29, ఫిబ్రవరి 2016, సోమవారం

భరతనాట్య ప్రవీణ రుక్మిణీదేవి అరుండేల్ - నివాళి - పెన్సిల్ చిత్రం


భరతనాట్య ప్రవీణ రుక్మిణీదేవి అరుండేల్ - నా పెన్సిల్ చిత్రం. ఈమ్ గురించి ఈనాటి వార్త దినపత్రికలో వచ్చిన వార్త చదవండి. వికీపీడియా లో ఈమె గురించి ఏమి వ్రాశారో టూకీగా తెలుసుకుందాం.
రుక్మిణీదేవి అరండేల్ (ఫిబ్రవరి 291904 - ఫిబ్రవరి 241986) (Rukmini Devi Arundale) తమిళనాడులోని చెన్నైలో కళాక్షేత్ర నాట్యపాఠశాల వ్యవస్థాపకురాలు. ఆమె స్వయంగా నృత్య కళాకారిణి. కళలయందు ఆమెకున్న మక్కువ ఆమెను కర్ణాటక సంగీతం, బాలే, భరతనాట్యాలలో ప్రావీణ్యం సంపాదించేలా చేశాయి. ఆమె భరత నాట్యం శిక్షణ కొరకు పాఠశాల స్థాపించి భరతనాట్యం ప్రాచుర్యము, గౌరవము ఇనుమడింప చేసింది. ఆమె ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ ప్రయత్నాన్ని విజయ వంతం చేసింది.

ఈమె 1904వ సంవత్సరం, ఫిబ్రవరి 29వ తారీఖున నీలకంఠశాస్త్రి, శేషమ్మ దంపతులకు తమిళనాడులో ఉన్న మదురైలో జన్మించింది. కళలయందు కల ఆసక్తి వలన పెద్దలు నిర్ణయించిన బాల్య వివాహాన్ని చేసుకోవడానికి నిరాకరించింది. ఆతరువాత కర్ణాటక సంగీతాన్ని అభ్యసించడం ఆరంభించింది. తన ఏడవ సంవత్సరంలో తండ్రి పని చేసే దివ్యజ్ఞాన సమాజం (థియాసాఫికల్ సొసైటీ}లో చేరింది.
రుక్మిణీదేవి తన మొదటి నాట్య ప్రదర్శనని, థియాసాఫికల్ సొసైటి వజ్రోత్సవాలలో ఇరవై వేల మంది ప్రేక్షకుల ఎదుట చేసి పలువురి ప్రశంశలు అందుకుంది. రామసామి అయ్యర్, శివసామి అయ్యర్ మొదలైన ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ ప్రదర్శన జేమ్స్ కజిన్స్ అనే ఇర్లాండ్ కవిని ఆకర్షించింది.

1952 ఏప్రిల్‌లో రుక్మిణీదేవి రాజ్యసభ సభ్యురాలిగా నియమితురాలైంది. ఈమె రెండు పర్యాయములు రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసింది. జంతు సంక్షేమం కోసం పాటుపడిన రుక్మిణీదేవి రాజ్యసభలో ఉన్న సమయంలో జంతువులపై కౄరత్వ నిరోధ బిల్లు (1960) తీసుకురావటంలోను, జంతు సంక్షేమ బోర్డు స్థాపనలోనూ గణనీయమైన పాత్ర పోషించింది. రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెడుతూ ఈమె చేసిన ప్రసంగం సభను కదిలించింది. ఆ ప్రసంగం విని చలించిన అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, ఆమె అభిప్రాయాలతో ఏకీభవించి, 'ఈ విషయమై ప్రభుత్వమే ఒక పరిపూర్ణ చట్టం చేస్తుందని హామీ ఇచ్చి, ఆమె ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కి తీసుకోమ'ని కోరాడు. రుక్మిణీదేవి తీసుకున్న ఈ చొరవే, ఆ తరువాత ప్రభుత్వం నిరోధ చట్టం చేయటానికి దారితీసింది. రుక్మిణీదేవి జంతు సంక్షేమం కొరకై అనేక జీవకారుణ్య మరియు మానవతావాద సంస్థలతో పనిచేసినది.

రుక్మిణీదేవి సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం "పద్మభూషణ్" తోను, శాంతినికేతన్ "దేశికోత్తమ" బిరుదుతోను ఆమెను సత్కరించాయి. భరతనాట్యానికి గుర్తింపు, గౌరవాన్ని కలిగించి, దానిలోని దైవీక తత్వాన్ని ప్రపంచానికి చాటిన ఘనతలో రుక్మిణీదేవి అరండేల్ కు ప్రధాన పాత్ర ఉంది. కళాక్షేత్ర విద్యార్ధులు అనేకమంది నేడు వివిధ రంగాలలో ప్రకాశిస్తున్నారు.

1977లో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నపుడు, రుక్మిణీదేవిని భారత రాష్ట్రపతి అభ్యర్ధిత్వానికి పరిశీలించాడు. అయితే ఆ ప్రతిపాదనను ఆమె తిరస్కరించడంతో అది ముందుకు సాగలేదు.

ఫిబ్రవరి 24, 1986 లో మరణించింది.

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...