28, ఫిబ్రవరి 2016, ఆదివారం

రవీంద్ర జైన్ - నివాళి - పెన్సిల్ చిత్రం.




A blind man goes to a doctor.
Doctor says, “ Wait, I am busy!”.
The blind man says, “ Oh, I SEE”.

మామూలుగా అయితే ఇదొక్ జోక్ గా కొట్టి పారెయొచ్చు. పుట్టిన దగ్గరనుండి కళ్ళె తెరవని  అద్భుత సంగీత దర్శకుడు, గేయ రచయిత దర్శకుడు విషయంలో మాత్రం ఇది అక్షరాలా నిజం. అంధుడయినా అద్భుత గీతాలు వ్రాశాడు. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఊహించుకుంటూ చక్కని బాణీలు సమకూర్చాడు.


'చిత్ చోర్' చిత్రంలో ప్రకృతి ని  వర్ణిస్తూ కథా నాయకుడు పాడే ‘గొరి తెరా గావ్ బడా ప్యారా” పాటని అంధుడైన రవీంద్ర జైన్ రాశాడంటే నమ్మలేం! అంతే కాదు, సంజ చీకట్లలో ముంగిట్లో వెలిగే దీపానికి కవిత్వాన్ని అద్ది, “జబ్ దీప్ జలే ఆనా” పాటని సృజించాడు రవీంద్ర జైన్. మిగతా సంగీత దర్శకులెంత గొప్ప పాటలకు బాణీలు కట్టినా,శ్రోతల మనసు పొరల్లోని జ్ఞాపకాలను తడిమే ఒక ‘లైఫ్ ‘ రవీంద్ర జైన్ సంగీతంలో ఉంటుందని ఈ సినిమాలోని పాటలు రుజువు చేస్తాయి., హిందీ చిత్ర రంగానికి జేసుదాస్ ని పరిచయం చేసిన విజయగీతాలు కూడా! 


అమితాబ్, నూతన్ నటించిన 'సౌదాగర్', రాజ్ కపూర్ నిర్మించిన 'రామ్ తెరీ గంగా మైలీ', 'దుల్హన్ వహీ జో పియా మన్ భాయె', రామానంద్ సాగర్ నిర్మించిన సూపర్ హిట్ సీరియల్ 'రామాయణ్' వంటి ఎన్నిటికో సంగీత దర్శ్కత్వం వహించిన రవీంద్ర జైన్ చిరస్మరణీయుడు. ఆ మహా సంగీత దర్శకుని జయంతి సందర్భంగా నా పెన్సిల్ చిత్రం ద్వారా ఘన నివాళి అర్పిస్తున్నాను.

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...