27, ఫిబ్రవరి 2016, శనివారం

కేశ పోషణ - జడ సౌందర్యం - పెన్సిల్ చిత్రం


శ్రీమతి శశికళ ఓలేటి పద్యాలు – జడ అల్లుతున్న బొమ్మకి. - వారికి నా ధన్యవాదాలు
కంఏమయ్యెనా మురిపములు?
ఏమాయ ముసిరె? మగువల యెడమల బెంచన్!
ఏమూల గనిన స్వార్ధమె
ఏమార్చి, వంచించు బుద్ది యేమది మదులన్.!!
……………………………………
తల్లి-కొమరితల బంధము
వల్లరిగ మరి హృది మీటు పాటగ నరయన్
పల్లవిగ సుదతి గమనము
విల్లివిరిసెడి దదె గాద వెలుగులు జిందన్.
……………………………………………
వదిన మరదళ్ళదె గనగ
సుదితముగ స్నేహ పూర్ణ సోదరి భంగిన్
పదియింతలు నాప్యాయత 
చెదరక చూపించి పెంచె చెలిమిని కూర్మిన్.
……………………………………………
అక్కలు చెల్లెలు జూడగ
మక్కువ ననురాగ మంది మసలుచు నదిగో
ఇక్కట్ల సమయమొచ్చిన
పెక్కుగ సహకారమిచ్చి బెంచెన్ బ్రేమన్.
……………………………………………
కలిసి మెలిసి మసులు కునుచు
కలిమిగ, వెలుగుచు, కలకల కన్నుల పంటై
విలసిల్లగ స్నేహ సిరులు
చెలుములు మీరగ చెలియలు చెరగుచు బంచెన్.
……………………………………………
ఆనాటి చిత్ర మది నిల
నీనాడదె కానరాదు నిముసంబైనా.
తేనెలు పూసిన కత్తులు.
జాణలదె ! నిలుపరు భాళి,చలువపు స్నేహం.
……………………………………………
మారుము మగువా! నువ్విక
మరువకు కలిమియె బలమని మనగను మహిలోన్.
చెరపకు, విరువకు మనసులు
అరుదగు మనుషులు కరువగు అలమట పడగన్.

కలుపుకు పో యందరినీ
పలుకుచు మృదువుగ ప్రియంబు జల్లుచు మైత్రిన్
కులకక, సాగుము బ్రీతితొ
చిలుకల గుంపుగ నలరుచు చెలియల తోడన్.

కామెంట్‌లు లేవు:

The power of 'Will' Usage - English grammar - illustration

  When we use will to make a promise 🤝 or an offer 💡, we are usually deciding to do something at the very moment we are speaking. It shows...