21, జులై 2023, శుక్రవారం

వాలుజడ

ఓ వాలుజడా మల్లెపూల జడా....

వీపుకి మెడకి భుజములకి తగు అందం తెచ్చే జడా
ఈ తగవులేలనే జడా
కులుకుల నడుముకి వెనకన తిరుగుతు కళకళలాడే జడా
నను కనికరించవే జడా
పిరుదుల బిరుదుల జడగంటలతో జగతికి చాటే జడా
నా పొరపాటేమే జడా
అత్తరి ఇత్తర అనుమానాల తత్తర బిత్తర జడా
ఎద కత్తిరించకే జడా..ఆ ..ఆ

కనికట్టు జడా కనిపెట్టు జడా
పనిపట్టు జడా..ఆ..పనిపెట్టు జడా
నిను విడువని ప్రేమికుడా....

వడిసేలల్లే తిప్పితే జడా గుండెలోన దడదడా
ఏ గుబులు రేపకే జడా
నడుము తిప్పుడూ నాగస్వరానికి నాగుపామువే జడా
నగుమోము చూపవే జడా
జెడ కోలాటం సరసమె కానీ జగడము కాదే జడా
నను సరసకు రానీ జడా
జెడని దువ్వని పొగడని మొగుడు జఢపదార్ధమే జడా
నిను దువ్వనీయవే జడా...ఆ..ఆ

కనువిందు జడా నను పొందు జడా
సరసాల జడా ఇక చాలు జడా
ఏనాటికి నీవాడా....జజడాం జగడ జఝడాం.

(నా చిత్రానికి పాట, సౌజన్యం: రాధాగోపాలం సినిమా లో పాట)

 

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...