తలపుల_దొంతులు కవిత courtesy శ్రీమతి పద్మజ చెంగల్వల (line drawing by me)
తడిపొడి జ్ఞాపకాల పందిళ్ళలో తనివితీరా తడిసిన.....తమకపు మోహం ..
అలవోకగా జారుతోంది..
బుగ్గన చుక్కై..!!!
..
మనసెప్పుడో మూతపడిపోయింది...
చిరునామా మరచెపోయింది..!!
..
పరుగు పందెల్లో గెలవడమే జీవితమా..?
ఇంతకీ నీది గెలుపా...నాది ఓటమా...?
మనసునో మాటు తట్టి చూడు...!!!
ఒంపేందుకు ఏమి లేవంటోంది కదూ...!
..
..
చుక్కల పందిరి కింద జ్ఞాపకాల తవ్వకాలు..!
చీకటి హత్తుకున్న రాత్రికి కాపలాగ.. కళ్ళకి..కలలకి
..
..
మురిసిన మబ్బులు...
మసకేసిన మబ్బులు
పరచుకున్న మబ్బులవిరులు...
..
కొన్ని ప్రేమలంతే
మనసుకు మాటలు నేర్పి..
మౌనిలా మారిపోతుంది
..
..
వలపు ముంగిట్లో..
ముచ్చట్లాడే ముంగురులు..
వలదన్నా .. వద్దన్నా వినవు కదా..!!
@@ **@@
#memoriesforever-stacked up....!!!!
***
Amused to drench lusciously under the web of memories..found a way to touch the epitome.
Doors to the inner self were sealed long ago.. Lost the way too..!!
In the game of life...
Did winning only counted ??
Who Won the race..?
Ohh..Is it yours ..
Did I loose?
Make a conversation within...
.. "it's nothing but emptiness"..!!
Under the blanket of a starry night...!
Memories strewn all around were dug again to reminiscence those candid moments...
to hug the eeriness of the dark and to safe guard the lucid dreams...!!!
Joyful windy pristine beauties of the azure canvas...Smeared to shower the ecstasy...
Billowed the canopy to grab the celestial beauties within...!!
The "Love".. whispers the innate subtleness to bloom...and gently ushers away in to a weird silence. ..!!
Making the moments to freeze.
In the cozy corners, musings often exude, converse, engage and trepid all around...
Not caring for the rejection..!!!
Hum and buzz..."You are mine"...!!!
Padmaja Chengalvala
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి