ఈ రోజు శ్రీమతి కల్యాణి గౌరి భమిడిపాటి గారు నా చిత్రానికీ స్పందిస్తూ facebook లో ఓ పోస్ట్ పెట్టారు. అంశం జడ సౌందర్యం. పోస్టు లింక్ క్రింద ఇస్తున్నాను. చదవండి.
https://www.facebook.com/groups/542646195772540/permalink/6525326737504426/?mibextid=Nif5oz
https://www.facebook.com/groups/542646195772540/permalink/6525326737504426/?mibextid=Nif5oz
పద్మనాభం - My charcoal pencil sketch
పద్మనాభం! తెలుగు తెర హాస్య నటశ్రేణిలో అగ్రగణ్యుడు. రెండు మూడు దశాబ్దాల పాటు ప్రేక్షక జనాన్ని నవ్వుల జల్లుల్లో తడిపిన నట ప్రముఖుడు. అనేకానేక చిత్రాలు నిర్మించి విజయాలూ ప్రశంసలూ పొందిన విలక్షణ కళాభిజ్ఞుడు. అనేకమంది కొత్తవారిని పరిచయం చేసి సినీజీవితం అందించిన అనుభవశాలి. శ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రం ద్వారా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను గాయకునిగా పరిచయం చేసిన ఘనత పద్మనాభానిదే .
మరిన్ని వివరాలు ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చదవండి
వంగర వెంకట సుబ్బయ్య (నవంబరు 24, 1897 - 1975) (Vangara Venkata Subbaiah), తెలుగు సినిమా, నాటక రంగాలలో వంగర గా ప్రసిద్ధుడైన హాస్యనటుడు .
ఈయన ఒంగోలు తాలూకా సంగం జాగర్లమూడిలో 1897, నవంబరు 24 న కోటయ్య, వెర్రెమ్మ దంపతులకు జన్మించాడు.
తెనాలిలో స్థిరనివాసం ఏర్పరచుకుని, స్థానం వారితో చేరి 'శ్రీకృష్ణ తులభారం' నాటకంలో వసంతకుడు వేషం వేసి కళాహృదయుల మన్ననలందుకున్నాడు. ఈయన ఇంకా 'విప్రనారాయణ', 'సక్కుబాయి' మొదలగు నాటకాలలో హాస్య భూమికలను పోషించాడు.
1937లో విప్రనారాయణ చిత్రంలో శిష్యుడుగా వేషంవేసి, ఆంధ్ర సినిమా ప్రేక్షకుల మీద సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు. తరువాత బాలయోగిని చిత్రంలో ప్రధాన భూమికను పోషించాడు. ఈయన ఇంచుమించు వందకు పైగా తెలుగు చిత్రాలలో నటించాడు.
వీటిలో పెద్దమనుషులు, కన్యాశుల్కం, లక్ష్మమ్మ, ప్రియురాలు, లక్ష్మి, చక్రపాణి, పల్నాటి యుద్ధం, తెనాలి రామకృష్ణ, శ్రీకృష్ణ తులాభారం, గీతాంజలి, మంత్రదండం, పేరంటాలు, శాంతి, సక్కుబాయి ముఖ్యమైనవి.
1975లో మరణించారు.
మరిన్ని వివరాలు ఈ క్రింది లింక్ లో క్లిక్ చేసి చదవండి.
రచన: కొసరాజు
సంగీతం: ఓగిరాల, అద్దేపల్లి
గానం: ఘంటసాల
ఘంటసాల: నందామయా గురుడ నందామయా!
ఆనందదేవికి నందామయా
బృందం: నందామయా గురుడ నందామయా!
ఆనందదేవికి నందామయా
ఘంటసాల: స్వారాజ్య యుద్ధాన జయభేరి మ్రోగించి
శాంతమూర్తులు అంతరించారయా
స్వాతంత్ర్య గౌరవము సంతలో తెగనమ్ము
స్వార్ధ మూర్తులు అవతరించారయా
బృందం: నందామయా గురుడ నందామయా ఆనందదేవికి నందామయా
ఘంటసాల: వారు వీరౌతారు, వీరు వారౌతారు
మిట్ట పల్లాలేకమౌతాయయా
తూరుపూ దిక్కునా తోకచుక్కా పుట్టి
పెద్ద ఘటముల కెసరు పెట్టేనయా
బృందం: నందామయా గురుడ నందామయా! ఆనందదేవికి నందామయా
ఘంటసాల: కనకాద్రి శిఖరాన శునకమ్ము సింహమై
ఏడుదీవుల రాజ్యమేలేనయా
గుళ్ళు మ్రింగేవాళ్ళు, నోళ్ళు గొట్టేవాళ్ళు
ఊళ్ళో చెలామణీ అవుతారయా
బృందం: నందామయా గురుడ నందామయా! ఆనందదేవికి నందామయా
ఘంటసాల: అ,ఆ లు రానట్టి అన్నయ్య లందరికి
అధికార యోగమ్ము బడుతుందయా
కుక్క తోకా పట్టి గోదావరీదితే
కోటిపల్లీ కాడ తేలేరయా
బృందం: నందామయా గురుడ నందామయా! ఆనందదేవికి నందామయా
ఘంటసాల: గొఱ్ఱెల్లు దినువాడు గోవింద గొడ్తాడు
బఱ్ఱెల్లు తినువాడు వస్తాడయా
