ఆ.వె 1. తమిళ దేశమందు తరుణులు ధరియింత్రు,
తలను మల్లె పూలు తప్పకుండ.
సంప్రదాయ రీతి చనుదురదె గుడికి
పట్టు చీర గట్టి పెట్టి విరులు.
………………………………………
కం.2. సార్ధక మాయెగ మల్లెలు
మార్ధవమగు మగువల జడ మరులొలకంగన్
స్వార్ధమె లేనివిగ విరులు
హార్ధిక పరిమళము లిచ్చి హాయిని గూర్చన్.
………………………………………
3.పూలు ముడవ నదియె పోగాల మొచ్చెనే!
పొట్టి జడల యందు పూలు కరువె!
లక్షణముగ నతివ లదిగొ పూలు ముడిచి,
వెడలు చుండె గుడికి విరియ భక్తి.
1 కామెంట్:
తల బిరుసోయను కొంటిని
"కొలవెరి" లాడుచు జిలేబి కొప్పును జూడన్
వెల సరసమాయె మల్లియ !
తల మ ల్లియగనె సొగసుగను తరుణిని జూడన్
జిలేబి
కామెంట్ను పోస్ట్ చేయండి