4, ఫిబ్రవరి 2016, గురువారం

వన మహోత్సవం


facebook లో శ్రీమతి శశికళ ఓలేటి గారి నవ కవితా ఝరి నుండి - వారికి నా ధన్యవాదాలు

"వనము మడిసెనేని మనగ లేము"……నా పద్యాలు. వన మహోత్సవం
కందం. 1. వనములె నాందిగ బ్రతుకుకు,
వనమునె యమరెను మనిషికి వనరులు యన్నిన్.
వనమునె సమకూడెను, జీ
వన వసతులు, నల ఋషి,ముని వ్యాసాంగములున్.
……………………………………………………
కం2. వనమున తులనతొ మెలగును,
వనచర మృగములు, పులుగులు, వానర., నరులున్.,
పెను తరువులు, కుంజ,లతలు,
అనుబంధము యినుమడింప నన్యోన్యముగన్.
……………………………………………………
కం3. జనసాంద్రత హెచ్చవగను,
జనపదములు నగరమాయె సమయము గడువన్.
వనములు, నరుకుచు పోడుకు,
వనస్పతికి, మృగ పు వేట పాల్జేసె గదా!
……………………………………………………
కం4. జలదముల నాపు యడవులు,
నెలవుల పాలవ, గవృష్టి యిల తిష్టయ్యెన్.
ప్రళయముగను వృష్టించిన ,
నిలుపంగ వనములు లేక నీరు వరదయెన్.
……………………………………………………
కం5. ఆవాసాహారములను,
జీవాలదె కోలుపోయె జీవఛ్ఛవమౌన్,
జీవజవముడిగి బీడుగ,
ఆ వని , యెడారి బోలు యాకృతి దాల్చెన్.
……………………………………………………
కం6 .పెంచుము వనములు నయమున,
త్రుంచుము స్వార్ధము, ప్రకృతిని దునుమాడకుమా!
వంచించక వనచరముల,
సంచాలనము నొనగూర్చు, సంపద పెరగన్
……………………………………………………
7. సీసము.
కానల కాపాడగ యవి గాచును నిన్ను,
కుడుపుచు నిచ్చును గూడు, గుడ్డ.
ప్రాణవాయువు నిచ్చుపట్టు తేనియ లిచ్చు.
ఔషధముల నిచ్చు నరకు లిచ్చు.
కలపనిచ్చును మంచి కస్తూరి, గంధము,
కాగితము, వెదురు గడల నిచ్చు.
వానలు కురిపించు, వరద కట్టడి జేయు,
వన్యజీవుల కెల్ల వాసమిచ్చు.
తే.గీ
సతత హరితమై వనములు సస్యమొసగు,
తపసి కదియె వానప్రస్థ ధామమగును.
వనమహోత్సవ వజ్ర సంకల్పమొప్ప
ప్రకృతి ప్రభవించు పూర్ణత్వ ప్రభల గూడి
……………………………………………………
శశికళ ఓలేటి
3-2.2016.

కామెంట్‌లు లేవు:

కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! - తెలుగు గజల్

 ॥తాజా గజల్॥  నా pencil చిత్రానికి Dr. ఉమాదేవి గారి గజల్ ~~~~🔹🔸🔹~~~~ కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! పోరాట మేలేని జీవితం కోసమై అన...