8, ఆగస్టు 2021, ఆదివారం

నూకల చిన్నసత్యనారాయణ - Dr. Nookala Chinna Saytyanarayana, Carnatic vocalist

Pencil drawing

Indian classical legends
Padmabhushan Dr. Nookala Chinna Satyanaranayana, Classical Carnatic vocalist (4th August 1923 - 11th July, 2013)
మహామహాపోధ్యాయ 'పద్మభూషణ్' డా. నూకల చినసత్యనారాయణ - ప్రఖ్యాతి గాంచిన కర్ణాటక సంగీత విద్వాంసుడు. . సాధనలో బోధనలో ఆయన ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు. ఆయన స్వస్థలం విశాఖ జిల్లా అనకాపల్లి. 1927 ఆగస్టు 4న జన్మించాడు.
వీణా విద్వాంసుడు కంభంపాటి అక్కాజీ రావు ఆయన తొలిగురువు. ఆయన దగ్గర కొంత కాలం పాటు వయొలిన్ విద్యనభ్యసించాడు. తరువాత మంగళంపల్లి పట్టాభిరామయ్య దగ్గర కొంతకాలం బెజవాడలో శిష్యరికం చేశాడు. తరువాత విజయనగరం సంగీత కళాశాలలో ద్వారం వెంకటస్వామి నాయుడు దగ్గర శిష్యరికం చేశాడు. డాక్టర్ శ్రీపాద పినాకపాణి గురుత్వంలో ఆయన జీవితం మేలి మలుపు తిరిగింది.
లండన్ మేయర్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాడాడు. అమెరికా ఆహ్వానం మేరకు అక్కడా తల గళాన్ని వినిపించాడు. ప్రతిష్ఠాత్మకమైన మద్రాసు సంగీత పీఠం నుంచి సంగీతాచార్యుడిగా గుర్తింపు పొందాడు. కేంద్ర సంగీత నాటక పురస్కారాన్నీ అందుకున్నాడు. రాగలక్షణ సంగ్రహం అనే పుస్తకాన్ని రచించాడు. మూడు వందలకుపైగా కర్ణాటక, హిందుస్థానీ రాగాల అనుపానులు విపులీకరించారు. పంచరత్న కీర్తనలను మోనోగ్రాఫ్ మీద వెలువరించారు. రాష్ట్రం లోని పలు సంగీత కళాశాలల్లో వివిధ స్థాయిల్లో పనిచేశారు.

 

కామెంట్‌లు లేవు:

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...