పగలి చుక్కలు మింట మొలిపించునంటాడు
నగుబాట్లు పడి తోక ముడిచేనయా
బృందం: నందామయా గురుడ నందామయా! ఆనందదేవికి నందామయా
ఘంటసాల: అప్పు చేసినవాడు పప్పు కూడు తిని
ఆనందమయుడౌచు తిరిగేనయా
అర్ధమిచ్చినవాడు ఆకులలములు మేసి
అన్నానికాపన్నుడౌతాడయా
బృందం: నందామయా గురుడ నందామయా! ఆనందదేవికి నందామయా
ఘంటసాల: దుక్కి దున్నేవాడు భూమి కామందౌచు
దొరబాబు వలే చలాయిస్తాడయా
అద్దెకుండేవాడె యింటి కామందునని
ఆందోళనము లేవదీస్తాడయా
బృందం: నందామయా గురుడ నందామయా! ఆనందదేవికి నందామయా
ఘంటసాల: ఆంబూరు కాడ యాటంబాంబు బ్రద్దలై
తొంబ తొంబగ జనులు చచ్చేరయా
తిక్క శంకరస్వామి చెప్పింది నమ్మితే
చిక్కులన్నీ తీరిపోతాయయా | తిక్క శంకర |
బృందం: నందామయా గురుడ నందామయా! ఆనందదేవికి నందామయా
ఆనందదేవికి నందామయా
సభ ఆద్యతం చాలా ఉత్సాహంగా జరిగింది. సినిమా పరిశ్రమకు సంబధించి Pandemic సమయంలో ప్రేక్షకుల ఆలోచనా విధానంలో ఎటువంటి మార్పులు వచ్చాయో, OTT లో విడుదలయ్యే సినిమాలకు ఇంట్లోనే కూర్చుని సినిమా చూసే వెసులుబాటుకు ప్రేక్షకులు ఎల్ల connect అయ్యారో పట్నాయక్ గారు తన ఉపన్యాసంలో తెలియజేశారు. తర్వాత ప్రేక్షలతో ముఖాముఖీ కార్యక్రమం లో నేటి సినిమా పరిశ్రమ గురించి పలు విషయాలు చర్చించారు.
ఆగస్టు నెల 12, 13 తేదీలలో నా చిత్ర ప్రదర్శన కూడా నిర్వహించబోతున్నట్టు Vizag Film Society వారు ప్రకటించడం చాలా ఆనందాన్ని కలిగించింది.
సభా నిర్వహకులకు నా బ్లాగు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
శ్రీ పట్నాయక్ గారికి గతంలో నేను ప్రచిరించిన My Pencil Feats పుస్తకం నా శ్రీమతి చేతులమీదుగా
వారికి సమర్పించుకునే భాగ్యం కలిగింది.
నా charcoal pencil చిత్రం.
వేదాంతం రాఘవయ్య మంచి కూచిపూడి కళాకారుడే కాకుండా, పలు విజయవంతమైన తెలుగు సినిమాలకు దర్శకత్వం, మరి కొన్ని సినిమాలకు నృత్య దర్శకత్వం కూడా వహించిన ఘనుడు. అంతే కాక కొన్ని సినిమాలలో నటించారు కూడా.
తెలుగు చలనచిత్రసీమలో చరిత్ర సృష్టించిన ఓ సాంఘిక చిత్రం దేవదాసు. నాట్యరంగానికి సంబంధించిన ఓ కళాకారుడు దేవదాసు వంటి విషాద చిత్రానికి దర్శకత్వం వహించడం, అసంఖ్యాక మన్ననలు పొందండం ఓ అరుదైన ఘనతగా చెప్పుకోవచ్చు..ఇది వేదాంతం వారి దర్శకత్వ ప్రతిభకు తార్కాణం. దేవదాసు నిర్మించిన వినోదా సంస్థ వారు వేదాంతం వారి ప్రతిభను ఎలా అంచనావేశారో అన్నది నా దృష్టిలో ఓ పెద్ద వింత.
క్షాత్రము రూపుగైకొనిన సాహసికున్ నిను గాంచి భారత
క్షేత్రమునందు పొంగి పులకించినదోయి త్రిలింగజాతి; సు
క్షత్రియవీర ! నీ విజయ శంఖము బ్రద్ధలుసేసె శాత్రవ
శ్రోత్రములన్ భవత్పదము సోకుట మన్యము ధన్యమయ్యెరా !
పౌరుషము, పట్టుదల, దేశభక్తి, ధైర్య
సాహసమ్ము లనన్యాదృశములు గాగ
తెలుగుగుండెలు వెలిగించితివి, స్వతంత్ర
యజ్ఞమున నిండు బ్రతుకు 'స్వాహా' యొనర్చి !
('కరుణశ్రీ' జంధ్యాల పాపయ్య శాస్త్రి)
1951 నుండీ రచనలు చేశారు. ఆంగ్ల, ఆంధ్ర సాహిత్యం, ప్రాచీనాంధ్రసాహిత్యం చదివారు. తెలుగు స్వతంత్రలో ఇంగ్లీషు విభాగానికి ఉపసంపాదకులుగా పనిచేశారు. అనువాదాలు కూడా చేశారు. స్త్రీ సంక్షేమ సంస్థలలో పనిచేశారు. ఈమె రామలక్ష్మి ఆరుద్ర అన్న కలంపేరుతో కూడా రచనలు చేశారు. (courtesy : వికీపీడియా)
మరిన్ని వివరాలు 'ప్రజాశక్తి' దినపత్రికలో వచ్చిన వ్యాసం ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చదవండి.
నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...