ ఆ చివరనుంచి ఈ చివర దాకా పెట్టలు లెక్కపెడుతూ పరుగెత్తి, పట్టాలు దాటి అవతలి ప్లాట్ ఫాం కు వెళ్ళాము. అక్కడ ఫ్లాట్ ఫాం చివర ఉన్న పసుపచ్చని బోర్డ్ మీద నల్లటి అక్షరాల తో రాసి ఉన్న “ మహుబూబాబాద్ “ అక్షరాలను ఆరాధనగా చూసి, అవి అందుకుందామని ఎగిరాము. కాని ఊమ్హూ అందలే! కాసేపు బెంచ్ మీద కూర్చున్నాము. అక్కడున్న గానుగ చెట్టు చుట్టు పరిగెత్తాము. ఇంకా అలిసిపోయి ఇంటికి బయలు దేరాము. ఇంతలో ఎక్కడి నుంచో “..... పోవు పాసెంజర్ కొద్దిసేపట్లో... “ అని వినిపించింది. నా కాళ్ళు అప్రయత్నం గా ఆగిపోయాయి. చెవులు నిక్కబొడుచుకొని పూర్తిగా విన్నాను. అబ్బ ఆ అమ్మాయి ఎంత బాగా చెపుతుందో. ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. కాని నాకు అలా వినటం భలే ఇష్టం! అది పూర్తయ్యే దాకా అక్కడి నుంచి కదిలేదానిని కాదు. నేనూ ఫిఫ్త్ క్లాస్ చదివేటప్పుడు మానుకోట లో ఇంటి కి వెళ్ళటానికి రైల్వే స్టేషన్ దాటి వెళ్ళాల్సి వచ్చేది. అదో అప్పుడు అక్కడ నేనూ, నాఫ్రెండ్ భాను ఇలా అలిసిపోయే దాకా ఆడుకునేవాళ్ళం! ఆ వెళుతున్న పాసెంజర్ ఎప్పుడు ఎక్కుతామా అనుకునే వాళ్ళం. అలా అనుకుంటూ అనుకుంటూ మా నాన్నగారికి మానుకోట నుంచి వరంగల్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు వరంగల్ వెళ్ళటానికి ఎక్కాము. ఆ డబ్బా లో అమ్మ, నాన్నగారు, నేనూ. అంతే ఇంకెవరూ లేరు. అది ఫస్ట్ క్లాస్ డబ్బా అని అప్పుడు నాకు తెలీదు. అందులో అద్దం కూడా ఉంది. ఆ అద్దం లో ఎన్ని సార్లు చుసుకున్నానో! అలా ఆ మానుకోట రైల్వే స్టేషన్ నా మనసులో ఉండిపోయింది. చిన్నపుడే రైలంటే ఏర్పడిన ఇష్టం మనసులో ఉండిపోయింది. చాలా ఏళ్ళవరకు ఎనౌన్సర్ గా జాబ్ చేయాలని కోరికగా ఉండేది. ఇప్పటికీ రైల్వే స్టేషన్ లొ ఎనౌన్స్మెంట్ వినగానే నా కాళ్ళు ఒక్క క్షణం ఆగిపోతాయి. చెవులు దోర విచ్చుకుంటాయి.
