9, ఆగస్టు 2021, సోమవారం

శరణు శరణు విభీషణ వరదా శరధి బంధన రామ సర్వ గుణ స్తోమ - అన్నమయ్య కీర్తన


 

నా చిత్రంతో ఓ అన్నమయ్య కీర్తన :

శరణు శరణు విభీషణ వరదా
శరధి బంధన రామ సర్వ గుణ స్తోమ
చరణములు
1
మారీచాను బాహు మద మర్ధన
తాటకా హార క్రూరేంద్ర జిత్తుల గుండు గండా
దారుణ కుంభ కర్ణ దనుజ శిరచ్ఛేదక
వీరప్రతాప రామ విజయాభి రామ
2
వాలి నిగ్రహ సుగ్రీవ రాజ్య స్థాపక
లాలిత వానర బల లంకా పహార
పాలిత సవ నా హల్య పాప విమెాచక
పౌలస్త్య హరణ రామ బహు దివ్య నామ
3
శంకర చాప భంజక జానకీ మనోహర
పంకజాక్ష సాకేత పట్టణాధీశ
అంకిత బిరుదు శ్రీ వేంకటాద్రినివాస
సోంకార రూప రామ పురు సత్య కామ
శ్రీ రామ చంద్రునికి శరణాగతిని వినిపిస్తున్నారు. అన్నమా చార్యుల వారు.
శరధి బంధనా =అంటే సముద్రమును బంధించి దానిపై వారధి గట్టిన వాడని అర్ధం.
పౌలస్త్యహరణ =అంటే రావణాంతక అని అర్ధం
ఉరు సత్యకామ= అంటేశ్రేష్టమైన సత్య వాక్య పరిపాలకుడు.
విభీషణుని అనుగ్రహించిన శ్రీ రామ చంద్రా శరధి బంధన సాగరమును బంధించి సేతువును నిర్మించిన రామా
సర్వ గుణ స్తోమా =(సర్వ గుణముల నిలయా )
శరణు ని న్ను శరణు వేడెదను తండ్రి.

ఈ కార్తనకి చక్కని వ్యాఖ్యానం అందించారు డా. ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల గారు. ఈ క్రింది లింక్ క్లిక్ చేసి వినండి.


ఈ కీర్తన చాలా అద్భుతం శ్రీ జి. నాగేశ్వర నాయుడు గారు గానం చేసారు. ఈ క్రింది లింక్ క్లిక్ చేసి వినండి.


ధన్యవాదాలు.

కామెంట్‌లు లేవు:

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...