4, జనవరి 2021, సోమవారం

ద్వివేదుల విశాలాక్షి - ప్రముఖ రచయిత్రి - Pencil sketch



ద్వివేదుల విశాలాక్షి 15.8.1929 నాడు విజయనగరంలో జన్మించారు. మెట్రిక్ వరకే చదువుకున్నా సమాజాన్ని బాగా చదివారు. మొత్తం 13 నవలలు రాశారు. రెండు కధా సంకలనాలు వేసారు. దాదాపు 200 కి పైగా పుస్తక సమీక్షలు ఏశారు. తన నవల్ని తానే నాటకాలుగా మలచి రేడియోలో ప్రసారం చేసారు. ఈం రచనలు పలు భారతీయ భాషల్లోకి అనువాదం అయ్యాయిఇ.  ఈమె 'వారధి' నవల 'రెండు కుటుంబాల కధ' పేరుతో సినిమాగా వచ్చింది. 'వస్తాడే మా బావ' అనే సినిమాకి సంభాషణలు కూడా సమకూర్చారు. '

'గృహలక్ష్మి' స్వర్ణ కంకణాన్ని స్వీకరించారు. 1982లో ఆంధ్రప్రదే సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.  పలు దేశాలు పర్యటించిన ఈమె తన ప్రియమైన భీమిలిలో ఉందామని సముద్ర తీరంలో 'సాగరిక' నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 

తన పుస్తకాల హక్కులను విశాఖపట్నంలోని ద్వారకానగర్‌ పౌరగ్రంథాలయానికి ఆమె వ్రాసి యిచ్చింది. ఆంధ్ర, వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో పలువురు విద్యార్థులు ఆమె రచనలపై పరిశోధనలు జరిపి ఎంఫిల్‌, పీహెచ్‌డీలు పొందారు. నవంబర్ , 2014 న ఆమె విశాఖపట్నంలో మృతి చెందారు.

(సేకరణ : ఇక్కడా, అక్కడా..)





 

కామెంట్‌లు లేవు:

ముందు చూపు కలిగి - ఆటవెలది

ఎంత చక్కటి చిత్రమో 😍 ఆటవెలది // ముందు చూపు గలిగి ముందునిద్ర యనుచు  కన్ను మూసి మంచి కలలు గనుచు  హాయిననుభవించు రేయి పగలు  యంత దూర దృష్టి వింత...