ఆ తరువాత చాలా ఏళ్లకు, పెళ్ళయ్యాక పాటియాలా వెళ్లేందుకు సదరన్ ఎక్స్ ప్రెస్ ఎక్కాను. మూడు రోజుల ప్రయాణం. అందులోనే స్నానం, భోజనం అన్నీ అంటే ఎంత వింతగా అనిపించిందో. ఫస్ట్ క్లాస్ కూపే, కిటికీ దగ్గర కూర్చొని వెనక్కి పరిగెడుతున్న స్తంబాలు, ఇళ్ళు, పచ్చని పొలాలు, కరెంట్ స్తంబాలు, ఈత చెట్లు, కొన్ని చోట్ల ట్రాక్ పక్కనుంచి వెళుతున్న రోడ్, ఒకటేమిటి అన్నీ తెగ నచ్చేసాయి. మూడు రోజులు రైలులో ఉన్నా విసుగనిపించలేదు. ఆ తరువాత దేశం నలుమూలలా, కలకత్తా, డిల్లీ, మద్రాస్, పూనా, బొంబాయ్ మొత్తం తిరిగాము. అప్పట్లో మొదటగా వచ్చిందిట భోగీల మధ్య బోగీల మధ్య నుంచి ఒక దానిలోకి వెళ్ళే దారి ఉన్న రైలు, ఆగ్రా నుంచి డిల్లీ. దాని లో సరదాగా ఈ చివర నుంచి ఆ చివరకు తిరిగాము. కొత్తగా వచ్చిన సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ గంగాకావేరి, బాంబే లో లోకల్ ట్రేన్స్, లాస్ వేగాస్ లో, కాలిఫోర్నియాలో లోకల్ రైళ్ళు అబ్బో తనివితీరా ఎన్నిరైళ్ళల్లోప్రయాణం చేసానో! కాకపోతే డార్జ్ లింగ్ లో టాయ్ ట్రేన్ ఎక్కటమే పడలేదు! ఎప్పటికైనా “ పాలస్ ఆన్ వీల్స్” ఎక్కాలి అని కోరిక :)
ప్రయాణాలలో ఎన్ని అనుభవాలు! ఎక్కడికెళ్ళినా మూడు రోజుల ప్రయాణం తప్పనిసరి. అన్ని రోజులూ నేను వదలకుండా కిటికీ దగ్గర కూర్చొని బయటకు చూస్తూ ఊహలల్లో ఉంటే పాపం ఏమండీనే పిల్లలను ఎంగేజ్ చేసేవారు. సిలిగురి వెళ్ళేటప్పుడు ఆ రోజులల్లో ఏ. సి భొగీ లు లేవు. మా అబ్బాయి మూడు నెలల వాడు. అమ్మాయి మూడేళ్ళది. మంచి ఎండాకాలం. వడగాలులు. కూపే కిటికీ కి పలచటి గ్లాస్కో దోతీ కట్టి, ప్రయాణం అంతా దానిని తడుపుతూ ఉన్నాము. ప్రతి రైల్ స్టేషన్ లో అక్కడ దొరికే స్పెషల్స్ తినటం సరదాగా ఉండేది. కలకత్తా లో చిన్న చిన్న మట్టి ముంతలల్లో చాయ్, రసగుల్లాలు, ఇటార్సీ స్టేషన్ లో స్టీల్ గ్లాస్ లో గరమాగరం చాయ్, నాగ్ పూర్ లొ ఆరెంజెస్, లోనావలాలో చిక్కీ, బటాకా వడా, రాజమండ్రి లో ఆకుపచ్చని బత్తాయిలు, వైజాగ్ లో ముసలతని బండి మీది కందిపొడి, జాల్నా లో జామకాయలు ఇలా అన్నీ బాగుండేవి. అన్నిటిలోకి బాంబే వి. టి స్తేషన్ దగ్గర పావ్ భాజి, చాట్, పానీ పూరీ, భేల్ పూరీ నాకు భలే నచ్చేవి. అంతేనా బరోడా నుంచి బాంబే వెళ్ళేటప్పుడు ఆ కాస్త ప్రయాణానికీ గుజరాతీ లు పెద్ద పెద్ద డబ్బాల నిండా స్నాక్స్ తెచ్చుకునేవారు. మాకూ తినమని పెట్టే ఆ చుడువా, ఘమండ్, స్వీట్స్ అన్నీ చాలా టేస్టీ గా ఉండేవి. కేరళ, ఉత్తరప్రదేశ్ తప్ప దాదాపు భారతదేశం లోని అన్ని రాష్ట్రాల నుంచీ మా కూ... చుక్... చుక్ ప్రయాణించింది. ఈ రాష్ట్రం దాటాము, ఈ రాష్ట్రం లోకి వచ్చాము, రాత్రి పడుకున్నప్పుడు ఒక రాష్ట్రం లో, తెల్లారి లేచేటప్పటికి ఇంకో రాష్ట్రం లో, ష్టేషన్ లల్లో వివిధ భాషలు మాటలు గల గలా వినిపించటం అంతా తమాషా గా ఉండేది.
