3, ఫిబ్రవరి 2016, బుధవారం

సిలక మా ఎంకి



నండూరి వారి 'ఎంకి' ఈ తరం కవులకు, చిత్రకారులకు కూడా ఎదోవిధంగా ప్రేరణ ఇస్తూనే ఉంది. ఆ ప్రేరణ తో బొమ్మకి  తగ్గ కవిత రాసిన డా. కృష్ణ సుబ్బారావు పొన్నాడ గారికి ధన్యవాదాలు. (Courtesy : Facebook)
"సిలక మా ఎంకి " "...............................డా .కృష్ణ సుబ్బారావు పొన్నాడ .

ఎనక మాటూ నొచ్చి 
యెగిరి కళ్ళని మూసి ,
ఎద ఈపు కదిమేసి ,
ఎవరు నేనం టేను ?

గుండె గురుతడతాది 
తడబాటు లేకుండ !
గుండె గురుతడతాది 
నిండు పున్నమి తావి !

కటిక సీకటి కాని , 
కళ్ళగపడక పోనీ ,
గుండె గురుతడ తాది ,
తడబాటు లేకుండ !
గుండె గురుతడతాది 
తన సొంత పేనాన్ని !

ఎన్నలమ్మకు పోటీ ,
ఎవరు , సెప్పంటేను ?
గుండె గొంతుగ మారి ,
మనసు మాటై పోయి ,
మనసు మాటై పోయి ,
మాట పాటగ జారి ,
ఎనలేని పరువమూ ,
ఎదనిండ మురిపెమూ ,
పొనరారు సొంపులూ , 
కొనలేని పేమలా ,
సిరులు కురిపించేటి ,
సిలక ఎంకంటాను !
సిరులు కురిపించేటి ,
సిలక ఎంకంటాను !

ఎనక మాటూ నొచ్చి 
యెగిరి కళ్ళని మూసి ,
ఎద ఈపు కదిమేసి ,
ఎవరు నేనం టేను ?
గుండె గురుతడతాది !
తడబాటు లేకుండ !
గుండె గురుతడతాది 
నిండు పున్నమి తావి !
..........................
డా .కృష్ణ సుబ్బారావు పొన్నాడ . 15 / 02 / 2015

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...