ఈ వారం అన్నమయ్య కీర్తన - వీడివో యిదె వింతదొంగ | వేడిపాలు వెన్న వెరజినదొంగ ||
30, డిసెంబర్ 2022, శుక్రవారం
వీడివో యిదె వింతదొంగ | వేడిపాలు వెన్న వెరజినదొంగ - అన్నమయ్య కీర్తన
ఈ వారం అన్నమయ్య కీర్తన - వీడివో యిదె వింతదొంగ | వేడిపాలు వెన్న వెరజినదొంగ ||
24, డిసెంబర్ 2022, శనివారం
చక్రమా హరి చక్రమా వక్రమైన దనజుల వక్కలించవో - అన్నమయ్య కీర్తన
వక్రమైన దనుజుల వక్కలించవో
చుట్టి చుట్టి పాతాళము చొచ్చి హిరణ్యాక్షుని
చట్టలు చీరిన ఓ చక్రమా
పట్టిన శ్రీహరి చేత పాయక ఈ జగములు
ఒట్టుకొని కావ గదవొ ఓ చక్రమా
పానుకొని దనుజుల బలు కిరీట మణుల
సానల దీరిన ఓ చక్రమా
నానా జీవముల ప్రాణములు గాచి ధర్మ-
మూని నిలువ గదవో ఓ చక్రమా
వెఱచి బ్రహ్మాదులు వేద మంత్రముల నీ
వుఱుట్లు కొనియాడే రో చక్రమా
అఱిముఱి తిరు వేంకటాద్రీశు వీధుల
ఒఱవుల మెఱయుదువో చక్రమా
15, డిసెంబర్ 2022, గురువారం
దిబ్బలు వెట్టుచి తేలినదిదివో ఉబ్బునీటిపై ఒక హంసా! - అన్నమయ్య కీర్తన
దిబ్బలు వెట్టుచి తేలినదిదివో ఉబ్బునీటిపై ఒక హంసా! - అన్నమయ్య కీర్తన
అన్నమాచార్యులు ఆ ఆపదమొక్కుల వాడిని హంసగా అభివర్ణిస్తూ రచించిన ఈ పదావళి ఆయన కవితాత్మక దృష్టికి, భావుకతకు ప్రతిబింబం. క్షీరసాగరలో శయనించే ఆ శ్రీమహావిష్ణువు ఆ భాగవతోత్తముడికి, ఎగిసే అలలపై తేలే తెల్లని కలహంసలా కనిపిస్తున్నాడట! ఆ అనుభూతికే అక్షరరూపమిస్తూ ఈ భక్తకవి ఇలా చెప్తున్నాడు.
దిబ్బలు వెట్టుచి తేలినదిదివో
ఉబ్బునీటిపై ఒక హంసా!
అనువున కమలవిహారమె నెలవై
ఒనరి యున్న దిదె ఒక హంసా!
మనియెడి జీవుల మానస సరసుల
వునికి నున్న దిదె ఒక హంసా!
పాలు నీలు వేర్పరచి, పాలలో
ఓలలాడెనిదె ఒక హంసా!
పాలుపడిన ఈ పరమహంసముల
ఓలినున్న దిదె నొక హంసా!
తడవి రోమరంధ్రముల గ్రుడ్ల
నుడుగక పొదిగీ నొక హంసా!
కడు వేడుక వేంకటగిరిమీదట
నొడలు పెంచె నిదె నొక హంసా!
భావం.. శ్రీమతి బి. కృష్ణకుమారి.
దిబ్బలు వెట్టుచు అంటే సమంగా ఉండే నీటిపై ఎత్తులు కల్పిస్తూ అని, ఉబ్బునీరు అంటే పొంగుతున్న నీరు అని అర్ధం. పరిశుధ్ధతకు ప్రతిరూపమైన ఆ పరమాత్మను పరమహంసతో పోల్చి పరవశించెను ఆ పదకవితాపితామహుడు.
