29, జులై 2023, శనివారం

వంగర వెంకటసుబ్బయ్య




Vangara Venkata Subbayya - Pen and ink sketch


వంగర వెంకట సుబ్బయ్య (నవంబరు 241897 - 1975) (Vangara Venkata Subbaiah), తెలుగు సినిమా, నాటక రంగాలలో వంగర గా ప్రసిద్ధుడైన హాస్యనటుడు .

ఈయన ఒంగోలు తాలూకా సంగం జాగర్లమూడిలో 1897నవంబరు 24 న కోటయ్య, వెర్రెమ్మ దంపతులకు జన్మించాడు.

తెనాలిలో స్థిరనివాసం ఏర్పరచుకుని, స్థానం వారితో చేరి 'శ్రీకృష్ణ తులభారం' నాటకంలో వసంతకుడు వేషం వేసి కళాహృదయుల మన్ననలందుకున్నాడు. ఈయన ఇంకా 'విప్రనారాయణ', 'సక్కుబాయి' మొదలగు నాటకాలలో హాస్య భూమికలను పోషించాడు.

1937లో విప్రనారాయణ చిత్రంలో శిష్యుడుగా వేషంవేసి, ఆంధ్ర సినిమా ప్రేక్షకుల మీద సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు. తరువాత బాలయోగిని చిత్రంలో ప్రధాన భూమికను పోషించాడు. ఈయన ఇంచుమించు వందకు పైగా తెలుగు చిత్రాలలో నటించాడు.

 వీటిలో పెద్దమనుషులుకన్యాశుల్కంలక్ష్మమ్మప్రియురాలులక్ష్మిచక్రపాణిపల్నాటి యుద్ధంతెనాలి రామకృష్ణశ్రీకృష్ణ తులాభారంగీతాంజలిమంత్రదండంపేరంటాలుశాంతి, సక్కుబాయి ముఖ్యమైనవి.

1975లో మరణించారు.


మరిన్ని వివరాలు ఈ క్రింది లింక్ లో క్లిక్ చేసి చదవండి. 

https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%82%E0%B0%97%E0%B0%B0_%E0%B0%B5%E0%B1%86%E0%B0%82%E0%B0%95%E0%B0%9F%E0%B0%B8%E0%B1%81%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...