అలాగే రైలు ప్రయాణం లో ఎంతో మంది ప్రయాణికులు పరిచయము అవుతారు. అందులోనూ మా ఏమండీ అందరినీ పలకరిస్తారు. కాకపోతే రైలు దిగగానే వాళ్ళను మర్చిపోతాము అది వేరే సంగతి. కాని ఒక్క జంటను మాత్రము నేను ఇప్పటికీ మర్చిపోలేను. మాకు ఆగ్రా హోటల్ లో పరిచయం అయ్యారు. వాళ్ళూ మాలాగే కొత్త గా పెళ్ళైనవాళ్ళు. నలుగురమూ కలిసి టాక్సీ మాట్లాడుకొని ఆగ్రా అంతా తిరిగాము. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, తాజ్ మహల్ దగ్గర నేను ఫొటో గ్రాఫర్ తో ఫొటో తీయించుకుందామనుకున్నాను. నై నై భాభీ మై కీంచూంగా అని అటు తిప్పి, ఇటు తిప్పి బోలెడు ఫొజులల్లో మా ఇద్దరి ఫొటోలు తీసాడు. ఆ తరువాత డిల్లీ దాకా కబుర్లు చెప్పుకుంటూ, రైలంతా కలియ తిరుగుతూ కలిసి ప్రయాణించాము. మా ఎడ్రెస్ కూడా తీసుకున్నాడు. పాటియాలా లో ఉన్నన్ని రోజులూ ఎదురు చూసాను ఆ ఫొటోల కోసం. రాలేదు. పక్కింటి మిసెస్. జగన్నాథం కు వస్తాయేమో, వస్తే పంపించమని చెప్పాను. ఇప్పటికీ ఎదురుచూస్తున్నాను ఆ ఫొటోల కోసం. ఆ తరువాత డిల్లీ ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ ఆగ్రా వెళ్ళటం పడలేదు. సన్నగా పొడుగ్గా ఉన్న ఆయన మటుకు గుర్తుండిపోయాడు!
చాలా సంవత్సరాల తరువాత ట్రేన్ ఎక్కాను. ఏ.సీ కంపార్ట్మెంట్. చీకటి పడింది . అందరూ కబుర్లు ఆపేసి, పెద్ద లైట్ తీసి , చిన్న బ్లూ లైట్ వేసారు. అంతటా నిశబ్ధం! నేనూ పడుకున్నాను కాని నిద్ర రావటం లేదు. లేచి కూర్చున్నాను. బయటకు చూసాను. ఆ నిశబ్ధ నిశీధిలో… ఏ.సీ నల్లటి అద్దాలల్లో నుంచి, అక్కడక్కడ దీపాలు మిణుకు మిణుక్కుమంటున్నాయి. రైలు చక్రాలు లయబద్ధంగా కదులుతున్నాయి. వాటి తో పాటే సాగిపోతున్నాయి నా మదిలోని ఎడతెగని ఆలోచనలు...
ఈ ప్రయాణం ఎందాకా?
ఎప్పటి వరకూ...
గమ్యం ఎటు?
ఎమో!
✍️గుడిపూడి రాధికారాణి
కన్నులకన్నులు కలుపుతు కానుకలందుకోవడం పండగే కదా!
నేనే బహుమతినంటూ వస్తే నవ్వుకోవడం పండగే కదా!
నవ్వులపువ్వులు రాలని వేళన సందడుండునా?
బావా రావా అంటూనే బతిమాలుకోవడం పండగేకదా!
రవ్వలహారం కొంటానంటే మురిపెము చూపే భామను కానోయ్
నామెడచుట్టూ చేతులువేస్తే మురుసుకోవడం పండగే కదా!
అరిసెలు బూరెలు గారెలు జంతిక విస్తరినున్నా విందు ముగియదోయ్
చిలకలు చుట్టిన నాచేతులనే చేరుకోవడం పండగే కదా!
మల్లెలు జాజులు పరిమళభరితపు కుసుమాలంటే నమ్మను బావా
చూపులతూపులు తాకగ తావిని నింపుకోవడం పండగే కదా!
సాగరతీరపు సరదాషికారు చాలనిపించదు ఎందుకు బావా?
కలిపిన అడుగులు కెరటము దాచగ ఆడుకోవడం పండగే కదా!