ఆ శంఖచక్రధారి శేషసాయిగా శ్రీమహాలక్ష్మితో కలిసే ఉంటాడు. ప్రకృతి పురుషులకు ప్రతీకగా ఇరువురి మధ్య అనుబంధం అంత గాఢమైనది. అలాంటి స్వామిని నిరంతరం సరస్సుని నెలవుగా చేసుకొని జీవించే మరాలంతో సరిపోల్చుతున్నాడు అన్నమయ్య. అంతే కాకుండా లోకంలోని సమస్తజీవులనే మనస్సులనే సరస్సులో భగవంతుడు కొలువై ఉంటాడని ప్రస్ఫుటం చేస్తున్నాడు, హంసకు హిమాలయాల్లోని మానససరోవరం ఎలాగో, ఆ పరంధాముడికి పరమభక్తుల హృదయాలు కూడా అంతే అంటున్నాడు అన్నమయ్య.
హంస అనగానే నీళ్ళు కలిపిన పాలను ముందు పెడితే నీళ్ళను వదిలి పాలను మాత్రమే తాగుతుందని అనాదిగా వింటున్న ఐతిహాసిక భావన. దీనిని సజ్జనుల విచక్షణ లక్షణానికి ప్రతీకాత్మకంగా సాహుతీవేత్తలు సరిపోల్చుతారు. భగవంతుడు కూడా అలాగే పాపపుణ్యాలనే నీరక్షీరములను వేరు చేసి, పావనచరితుల, పరమహంసల పక్షమే వహిస్తాడు. ఆ పన్నగశయనుడు పాలకడలిలో పవళిస్తుండడం వెనుక పరమార్ధమిదే అని అంటున్నాడు అన్నమయ్య.
హంస తన రెక్కలమాటున పెట్టుకొని గుడ్లను పొదిగినట్లు, భగవంతుడు కూడా అండపిండ బ్రహ్మాండాలను అంతర్బహిర్యామినిగా ఆక్రమించి సృష్టిని నడుపుతున్నాడట! అలా లోకాలన్నీ ఆయన రక్షణలో మనుగడ సాగిస్తున్నాయట. అంతటి విశిష్టత కలిగిన ఆ పరమాత్ముడు వేడుకగా వేంకటగిరిపై వేంచేసి ఉన్నాడని అన్నమయ్య అభివర్ణిస్తున్నాడు. 'తడవి' అంటే ప్రేమతో తాకి, 'ఉడుగక' అంటే తగ్గక. 'ఒడలు' అంటే శరీరం అని అర్ధాలు. ఆ కారణజన్ముడు కమనీయంగా రచించిన ఆ కీర్తనను శ్రీమాన్ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు పరిశోధించి ఆ పదాలకు అర్థాలను తేటపరిచారు. ఇలా అన్నమాచార్యుల ఎన్నో కీర్తనలు మనం సులువుగా పాడుకొని పరవశించడానికి రాళ్ళపల్లి వారు పరోక్షకారకులు., వందనీయులు.
సేకరణ. పొన్నాడ లక్ష్మి.
14, డిసెంబర్ 2022, బుధవారం
సఖియను వలచిన వలపులు మురిసెను చెలియను తలచిన సమయము మురిసెను - గజల్
నా చిత్రానికి మిత్రుడు శ్రీ RVSS Srinivas రచించిన గజల్
సర్వలఘువుల గజల్
మనసు తంత్రులను శృతిచేస్తూ బ్రతుకు గీతం పాడాలి - కవిత
10, డిసెంబర్ 2022, శనివారం
కవిసార్వభౌమ, స్వరాజ్యకవి - వడ్డాది సీతారామాంజనేయ కవి -
వడ్డాది సీతారామాంజనేయులు కవి రచించిన దండాలు దండాలు భారత మాత గేయం ఎంతో ప్రాచుర్యం పొందింది. ఆ పాట ఆంగ్లేయుల పాలనను విశదపరుస్తుంది.
