16, ఫిబ్రవరి 2016, మంగళవారం

" పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు. అల్లన మోవికి తాకితే గేయాలు"


facebook లో భావుక గ్రూపు లో యశోదా కైలాస్ గారి టపా నాకు నచ్చి ఈ బ్లాగులో ప్రచురించికున్నాను.  వారికి నా ధన్యవాదాలు.
" పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు. అల్లన మోవికి తాకితే గేయాలు"
ఎంత నిగూఢ అర్ధం దాగి ఉంది పై మాటలలో అనిపిస్తుంది. నిజమే కదూ!
ప్రతిమనిషీ ఈ భూమి మీదకు వచ్చేటప్పుడు ఏమి తెలియకుండానే వస్తాడు. వచ్చి - ఏదేదో చేస్తాడు. తన స్వార్థం తను చూసుకుని వెళ్ళిపోయేవాడు కర్రలాంటి వాడు. దానికి ప్రాణం ఉన్నంతకాలం చెట్టుతో ఊగుతుంది. ఏదో అనుభవిస్తున్నాను అనుకుంటుంది. దాని కాలం అయిపోయిన తరువాత తగలేస్తారు. తన గాయాలను లెక్క చెయ్యకుండా తనవారికి మంచి చేసేవాడు వేణువు లాంటి వాడు. "పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు. అల్లన మోవికి తాకితే గేయాలు", అన్నట్టు అమ్మ కూడా వేణువులాంటిదే...మనసులో ఎన్ని గాయాలున్నా తన పిల్లలకోసం ఇంకా పోరాడి, పోరాడి...బాధ్యతలని నెరవేర్చి ఆ గానాలు వారికి విడిచిపెట్టి గాలిగా మారిపోతోంది. వేణువు ఆలాపించేవాడు వెళ్ళిపోయినా, వేణువు వెళ్ళిపోయినా, ఆ వెదురు పాటలు మాత్రం మనసుని విడిచిపోవు. ఎంత విచిత్రం!

కామెంట్‌లు లేవు:

కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! - తెలుగు గజల్

 ॥తాజా గజల్॥  నా pencil చిత్రానికి Dr. ఉమాదేవి గారి గజల్ ~~~~🔹🔸🔹~~~~ కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! పోరాట మేలేని జీవితం కోసమై అన...