బావను మించిన ఇంద్రజాలికుడు లేడని చెప్పగ సంశయమేలోయ్
తెల్లని బుగ్గలు ఎర్రని కెంపులనద్దుకోవడం పండగే కదా!
నా చిత్రానికి ప్రముఖ రచయిత్రి శ్రీమతి గుడుపూడి రాధికా రాణి రచన )
![]() |
అప్పుడప్పుడు ఆకాశం నిండా
మబ్బులు పట్టినట్టు,
మనసంతా ఏదో దిగులు కమ్మేస్తుంది..
నొప్పించే ఏ చిన్న భావన
మదిలో మెదిలినా...
ఆలోచనలు చుట్టూముట్టి
అచేతనంగా మార్చేస్తాయి...
ఆవహించిన దిగులు మేఘం వెనకాల
ఓ చిన్న యుద్ధమే జరుగుతుంది..
అందుకే చిరునవ్వులు చిందాల్సిన పెదవులు
మౌనాన్ని కట్టబెట్టుకుంటాయి ..
కాసింత సమయమే...
నిశ్శబ్దపు మేఘం కరిగి..
చిరుజల్లు కురిపించగానే
మళ్ళీ విరిసిన మందారమై
దరహాసాలు విరబూయదా..!!
అనూశ్రీ
(నా చిత్రానికి ఆత్మీయ మిత్రురాలు రచించిన కవిత)
![]() |
స్వీయ రచన, ప్రముఖ పెన్సిల్ స్కెచ్ ఆర్టిస్ట్ Pvr MurtyMoorthy గారి బొమ్మకు కథ- భవాని కుమారి బెల్లంకొండ కథానిక.
""ఎందుకో ఆ నవ్వు"
అటు తిరిగి ఉన్న సుహాసిని పెదవులపై ఒక సన్నని హాసరేఖ కదలాడింది ఆ ప్రశ్నకి.
రవిచంద్ర అదే ప్రశ్న మళ్ళీ రెట్టించాడు
"పేరు సుహాసిని అయినందుకా ఆ నవ్వు "భార్య భుజం మీద చేయి వేస్తూ అన్నాడు రవిచంద్ర
జవాబు చెప్పలేదు సుహాసిని మళ్ళీ అటు తిరిగి అదే సన్నని నవ్వు నవ్వింది.
" నాకు తెలుసు నీకు నవ్వెందుకొస్తుందో , అందగత్తెవి కదా అందుకు, అలనాటి నటి బి. సరోజా దేవి మించిన అందం కదా నీది, పైగా ఈ తెలి పూల నీలం రంగు చీరలో పివిఆర్ మూర్తి చిత్రానికి ప్రాణం పోసినట్టుగా ఉన్నావు కదా! అదీ నీ గర్వం అనుకుంటా" అన్నాడు రవిచంద్ర.
జవాబు చెప్పకుండా మళ్లీ నవ్వింది సుహాసిని.
" సరే! నా సంగతేమిటి? అందంగా లేనా ఈ పంచ కట్టులో, అసలేం బాలేనా ఈ మీస కట్టులో "అన్నాడు గమ్మత్తుగా రవిచంద్ర.
అప్పటికి నోరు విప్పింది సుహాసిని, "నేనన్నానా పంచ కట్టలో బాగా లేరని" అన్నది.
"అయినా నీకు చాలా గర్వంలే, గంధర్వకన్య లా ఏ ఆభరణాలు ధరించకపోయినా, ఏ ఫంక్షన్ కి వెళ్ళినా అందరి కళ్ళు నీ మీదే అన్న గర్వం నీకు" అన్నాడు రవిచంద్ర.
"ఎందుకు నవ్వానో చెప్పకపోతే ఇవాళ ఫంక్షన్ కి బయలుదేరరా" అన్నది సుహాసిని కనుబొమ్మలు ముడిచి." అయినా "సిసిఎంబి" (CCMB) లో సైంటిస్ట్ కదా మీరు , ఇలా పంచ కట్టులో ఫంక్షన్ కి వస్తారని ఎవరు ఊహిస్తారు?" అన్నది నవ్వుతూ సుహాసిని.