''దండాలు దండాలు భారతమాత
నీవందుకోని దీవించు భారతమాత
నీవందుకోని దీవించు భారతమాత
దండాలు దండాలు భారత మాత
మా కొంపల్ని కూల్చినారే భారతమాత''
9, డిసెంబర్ 2022, శుక్రవారం
ఆనందనిలయ ప్రహ్లాదవరదా భానుశశినేత్ర జయ ప్రహ్లాదవరదా - అన్నమయ్య కీర్తన
చిత్ర లేఖనం : పొన్నాడ మూర్తి
(॥పల్లవి॥)
ఆనందనిలయ ప్రహ్లాదవరదా
భానుశశినేత్ర జయ ప్రహ్లాదవరదా
(॥ఆనం॥)
పరమపురుష నిత్య ప్రహ్లాదవరదా
హరి యచ్యుతానంత ప్రహ్లాదవరదా
పరిపూర్ణ గోవింద ప్రహ్లాదవరదా
భరిత కల్యాణగుణ ప్రహ్లాదవరదా
(॥ఆనం॥)
భవరోగసంహరణ ప్రహ్లాదవరదా
అవిరళ కేశవ ప్రహ్లాదవరదా
పవమాననుతకీర్తి ప్రహ్లాదవరదా
భవపితామహవంద్య ప్రహ్లాదవరదా
(॥ఆనం॥)
బలయుక్త నరసింహ ప్రహ్లాదవరదా
లలిత శ్రీవేంకటాద్రి ప్రహ్లాదవరదా
ఫలితకరుణారస ప్రహ్లాదవరదా
బలివంశకారణ ప్రహ్లాదవరదా
ఆనందనిలయుడైన ఓ ప్రహ్లాదవరదా నీకు జయమగుగాక ! సూర్యచంద్రులు కన్నులుగాగల ఓ నరసింహస్వామీ నీకు జయము పలికెదను ప్రభూ !
స్వామీ ! నీవు పరమపురుషుడవు. శ్రీహరివి. నాశనములేని అచ్యుతడవు. నీకు పరిపూర్ణత తప్ప కొద్దిగా ఉండటం అనేది లేదు. గోవులవంటి సమస్త జీవులను పాలించే గోవిందుడవు. నీవే ప్రహ్లాదవరదుడవు. అట్టి నీకు జయమగుగాక!
పురాకృతకర్మలవల్ల సంప్రాప్తమయ్యే భవరోగమును అణచగల శక్తి నీకు మాత్రమే ఉన్నది. నీవు అవిరళమైనవాడివి. కేశవుడవు. పవమననుత కీర్తివి. పితామహవంద్యుడవు. భవుడవు. అట్టి ప్రహ్లాదవరదుడా ! నీకు జయమగుగాక !
ప్రభూ నీవు అమిత బలశాలివి.
వేంకటాద్రి మీదనున్న లలిత శృంగార రాయుడైన శ్రీవేంకటేశ్వరిడివి నీవే. కరుణారసమును ప్రతిఫలించే
ప్రహ్లాదవరదుడైన కారుణ్యమూర్తివి నీవే! బలివంశమును రక్షించి పోషించిన త్రివిక్రముడవు
నీవే ! అట్టి నీకు జయమగుగాక!
8, డిసెంబర్ 2022, గురువారం
పదవుల నొక ముద్దిడగా - కవి సామ్రాట్ కీ. శే. నోరి నరసింహ శాస్త్రి పద్యములు
My Pencil sketch
పెదవుల నొక ముద్దిడగా
సదయత నొప్పితివి మేలు సకియా, ఇదె నా
పెదవుల గదించి పెదవులు
వదలను పలవశత ప్రాణి వదలెడు దాకన్
వదలర పెదవులు వదలర,
సద మద మయితిని గదయ్యొ సామీ యపుడే
వదలితి నీ ముద్దుల కీ
పెదవుల, నిక వదలి బ్రదికి బ్రదికింపు ననున్ !
(కవి సామ్రాట్ కీ. శే. నోరి నరసింహ శాస్త్రి పద్యములు)
4, డిసెంబర్ 2022, ఆదివారం
దేవానంద్ - చరిత్ర సృష్టీంచిన భారతీయ నటుడు
Devanand - black and white pencil sketch drawn by me.
ప్రముఖ భారతీయ ఆంగ్ల రచయిత ఆర్కె నారాయణ్ రచించిన 'గైడ్' నవల సినిమాగా తీస్తే బాగుంటుందని దేవానంద్ కి ఓ మిత్రుని సలహా.. ఆ నవల రాత్రంతా ఏకధాటిని చదవడం, రచయితని ఒప్పించడం అన్నీ చకాచకా సాగిపోయాయి. అయితే నవల లో కధానాయిక పాత్రని low light లో చూపించడం భారతీయు ప్రేక్షకులు స్వీకరిస్తారా లేదా అన్నది ఓ పెద్ద సమస్య. అటువంటి నవలని చిత్రంగా నిర్మించాలంటే అదొక పెద్ద సాహసమే..! 'వద్దు.. నష్టపోతావు' అని మిత్రులు చెప్పినా సాహసించాడు దేవానంద్.
