24, జులై 2023, సోమవారం

బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ R. P. Patnaik - pencil sketch

నిన్న, అంగా 23.07.2023 నాడు,  విశాఖపట్నంలో Vizag Film Society వారి ఆధ్వర్యంలో బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ ఆర్.కే. పట్నాయక్ గారికి ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా పట్నాయక్ గారికి నేను సమర్పించుకున్న వారి చిత్రం. 

సభ ఆద్యతం చాలా ఉత్సాహంగా జరిగింది. సినిమా పరిశ్రమకు సంబధించి  Pandemic సమయంలో ప్రేక్షకుల ఆలోచనా విధానంలో ఎటువంటి మార్పులు వచ్చాయో, OTT లో విడుదలయ్యే సినిమాలకు ఇంట్లోనే కూర్చుని సినిమా చూసే వెసులుబాటుకు ప్రేక్షకులు ఎల్ల connect అయ్యారో పట్నాయక్ గారు తన ఉపన్యాసంలో తెలియజేశారు. తర్వాత ప్రేక్షలతో ముఖాముఖీ కార్యక్రమం లో నేటి సినిమా పరిశ్రమ గురించి పలు విషయాలు చర్చించారు.

 
ఆగస్టు నెల 12, 13 తేదీలలో నా చిత్ర ప్రదర్శన కూడా నిర్వహించబోతున్నట్టు Vizag Film Society వారు ప్రకటించడం చాలా ఆనందాన్ని కలిగించింది.


సభా నిర్వహకులకు నా బ్లాగు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.


శ్రీ పట్నాయక్ గారికి గతంలో నేను ప్రచిరించిన My Pencil Feats పుస్తకం నా శ్రీమతి చేతులమీదుగా

వారికి సమర్పించుకునే భాగ్యం కలిగింది.






 

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...