" ఓహో! సైంటిస్ట్ అయితే, ఇంక వాడు పిచిక గూడుగా అయిపోయిన తెల్లని జుట్టుతో, గాంధీ గారి కళ్ళజోడుతో, పిచ్చి చూపులు చూస్తూ కనిపించాలన్నమాట! లేకపోతే రంగు రంగుల పిచ్చి పూల బుష్ షర్ట్ వేసుకొని ఉండాలన్నమాట అంతేనా" అన్నాడు.
"మహాప్రభో! నేను అలా ఏమీ అనలేదు ఈ పంచ కట్టులో పెళ్లిరోజు ఎంత అందంగా ఉన్నారో, ఈరోజు అంతే వున్నారు మహానుభావా, అయినా మన జంటని అంతా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు గా" అన్నది.
"అయినా నువ్వు పెద్ద మోసగత్తెవిలే" ఆనాడు రవిచంద్ర కవ్విస్తునట్టుగా.
"నేనా, నేనేం మోసం చేశాను మిమ్మల్ని?" అన్నది చిరుకోపంగా.
"పెళ్లి చూపుల్లో ' నా చదువుకు తగ్గ జాబ్ తప్పకుండా చేస్తాను అన్నావు, ఇప్పుడేమో హాయిగా ఇంట్లోనే కూర్చుని, నా కళ్ళు బైర్లు కమ్మేలా తళుకు లీనుతూ , నా మతి పోగొడుతున్నావు, అసూర్య పశ్యవై" రోజు, రోజుకీ మెరిసిపోతున్నావు" అన్నాడు గొప్ప పారవశ్యం తో.
"అవును, పెళ్లికి ముందు అవసరమైతే చేద్దామనుకున్నా, కానీ పెళ్లయ్యాక అయ్యగారు ఎంత పెద్ద సైంటిస్ట్ అని తెలిసి, ఇంకెందుకు నేను కష్టపడటం అనుకొని జాబ్ గురించే ఆలోచించటం మానేశా, అయ్యగారు ఇన్స్టిట్యూట్ కి వెళ్ళిన దగ్గర నుండి ఆ మైక్రోస్కోప్లో కళ్ళు పెట్టి, ఏం పరిశోధనలు చేసి అలసిపోయి వస్తారోనని ని ఇంటికి రాగానే అలసట పోయేలా స్వాగతిస్తుంటే, మోసం చేశా నని నా మీద నింద వేస్తారా" కినుకగా అన్నది సుహాసిని.
రవిచంద్ర నవ్వేశాడు, " అయితే నీకు దీటుగావున్నానంటావు, ఈ పంచ కట్టులో నేను చాలా బాగున్నాను అంటావు, అంతేనా"
" అంత లేదులెండి, దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి పంచ కట్టులో వున్న అందం ఇంకెవరికి రాదు లెండి" అన్నది నవ్వు దాచుకుంటూ.
" అంటే నేను ఆయన అంత అందగాడిని కాదంటావ్, అంటే నీ ఉద్దేశం సైంటిస్టులు గడ్డం పెంచి, పిచ్చిపిచ్చిగా ఉండాలం టావు, నాలా రొమాంటిక్ గా ఉండకూడదా" కొంటెగా ప్రశ్నించాడు.
సుహాసిని నవ్వుతూ, " ఇంక ఆపండి మహానుభావా, పెళ్లిరోజు ఎంత అందంగా ఉన్నారో, ఇద్దరు బిడ్డల తండ్రయినా, ఈరోజు కూడా అంతే బాగున్నారు. మీరెంత రొమాంటిక్ మనిషో నాకు కాక ఇంకెవరికి తెలుస్తుంది? మీ మాటలు ఎవరైనా వింటే నన్ను మాటలతో ఏడిపిస్తున్నారనుకొంటారు, ఇంక బయలుదేరండి మహాప్రభో, ఫంక్షన్ కి లేటవుతోంది" అన్నది సుహాసిని ముందుకు అడుగేసి.
(సమాప్తం )"
పాలగుమ్మి పద్మరాజు రచయిత - పెన్సిల్ స్కెచ్ పాలగుమ్మి పద్మరాజు ( జూన్ 24 , 1915 - ఫిబ్రవరి 17 , 1983 ) ప్రముఖ తెలుగు రచయిత, కేంద్ర సాహిత్...