దర్శకునిగా ఎవర్ని పెట్టుకోవాలి అన్నగారు చేతన్ ఆనంద్ నా, లేక రాజ్ ఖోస్లా నా? అనే అంశంపై తర్జన భర్జన లు జరిగిన పిమ్మట చేతన్ ఆనంద్ నే దర్శకునిగా పెట్టుకున్నాడు. అయితే S D Burman పాడిన 'వహా కౌన హై తెరా' పాట దృశ్యీకరించడం కూడా అయిపోయిన తర్వాత హీరోయిన్ ఎంపిక విషయంలో అన్నగారితో విభేదాలు తలెత్తటంటో చేతన్ అనంద్ ఈ project నుండి తొలగిపోయాడు. అప్పుడు తమ్ముడు విజయ్ ఆనంద్ ని దర్శకుడిగా నియమించుకున్నాడు.
సంగీత దర్శకుణ్ణి ఎస్.డి. బర్మన్ ని పెట్టుకుంటే ఆయనకి heart attack రావడంతో తాను కొనసాగించలేనని మరో దర్శకుడికి ఆ బాధ్యతలు అప్పగించమన్నాడు బర్మన్ దా. అందుకు దేవానంద్ ససేమిరా అంగీకరించలేదుట. మీరు కోలుకునేవరకూ వేచి ఉంటానని చెప్పి, అంతవరకూ నిరీక్షించి పాటలన్నీ ఆయనచేతనే కంపోజ్ చేయించాడు.
ఇంక పాటల రచయిత విషయంలోనూ సమస్య ఎదురైంది. హస్రత్ జైపూరి ని పాటల రచయితగా నియమించుకున్నారు. కాని ఓ పాట lyrics లో మార్పులు చేయమని బర్మన్ దా అడిగితే వారు దానికి అంగీకరించలేదుట . ఒప్పందమైన పారితోషకాన్ని వారికి ఇచ్చేసి, పాటల రచన బాధ్యతని శైలేంద్ర కి అప్పగించారు.
ఇంకా ఎన్నో సమస్యలతో ఎంతో ధైర్యంతో ప్రారంభించిన ఈ చిత్రం అనూహ్యంగా అఖండ విజయం సాధించింది. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇదొక classic గా పేరొందింది. పలు పురస్కారాలు దక్కించుకుంది. 'దేవానంద్ అంటే గైడ్, గైడ్ అంటే దేవానంద్' అనిపించుకుంది.
దేవానంద్ నటించిన మేటి చిత్రాలు గైడ్, హమ్ దోనోం, కాలాపాని ఇత్యాది చిత్రాలు పలువురి ప్రశంసలు పొందాయి. పురస్కారాలు దక్కించుకున్నాయి.
ఈ రోజు దేవానంద్ వర్ధంతి సందర్భంగా నా చిత్ర నివాళి.
(సేకరణ : ఇక్కడా, అక్కడా)
దాచుకో నీపాదాలకు దగ నే జేసినపూజ లివి - అన్నమయ్య కీర్తన
ఈ వారం అన్నమయ్య కీర్తన : దాచుకో నీ పాదాలకు దగ నే జేసిన పూజ లివి.
పండు వాళ్ళ నాన్న - కథ
నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న' 'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...
-
మిత్రులు మాధవరావు కొరుప్రోలు గారు రచించిన గజల్ : పలుకుతేనె పాటలలో..రాశి పో''సినారె'' భళారే..! తెలుగువీణియ శృతి..తెల...
-
Dr. C. Narayana Reddy - My pencil sketch పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె వర్థంతి నాడు వారికి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొ...
-
పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె కి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొన్ని భాగాలు ప్రపంచ పదులు ➿➿➿➿➿➿➿ సముద్రానికి చమురు పూస్తే నల్ల ...