5, ఫిబ్రవరి 2016, శుక్రవారం

అమ్మ - కొడుకు -


నేను వేసిన బొమ్మకి శ్రీమతి శశికళ ఓలేటి గారి చక్కని పద్యాలు. ఆమెకు నా ధన్యవాదాలు

అమ్మ-కొడుకు
1. చక్రవర్తి యయిన జన్మించు నమ్మకే, పాలు బోసి పెంచు పాప వోలె. పేగు పంచినమ్మ ప్రేమాధి దేవతౌ, ఆత్మ బంధమదియె యవని యందు.
2. ఆకలేసి బిడ్డ కేక లేయుచు రాగ, అలసినట్టి బిడ్డ యలక దీర్చ, ఆలసించకుండ నాఘమేఘాలపై కన్నకడుపు కుడుపు వెన్న బువ్వ.
3.బాల కృష్ణుడనుచు బాగ గారము జేసి, తల్లి గోపికమ్మ తనివి దీర, మంద్ర స్వరము ననె “ సుందరాంగదె రార! వెండి పళ్ళెరమున వెన్న యిదిగొ”!
4. జనని పుత్రుల ముడి జన్మజన్మల జాడ.
గుడియె కాద తల్లి గుండె మనగ!
తల్లి గుండె జీల్చ తనయు బొమ్మయె గాంచు,
తనయుడేగ యమ్మ తనువు , మనసు.
****&*********************** 5. తన కన్న తండ్రె తన కడుపున బుట్టి, కావ వచ్చెననుచు గాంచి మురియు. తల్లడిల్లి పోవు తల్లి మనసు, కన్న కొడుకు కొఱకు నెపుడు కడుపు తీపి.
*******************-******* 6. అమ్మ! కొడుకు చేయి నమ్ముకొను నెపుడు, తూలనాడ బోకు తూలు వేళ. ప్రాణమయిన నీవు ఫణము పెట్టుచు తల్లి, ఋణము దీర్చు మిదియె రుధిర సాక్షి.
************************** 7. అమ్మ ప్రేమ కొరకు నాది విష్ణుయె తాను, అయిదు జన్మ లెత్తి,.అమృత మరసె. అమ్మచెంత నండ గలుసేలరా నీకు? అలవనీయ వలదు అమ్మ మనసు.

కామెంట్‌లు లేవు:

కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! - తెలుగు గజల్

 ॥తాజా గజల్॥  నా pencil చిత్రానికి Dr. ఉమాదేవి గారి గజల్ ~~~~🔹🔸🔹~~~~ కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! పోరాట మేలేని జీవితం కోసమై అన...